ARYA Posted May 28, 2019 Report Posted May 28, 2019 తాను చేసిన ప్రతిపనీ ఒక చరిత్రగా మిగిలేలా కాలాన్ని శాసించగల వరాన్ని పొందిన కారణజన్ముడు కీ.శే. నందమూరి తారకరామారావు. 1923, మే 28 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఎన్టీఆర్, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో ఆరాధ్య దైవంగా నిలచిపోయారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథారచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా పలు శాఖలలో సినీరంగానికి సేవలందించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయ ప్రవేశంచేసి తెలుగుదేశం పార్టీ స్థాపించారు. పార్టీ పెట్టిన 9 నెలలలోనే తెలుగుప్రజల అవాజ్యమైన ప్రేమాభిమానాలతో ఎన్నికలలో అఖండ విజయం సాధించారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మి తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల పెన్నిధిగా, అన్నగారిగా పిలువబడ్డారు. ఈరోజు నందమూరి తారక రామారావుగారి జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం. Quote
MuPaGuNa Posted May 28, 2019 Report Posted May 28, 2019 happy birth day to LP husband .............. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.