Jump to content

Recommended Posts

Posted
అమరావతిపై అడుగెటు..?
26-05-2019 02:50:45
 
636944507032938395.jpg
  • జగన్‌ మదిలో ఏముందో?.. స్పష్టత కోరుతున్న రైతులు
  • అమరావతిని రాజధానిగా ఎక్కడా వ్యతిరేకించని జగన్‌
  • భూములు, పనులతీరుపైనే సర్కార్‌పై ప్రధానంగా విమర్శ
  • వాటిని పట్టుకొని వ్యతిరేకి అంటూ మాధ్యమాల్లో ప్రచారం
  • కొత్తబాస్‌ ఇచ్చే స్పష్టతను బట్టే ఈ ప్రచారానికి తెరపడే వీలు
  • ఈ అనిశ్చితిలో ‘రియల్‌’ టెన్షన్‌
 
(ఆంధ్రజ్యోతి-అమరావతి): సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ విజయదుందుభి మోగించి, కొద్ది రోజుల్లోనే అధికారపీఠాన్ని అధిష్ఠించనున్నవేళ రాజధాని అమరావతి విషయమై చర్చ తెరపైకి వచ్చింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను అప్పగించిన రైతులు ఈ విషయంలో మరింత ఆసక్తిని కనపరుస్తున్నారు. వారు అప్పగించిన భూముల్లో ప్రస్తుతం ఏదో మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ భూముల్లోనే తాత్కాలిక సచివాలయం కొలువు తీరి ఈ ఐదేళ్లుగా పరిపాలన సాగిస్తోంది.
 
ఈ ఏడాదే తాత్కాలిక హైకోర్టు రూపుదిద్దుకొంది. శాశ్వత న్యాయస్థానం నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. పలు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థలు, కేంద్ర సంస్థలు, హోటళ్లు, కనెన్షన్‌ సెంటర్లు, షాపింగ్‌మాల్స్‌, వాణిజ్య సంస్థలు వచ్చాయి. ఒకనాడు పూర్తిగా వ్యవసాయానికి పరిమితమయిన ఈ ప్రాంతాల్లో కొత్త కోణాల్లో ఆర్థిక కదలికలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అమరావతిని రాజధానిగానే కొనసాగిస్తారా..పరిపాలన ఇక్కడ నుంచే సాగుతుందా.. నిర్మాణాలు పూర్తిచేసుకొన్న సంస్థలు, పాలనా కార్యాలయాలను మాత్రం ఇక్కడే ఉంచి, మిగతా వాటిని కొత్త ప్రాంతానికి తరలిస్తారా అనే విషయంలో రాజధాని రైతులు స్పష్టత కోరుకొంటున్నారు.
 
ఈ విషయంలో కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచనలను తెలుసుకోడానికి వారు ఆసక్తి చూపుతున్నారు. రాజధానిగా అమరావతిని తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించడాన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ తీవ్రంగా వ్యతిరేకించారన్న వార్తలు సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అందులో వాస్తవమెంతో తెలియదుగానీ భూసమీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందని మాత్రం ఆయన పలు సందర్భాల్లో ఆరోపించారు.
 
అలాగే రాజధాని నిర్మాణ తీరును తప్పుబట్టి, దానిపై తాము రాగానే విచారణ జరిపిస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్‌ ప్రకటించారు. అయితే, ఎక్కడా ఆయన రాష్ట్ర రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయడానికి తాను వ్యతిరేకమని విస్పష్టంగా చెప్పిన దాఖలాలు మాత్రం లేదు. అయితే, వేర్వేరు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి, ఆయన ఇక్కడ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం సోషల్‌ మీడియాలో మాత్రం విస్తృతంగా సాగుతోంది. ఈ అస్పష్టతకు తెర దించేలా జగన్‌ ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని రాజధాని రైతులు ఆకాంక్షిస్తున్నారు.
 
 
జగన్‌ మనసులో ఏముందో..!
అమరావతిపై జగన్‌ మనసులో ఏముందో తెలుసుకోవడంతోపాటు ముఖ్యమంత్రి అయితే రాజధానిని ఇక్కడి నుంచి తరలించబోనంటూ ఆయన నుంచి హామీ పొందేందుకు రాజధాని రైతులు గతంలో పలు ప్రయత్నాలు చేశారు. జగన్‌ ఈ ప్రాంతానికి ‘ప్రజాసంకల్ప యాత్ర’లో భాగంగా వచ్చినప్పుడు, ఇతర సందర్భాల్లోనూ వారు ఆయనను కలుసుకొన్నారు. ఎన్నికల బహిరంగసభల్లో ఆయన స్పష్టత ఇస్తారేమోనని ఎదురుచూశారు. కానీ, జగన్‌ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోలేకపోయారు.
 
