whatsapp Posted May 22, 2019 Report Posted May 22, 2019 భారత దేశ అలాగే ప్రపంచ చరిత్ర చదివిన వ్యక్తి గా చెబుతున్నా ! వంద కోట్ల మంది { భారత జనాభా లో చిన్న పిల్లలను , రాజకీయాలంటే ఆసక్తి లేని వారిని తీసేసి , భారత ఎన్నికల ఫలితాల పట్ల ఆసక్తి కనబరుస్తున్న విదేశాలలో స్థిరపడిన భారతీయుల్ని అలాగే విదేశీయుల్ని కలుపుకుంటే } ఒక్క రోజు కోసం.. ఒక్క రోజు కోసం వారాలుగా ఎదురుచూడడం... ఎప్పుడూ... ఎప్పుడూ.. జరగలేదు . ఆ రోజు రేపే ! మరో కొన్ని గంటల్లో వచ్చేస్తోంది . మన దేశం లోని మిగతా రాష్ట్రాల్లో కంటే తెలుగు వారిలో డబల్ ఆసక్తి ..... కారణం అందరికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల పై ఇక్కడ ప్రజల ఆసక్తి తగ్గిపోతుంది అనుకొన్నారు . కానీ తెలంగాణ ఎంపీ ఎన్నికల పై పెద్దగా చర్చ జరగడం లేదు . { తెరాస గెలుస్తుంది అనే నమ్మకం ప్రధాన కారణం } . అందరిలో ఒకటే ఆసక్తి .. అదే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అని . వేసవి సమయం లో చాల మంది తల్లి తండ్రులు { ఎంసెట్ , ఐఐటీ లాంటి ప్రవేశ ప్రవేశ పరీక్షలు రాసిన / రాస్తున్న పిల్లల } తమ పిల్లల భవిషత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతుంటారు . దానికంటే మించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాల్లో { పది లో తొమ్మిది కుటుంబాల్లో } ఇద్దరు వ్యక్తుల భవితవ్యం పై ఆందోళన . వారిద్దరూ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . రేపు ఏమవుతుంది .. రేపు ఎప్పుడు వస్తుంది అని ఊపిరి బిగపట్టుకొని వీరంతా ఎదురు చూస్తున్నారు . ఎగ్జిట్ పోల్స్ తరువాత లోక్ సభ ఫలితాల పట్ల ప్రతిపక్షాల అభిమానుల్లో ఆసక్తి కాస్త తగ్గినట్టు వుంది . కానీ ఎగ్జిట్ పోల్స్ తరువాత కూడా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రెండు శిబిరాల అభిమానుల్లో కాసంత కూడా దైర్యం సడల లేదు . తాము తప్పకుండ గెలుస్తామనే నమ్మకం ఇరు వర్గాల్లో కనిపిస్తోంది . ఇంతగా ఆసక్తి కలిగించిన , ఇంతగా నువ్వా నేనా అని జరిగిన ఎన్నికలు ఇప్పటిదాకా బహుశా జరగ లేదేమో . నిజానికి ఇది ప్రజాస్వామ్య విజయం . ప్రజలు రాజకీయాల పై ఇంత ఆసక్తి చూపడం ప్రజాస్వామ్య విజయం . అదే సమయం లో ఇది శృతి మించింది అనిపిస్తుంది కూడా . ఆ అతి లేకుంటే ఇది చరిత్ర లో మిగిలి పోయే సమయం . రేపు రానే వస్తుంది . చివరికి విజయం ఒక్కరికే దక్కుతుంది .{ ఆ ఒక్కరు ఎవరు అని ఆలోచిస్తున్నారా .. అది మా నాయకుడే అనుకుంటున్నారా ?}.. జయాపజయాలు .. ప్రజానిర్ణయాలు .. ఓటమి ని తట్టుకొనే స్థైర్యం తెలుగు వారిలో కాస్త తక్కువే .. అందుకే ఆత్మ హత్యా లు ఎక్కువగా జరుగుతుంటాయి { పరీక్ష లో ఫెయిల్ అయినప్పుడు .. ఇంకా రైతుల ఆత్మ హత్యలు }.. రేపటి విజయాన్ని చూసి పొంగిపోకుండా హుందాగా వుండే గుణాన్ని గెలిచిన పక్షం వారికీ , అలాగే ఓటమి వల్ల కుంగి పోకుండా .. ప్రతి ఓటమి మనలో లోపాలను సరిదిద్దుకొని ముందడుగు వేసి మరింత గొప్ప విజయాలను అందుకొనే అవకాశం ఇస్తుందని గ్రహించి మనోనిబ్బరంగా వుండే స్తైర్యం, ఓడిన పక్షం అభిమానులకు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకొంటున్నా. సత్యమేవ జయతే ! సర్వేజనా సుఖినోభవంతు !! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.