Jump to content

praja shakthi...


Recommended Posts

Posted

Image may contain: text

 

eppudu choodaledu vaa ee paper.......

Posted

రాజధాని కుంభకోణాలు ముందే బయటపెట్టిన ప్రజాశక్తి
రాజధానిలో అధికారపార్టీ మంత్రులు, నాయకులు పెద్దఎత్తున భూములు కొంటున్నారని, ఒకనెలలోనే 3500 ఎకరాలు చేతులు మారాయని ప్రజాశక్తి 2014 డిసెంబర్‌ ఎనిమిదో తేదీన వార్త ప్రచురించింది. 

2015 జనవరి 23వ తేదీన 'రాజధానిలో వెనకేసుకున్నారు' పేరుతో మరో కుంభకోణాన్ని ప్రాథమికంగా వెల్లడించింది. 

జనవరి 2016 జనవరి 15వ తేదీన 'భూబకాసురులు' పేరుతో మరో భూ కుంభకోణాన్ని బయటపెట్టింది. 

2016 నంబరు ఒకటోతేదీన 'విద్యాసంస్థల పేరుతో భూ సంతర్పణ' అనే శీర్షికతో అతిపెద్ద కుంభకోణాన్ని ప్రజాశక్తి బయటపెట్టింది. 

రూ.7000 కోట్ల విలువైన భూమి రూ.250 కోట్లకు కేటాయించారని వెల్లడించింది. 

2015 డిసెంబర్‌ 20వ తేదీన 'పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు' పేరుతో మంత్రి రావెల అనుబంధ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చింది. దీంతో మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పలు రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. 

విచిత్రం ఏమిటంటే భూములు ఇవ్వడానికి ఇష్టపడని వైసిపికి చెందిన నరసింహనాయుడు అనే రైతువద్దే మంత్రి నారాయణ బినామీ పేరుతో భూమికొనుగోలు చేశారన్న ఆరోపణలు వున్నాయి. 

రాజధాని సరిహద్దుల్లో పాగా 
ఇదంతా ఒకెత్తయితే రాజధాని ప్రకటించే సమయానికి ముందే రాజధాని సరిహద్దులు, వాటి చుట్టుపక్కల భూముల వ్యవహారం మొత్తం ప్రస్తుతం రాజధాని సలహా సంఘంలో ఉన్న గల్లా జయదేవ్‌, మండవ ప్రభాకరరావు, బీదా మస్తానరావు, జిఎంఆర్‌ గ్రూపు, జయభేరి, మహాలక్ష్మి గ్రూపులకు చేరిపోయాయని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. 

రాజధానికి అనుకున్న ఉన్న తాడేపల్లి, కుంచనపల్లి, కాజ, కంతేరు గ్రామాలో వీరు భూములు కొనుగోలు చేయడానికి ఇదే కారణమని వీరంటున్నారు. 

గుంటూరు జిల్లాలో భూముల ధరలు తగ్గించేందుకు వ్యూహాత్మకంగా రాజధాని నూజివీడువైపు వస్తుందని జరిగిన ప్రచారం తెలిసిందే. 

ఎంపి భాగస్వామ్యం ఉన్న నాగార్జునా యూనివర్శిటీ వెనుక ప్రాజెక్టుకు సినీహీరో మహేష్‌ ప్రచారకర్తగా ఉన్నారు. తాడేపల్లికి ఆనుకున్న ఉన్న కుంచనపల్లిలో తెలుగుదేశం కీలకనేత మురళీమోహన్‌ పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టారు.

పూలింగు ప్రక్రియ మొదలైనప్పటి నుండి రైతులను బెదిరించడం, పరిహారం ఇవ్వబోరని అసైన్డ్‌ రైతులను బెదిరించడం, కృష్ణానది కరకట్టకు దిగువన కృష్ణానదిలో ఇళ్లు కట్టినవారికి మినహాయింపులు ఇవ్వడం, కొన్ని సంస్థలకు తక్కువ ధరకు భూములు కట్టబెట్టడం, ముందుగానే రాజధాని పరిధిని కొంతమందికి చెప్పడం వంటి పలు అంశాలపై విచారణ జరిపించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. 

దీంతో టిడిపి నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌, ఎక్కువగా జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

అసైన్డ్‌ రైతులకు బెదిరింపులు
రైతులను బెదిరించి, మభ్యపెట్టి వేల ఎకరాల భూములు తీసుకున్న ప్రభుత్వం వాటిని ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరకు కేటాయించింది. ఎకరం రూ.50 లక్షలకు వందల ఎకరాలు కట్టబెట్టింది. 

అదే సమయంలో ఎకరం రూ.4 కోట్లు ఉంటుందని, ఇది ఎనిమిది కోట్ల నుండి రూ.12 కోట్ల వరకూ చేరుతుందని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అలా కట్టబెట్టడం వెనుక స్వియ లబ్ది ఉందని, తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని 2015 మార్చిలో రాజధాని పర్యటనకు వచ్చిన సమయంలో జగన్మోహన్‌రెడ్డి ప్రటించారు. 

దళితులకు కేటాయించిన అసైన్డ్‌ భూముల వ్యవహారమైతే దారుణం. వాటి సర్వే వివరాలతో కూడిన లిస్టులు తీసుకొచ్చి మరీ టిడిపి నాయకులు బేరాలు మొదలుపెట్టారు.
ఆ భూములకు పరిహారం ఇవ్వబోమని రెండేళ్లపాటు దళిత రైతులను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. దీంతో భయపడిపోయి తక్కువ ధరకు అమ్ముకున్నారు. 

పట్టాభూమి ఎకరం కోటి రూపాయలకు కొంటే దానికి అనుకుని ఉన్న అసైన్డ్‌ భూమిని రూ.18 లక్షల నుండి రూ.25 లక్షలకు కొనుగోలు చేశారు. దళితుల భూములన్నీ కొనుగోలు చేసిన తరువాత 2017లో అసైన్డ్‌ భూములకూ పరిహారం ప్రకటించారు. 

పనులన్నీ అనుకూల కంపెనీలకే
రాజధానిలో నిర్మాణం చేపట్టిన కంపెనీలన్నీ లోకేష్‌కు అనుకూలమైనవని, తన సొంత మనుషులకు పనులు కట్టబెట్టారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం రూ.32 వేల కోట్ల విలువైన పనులు జరుగతుండగా అవన్నీ ఎనిమిది కంపెనీలకు కట్టబెట్టగా వాటిల్లో ప్రధానమైన పనులన్నీ నాలుగైదు కంపెనీలకే కేటాయించారు. దీనివెనుక కూడా కుంభకోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైనా విచారణ జరిపించే అవకాశం ఉంది.


 

credit: fb

Posted
Just now, MuPaGuNa said:

Image may contain: text

 

eppudu choodaledu vaa ee paper.......

its Communist News paper.. tenor.gif?itemid=8412189

Posted
1 minute ago, aakathaai123 said:

Adhi commie gaalla paper 

Telugu chadvadam aytaledu 

Posted
8 minutes ago, DrBeta said:

Telugu chadvadam aytaledu 

Aytalekapodaaniki entira maayarogram 

Posted
8 minutes ago, aakathaai123 said:

Aytalekapodaaniki entira maayarogram 

Telugu chadivi padellu ayyindi, aytaledu anna

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...