 
ధరాపాతం తప్పదా..శ్రీ
ఎన్నికలకు ముందు రాజధాని పరిధిలో ప్లాట్ల ధరలు తారస్థాయికి చేరాయి. అమరావతి నిర్మాణ ప్రక్రియ గత కొన్ని నెలల్లో ఊపందుకోవడంతో అందులోని ప్లాట్ల ధరలకు రెక్కలొచ్చాయి. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు, కృష్ణానదికి, అసెంబ్లీ- హైకోర్టు- సెక్రటేరియట్‌ టవర్లు- ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకోసం నిర్మిస్తున్న భారీ గృహసముదాయాలతో కూడిన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు సమీపంలో ఉన్న గ్రామాల్లోని ఎల్పీఎస్‌ ప్లాట్ల ధరలు చదరపు గజానికి అత్యధికంగా రూ.39,000కి చేరాయి. రాజధానికి చివరన ఉన్న నిడమర్రు, అనంతవరం, నెక్కల్లు వంటి గ్రామాల్లో సైతం చదరపు గజం రూ.20,000 నుంచి రూ.23,000 వరకు పలికాయి. ఇలాంటి వాతావరణంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. జగన్‌ త్వరలో ముఖ్యమంత్రి కానున్నారు. ఈ పరిణామం అమరావతిలోని ప్లాట్ల ధరలపై ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజధానిపై పూర్తి స్పష్టత వచ్చేదాకా, అంటే.. కనీసం ఏడాదిపాటైనా రియల్‌ మార్కెట్‌లో అనిశ్చితి తప్పదన్న అభిప్రాయం కలుగుతోంది. ఇప్పటి వరకూ అమరావతిలో ప్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపిన వారిలో అఽధికులు ప్లాట్లను కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారన్న భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
 
 
ఈ లోపు ధరలు పడిపోతే పరిస్థితి ఏమిటనేది ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. ఏమన్నా అవసరాలున్నప్పటికీ భవిష్యత్తులో ధరలు పెరుగుతాయన్న ఆశతో ప్లాట్లను అమ్మకుండా ఉన్న వారితోపాటు లాభార్జన దృష్టితో ప్లాట్లను కొనుగోలు చేసిన రియల్టర్లు, మధ్యవర్తులు వాటిని అంతకాలం అట్టిపెట్టుకునే అవకాశం ఉండబోదని భావిస్తున్నారు. ఫలితంగా వారు తమ చేతుల్లో ఉన్న ప్లాట్లను ఇప్పటితో పోల్చితే తక్కువ ధరలకు అమ్ముకునే అవకాశం ఉందనుకుంటున్నారు. వీటన్నింటి రీత్యా రానున్న కొన్ని నెలలపాటు అమరావతిలో ప్లాట్ల ధరలు చదరపు గజానికి కనీసం రూ.5,000 నుంచి రూ.10,000 వరకు పడిపోయే ప్రమాదం ఉందని ఈ రంగంలో అనుభవజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.
Posted
Quote

 

అమరావతిని రాజధానిగా ఎక్కడా వ్యతిరేకించని జగన్‌

భూములు, పనులతీరుపైనే సర్కార్‌పై ప్రధానంగా విమర్శ

వాటిని పట్టుకొని వ్యతిరేకి అంటూ మాధ్యమాల్లో ప్రచారం

 

orey boothu kittu gaa. ala seppindi nuvve. ippudu cover drives aa 

  • Haha 1
Posted

History repeats.

hyd ki IT cyberabad chesi odipoyadu

ippudu Amaravathy propose chesi odipoyadu. 

Posted
9 hours ago, snoww said:

over to @tacobell fan @JambaKrantu  for Ground Report 

Contractors met Jagan and he assured not to stop work anta. He is trying to get lands assigned to a singapore consortium (laka bhoomulu) that CBN assigned. Jagan himself will develop those anta

Posted
4 minutes ago, tacobell fan said:

Contractors met Jagan and he assured not to stop work anta. He is trying to get lands assigned to a singapore consortium (laka bhoomulu) that CBN assigned. Jagan himself will develop those anta

Link bro 

Posted
14 minutes ago, tacobell fan said:

Contractors met Jagan and he assured not to stop work anta. He is trying to get lands assigned to a singapore consortium (laka bhoomulu) that CBN assigned. Jagan himself will develop those anta

Singapore startup city is surely closed. He criticized it a lot in campaign. And no works started on it yet. So no issues in scrapping it. 

Posted
Just now, snoww said:

Singapore startup city is surely closed. He criticized it a lot in campaign. And no works started on it yet. So no issues in scrapping it. 

Alos inka works start kaani lands , contracts will surely be scrapped 

Posted
1 minute ago, snoww said:

Alos inka works start kaani lands , contracts will surely be scrapped 

Not that I heard. All contractors gave 600 crores party fund to Jagan it seems. His target is mainly those lands CBN gave away and owned to take over. Rest will continue as-is. 

Posted
15 minutes ago, Anta Assamey said:

Link bro 

People who met both CBN and Jagan gave this info. Not in news. 

Posted
19 minutes ago, Anta Assamey said:

Link bro 

Ground report ki no links. Anta.com 

Posted
9 minutes ago, tacobell fan said:

Not that I heard. All contractors gave 600 crores party fund to Jagan it seems. His target is mainly those lands CBN gave away and owned to take over. Rest will continue as-is. 

No other option than to scrap some projects. Sendraal saar geesina anni PPT's anni kattali antey inko 3 lakhs crores appulu seyyali. 

Posted

అమరావతి భూముల వ్యవహారం.. పెద్దకుంభకోణం

‘‘రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో పెద్దకుంభకోణం దాగి ఉంది. దానికి సంబంధించిన అన్ని విషయాలనూ బయటకు తీసుకురావాల్సిన అవసరముంది. ఇష్టం వచ్చినట్లు భూపంపకాలు జరిగాయి. చంద్రబాబుపై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదు’’ అన్నారు.

Posted
10 hours ago, k2s said:

History repeats.

hyd ki IT cyberabad chesi odipoyadu

ippudu Amaravathy propose chesi odipoyadu. 

Yes ... total dopidi... CBN is very obsessed with western style... 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...