Jump to content

Polavaram --> Centre approved new budget for this project


Recommended Posts

Posted
పోలవరం.. ఇకపైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే!

0280519polavarama-bnrk.jpg

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు చెల్లించాల్సిన నిధుల సమీకరణ తదితర అంశాలపై  పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) విజయవాడలో సమావేశమైంది. ఈ సమావేశానికి అథారిటీ ఛైర్మన్‌ ఆర్‌.కె. జైన్, పీపీఏ చీఫ్ ఇంజినీర్ ఏకే ప్రధాన్, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, అధికారులు, నవయుగ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, తదుపరి లక్ష్యాలపై ఈ సమావేశంలో చర్చించారు. పనులు జరుగుతున్న తీరును గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, అధికారులను ఛైర్మన్‌ జైన్‌ అడిగి తెలుసుకున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌పై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం పనులు మరింత వేగంగా జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇంకా ఇవ్వాల్సింది రూ.2వేల కోట్లేనని.. రాష్ట్రం చెబుతోన్న రూ.4,800 కోట్ల పెండింగ్‌తో తమకు సంబంధం లేదని జైన్‌ వ్యాఖ్యానించారు. మరికొన్ని రోజుల్లో డీపీఆర్‌-2కు ఆమోదం లభిస్తుందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీతో నీళ్లిస్తామని..  ఇకపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని జైన్‌ స్పష్టం చేశారు. మరోవైపు పీపీఏ అధికారులు బుధవారం నిర్వాసిత గ్రామాల్లో పర్యటించనున్నారు.

Posted
11 minutes ago, Hydrockers said:

First aa Jain ki post untado undado chusukomanu baa

He is BJP appointed guy kada. Don't think it will change 

  • 4 weeks later...
Posted
పోలవరం సవరణ అంచనాలకు కేంద్రం ఆమోదం

240619polavaramm-brk.jpg

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.6,764.16 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం సిఫార్సుల ఆధారంగా నిధులను విడుదల చేసినట్లు తెలిపింది. రాజ్యసభలో ఎంపీలు విజయసాయిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2014 మార్చి 31 నాటికి ఖర్చు చేసిన రూ.5,175.25 కోట్లలో రూ.3,777.44 కోట్లకు ఆడిట్‌ జరిగిందని.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి నిధుల విడుదల ఉంటుందని కేంద్రం తెలిపింది. సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.55,548.47 కోట్లుగా పేర్కొంది. దీనిలో ఇరిగేషన్‌, వాటర్‌ సప్లై వ్యయం రూ.50.987 కోట్లు అని.. విద్యుత్ ప్రాజెక్టు కోసం కేటాయించిన రూ.4,560.91 కోట్ల వ్యయంలో మార్పులేదని తెలిపింది. సవరించిన అంచనా వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు కటారియా రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

జీఎస్టీ మినహాయింపుపై ఎలాంటి ప్రతిపాదన అందలేదు
2017-18 ధరల ప్రాతిపదికన సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా నిర్ధారించి ఆ మేరకు ఆమోదం తెలిపినట్లు మంత్రి కటారియా వివరించారు. సవరించిన అంచనా వ్యయం ప్రకారం పోలవరం కుడి కాలువ పనులకు రూ.4,318.97 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు రూ.4,202.69 కోట్లు, హెడ్‌ వర్క్స్‌కు రూ.9,734.34 కోట్లు, పవర్‌ హౌస్‌ పనులకు రూ.4,124.64 కోట్లు, భూ సేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు రూ.33,168.23 కోట్లుగా అంచనా వేసి ఖర్చులకు ఆమోదం తెలిపినట్లు లిఖిత పూర్వక సమాధానం మంత్రి కటారియా వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని ఆయన చెప్పారు

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...