snoww Posted May 28, 2019 Report Posted May 28, 2019 వాట్..నెస్ట్? 28-05-2019 03:09:09 హ్యాపీనెస్ట్ లబ్ధిదారుల్లో ప్రశ్నలు అమరావతిపై కొత్త సీఎం ఇచ్చే స్పష్టత కోసం ఎదురుచూపులు రాజధానిలో సామాన్యుడికీ గూడు ఈలక్ష్యంతో చౌకగా ఫ్లాట్ల ధరలు కొన్ని గంటల్లోనే భారీ బుకింగు ఫలితాలతో మారిన కొందరి వైఖరి రద్దు చేసుకొనే దిశగా ఆలోచనలు అడ్వాన్స్‌లు తిరిగొస్తాయో లేదో.. సీఆర్డీయేకు ఫోన్లు చేసి వాకబు అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి) : రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన ప్రతిష్ఠాత్మక హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌లో అపార్ట్మెంట్లను బుక్ చేసుకున్న వారిలో కొందరు వాటిని రద్దు చేసుకోవాలనుకొంటున్నట్టు సమాచారం. తాము బుకింగ్ అడ్వాన్స్‌లుగా చెల్లించిన మొత్తాలను, వాటిని రద్దు చేసుకొన్నవారికి వాపసు ఇవ్వడం కుదురుతుందా అంటూ గత కొద్ది రోజులుగా సీఆర్డీయేకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత చోటు చేసుకున్న వివిధ పరిణామాలు ఆ దిశగా వారిని ప్రేరేపిస్తున్నట్లు సమాచారం. అనుకోని ఈ పరిణామంతో సీఆర్డీయే అధికారులు విస్తుపోతున్నారు. వారికి ఏమి సమాధానం ఇవ్వాలో తెలియని సందిగ్ధతకు గురవుతున్నారు. ప్రపంచస్థాయి రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో సాధారణ ప్రజలు కూడా నివసించేందుకు వీలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో తలపెట్టిన ప్రాజెక్టు హ్యాపీనెస్ట్-1. అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు సమీపాన, నేలపాడు వద్ద 14.6 ఎకరాల్లో, సకల అధునాతన వసతులతో 1200 అపార్ట్మెంట్లను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ అపార్ట్మెంట్లలో చదరపు అడుగు రూ.3499లకే విక్రయించారు. హ్యాపీనె్‌స్టలోని ఫ్లాట్ల ధరలు ఆకర్షణీయంగా ఉండడంతో ఎక్కడెక్కడి వారూ వాటిని బుక్ చేసుకునేందుకు పోటీ పడ్డారు. రాష్ట్రంలో నివసించే వారే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉంటున్నవారు సైతం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన బుకింగ్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో కేవలం కొద్ది గంటల్లోనే అన్ని అపార్ట్మెంట్లూ బుక్కయ్యాయి. మార్కెట్లోని ఇతర ప్రైవేట్ వెంచర్లలో ఉండే అపార్ట్మెంట్లతో పోల్చితే మెరుగైన నాణ్యతా ప్రమాణాలతో నిర్మితమవడమే కాకుండా వాటి ధరలతో పోల్చితే గణనీయ తక్కువ ధరలను నిర్ణయించడం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కు ఇంతటి క్రేజ్‌ను తెచ్చింది! దీనికి లభించిన స్పందన దృష్ట్యా సీఆర్డీయే హ్యాపీనెస్ట్-2 నిర్మాణానికి కూడా నిర్ణయించింది. త్వరలో ఇందులోని అపార్ట్మెంట్లకు కూడా ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఏమో.. ఎలా ఉంటుందో.. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడంతో పరిస్థితులు వేగంగా మారడం మొదలయింది. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యాన్ని అమరావతికి ఇవ్వకపోవచ్చునన్న అభిప్రాయం కొందరు హ్యాపీనెస్ట్ లబ్ధిదారుల్లో వ్యక్తం అవుతోంది. గత ఐదేళ్లతో పోల్చితే, నగర నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగపోవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. దీనివల్ల తాము ఆశించినంత త్వరితంగా అందులోని అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరగడం కష్టమని భావిస్తున్నారు. ఈ కారణాల వల్లనే వారు తమ బుకింగ్‌లను రద్దు పరచుకుంటే మేలనుకుంటూ, వాటి వాపసు కోసం కొద్ది రోజులుగా సీఆర్డీయే అధికారులను ఫోన్ల ద్వారా ఆరా తీస్తున్నారు. కొందరైతే స్వయంగా విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయానికి వచ్చి, ఇదే విషయమై వాకబు చేస్తున్నారు. కంగారు పడాల్సిన పనేమీ లేదని, వారు ఆశించిన విధంగానే అమరావతి రూపొందుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ, వారు అంతగా సమాధానపడడం లేదు. స్పష్టత వచ్చాకే.. అమరావతిపైన, అందులోని హ్యాపీనెస్ట్-1 నిర్మాణంపైన నెలకొన్న అనుమానపు మేఘాలు తొలగిపోయే వరకూ హ్యాపీనెస్ట్-2 బుకింగ్‌లను నిర్వహించరాదని సీఆర్డీయే నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎన్నికలు ముగిసి, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలని గతంలో భావించిన సీఆర్డీయే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిని వాయిదా వేసినట్లు సమాచారం. Quote
snoww Posted May 28, 2019 Author Report Posted May 28, 2019 Quote గత ఐదేళ్లతో పోల్చితే, నగర నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగపోవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. orey boothu kittu gaa , nee elevations inka kooda stop seyyava Quote
snoww Posted May 28, 2019 Author Report Posted May 28, 2019 స్పష్టత వచ్చాకే.. అమరావతిపైన, అందులోని హ్యాపీనెస్ట్-1 నిర్మాణంపైన నెలకొన్న అనుమానపు మేఘాలు తొలగిపోయే వరకూ హ్యాపీనెస్ట్-2 బుకింగ్‌లను నిర్వహించరాదని సీఆర్డీయే నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎన్నికలు ముగిసి, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలని గతంలో భావించిన సీఆర్డీయే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిని వాయిదా వేసినట్లు సమాచారం. Quote
snoww Posted May 28, 2019 Author Report Posted May 28, 2019 @tacobell fan vuncle nee NRT Tower situation enti. Quote
Hindupurbul Posted May 28, 2019 Report Posted May 28, 2019 Boothu kitti ki gang bang ee..ade next. Epudu ela anedi vechi chudali Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.