r2d2 Posted June 2, 2019 Report Posted June 2, 2019 భారత్‌కు పన్ను రాయితీల రద్దు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం జీఎస్పీ ప్రయోజనాల ఎత్తివేత 1,900 వస్తువుల ఎగుమతిపై ప్రభావం ఈ నెల 5 నుంచే అమలు వద్దని శాసనకర్తలు, వ్యాపారులు చెప్పినా వినని ట్రంప్ పాల ఉత్పత్తులు, వైద్య పరికరాలకు మార్కెట్ సౌకర్యం కల్పించడం లేదని కినుక చర్చలు జరుపుతామన్న మోదీ సర్కారు వాషింగ్టన్/దిల్లీ భారత్‌కు ఆర్థిక నష్టం కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య రంగంలో ఇస్తున్న పన్ను రాయితీలను రద్దు చేశారు. ఈ నెల అయిదో తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. సుమారు 5.6 బిలియన్ డాలర్ల (రూ.38,964 కోట్లు) మేర అమెరికాకు జరుగుతున్న ఎగుమతులపై ఇస్తున్న ఈ రాయితీలు రద్దు కానున్నాయి. అమెరికా ఎప్పటి నుంచో అమలు చేస్తున్న సాధారణీకరించిన ప్రాధాన్యతల విధానం (జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్స్- జీఎస్పీ) కింద 1976 నుంచి భారత్ లబ్ధిదారుగా ఉంది. ఈ విధానం పరిధిలోకి వచ్చే దేశాలు వేలాది రకాల వస్తువులను పన్నుల్లేకుండానే అమెరికాకు ఎగుమతి చేయవచ్చు. అయితే భారత్ తమ వస్తువులకు తగిన మార్కెట్ సౌకర్యాన్ని కల్పించడం లేదన్న కారణంతో ట్రంప్ ఆ సౌకర్యాన్ని రద్దు చేశారు. ‘‘అమెరికా ఉత్పత్తులకు న్యాయమైన, సహేతుకమైన మార్కెట్‌ను అందుబాటులోకి ఉంచుతామన్న భరోసాను భారత్ ఇవ్వలేదు. ఆ కారణంగా జీఎస్పీ కింద భారత్‌కు కలిగిస్తున్న సౌకర్యాలను రద్దు చేస్తున్నాం’’ అని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని రద్దు చేస్తామని మార్చి నాలుగో తేదీనే ఆయన ప్రకటించారు. అందులో భాగంగా 60 రోజుల గడువుతో భారత్‌కు నోటీసు ఇచ్చారు. ఆ గడువు కూడా మే 3న ముగిసింది. అమెరికా కాంగ్రెస్ నిర్ధరించిన ప్రామాణికాలు అన్నింటినీ పాటిస్తే దాదాపుగా 1,900 వస్తువులను ఎలాంటి పన్నులు లేకుండానే ఎగుమతి చేయవచ్చు. అమెరికా వస్తువులకు తగిన మార్కెట్‌ను అందుబాటులోకి ఉంచడం ఈ ప్రామాణికాల్లో ఒకటి. పలుమార్లు చర్చలు జరిపినా భారత్ దీన్ని అమలు చేయడం లేదని ట్రంప్ అంటున్నారు. రెండు రంగాల నుంచే ప్రధాన అభ్యంతరం భారత్ మార్కెట్‌లో తమ ఉత్పత్తులకు అవకాశం కల్పించడం లేదని ప్రధానంగా పాల (డెయిరీ) ఉత్పత్తులు, వైద్య పరికరాల తయారీ రంగం నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. స్టెంట్లు, ఇతర పరికరాలపై గరిష్ఠ ధరలను నిర్ణయిస్తూ నియంత్రిస్తున్నాయని పేర్కొంటున్నాయి. అమెరికాలోని చిన్న వ్యాపారులపై భారం ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అమెరికాలోని చిన్న వ్యాపారులపై భారం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘జీఎస్పీ కోసం సంకీర్ణం’ (కొయిలేషన్ ఫర్ జీఎస్పీ) అనే సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాన్ అంటోనీ ఓ ప్రకటన విడుదల చేస్తూ అమెరికా వ్యాపారులపై 300 మిలియన్ డాలర్ల (రూ.2.087 కోట్లు) భారం పడుతుందని చెప్పారు. ‘‘జీఎస్పీని మూడేళ్లపాటు కొనసాగించాలని ఏడాది క్రితమే ఎగువ, దిగువ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అయినప్పటికీ అమెరికా కంపెనీలకు సొమ్ము ఆదా చేస్తున్న దేశాన్ని తప్పించారు. ఎంతో మంది వ్యాపారులు, శాసనకర్తలు వద్దని చెబుతున్నా వినలేదు. ఈ నిర్ణయంతో ఎవరికీ లాభం లేదు. అమెరికా ఉత్పత్తులకు మార్కెట్‌ను అందుబాటులో ఉంచడంపై సంప్రదింపులు జరపడానికి భారత్ సుముఖత వ్యక్తం చేసినా పట్టించుకోలేదు’’ అని తెలిపారు. ఒకేసారి రెండు కష్టాలు: కాంగ్రెస్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో దేశానికి ఒకేసారి రెండు కష్టాలు వచ్చినట్టయిందని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. అమెరికా ఒత్తిడికి లొంగి ఇరాన్ నుంచి ముడిచమురు కొనుగోలు నిలిపివేయడం ఒక కష్టమైతే, ఇప్పుడు వాణిజ్యంతో ప్రత్యేక హోదాను కోల్పోవడం రెండో కష్టమని వివరించారు. వీటిని అధిగమించడానికి ఏమి చేయనున్నారో దేశ ప్రజలకు వివరించాలని ప్రధానిని కోరారు. బలమైన ఆర్థిక సంబంధాలనే కోరుకుంటున్నాం: భారత్ అమెరికాతో బలమైన ఆర్థిక సంబంధాలనే కోరుకుంటున్నామని శనివారం భారత వాణిజ్య శాఖ పేర్కొంది. ఆర్థిక సంబంధాల్లో సమస్యలు తలెత్తుతుంటాయని, వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటామని తెలిపింది. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం ‘‘తనంతట తానుగా, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి లేకుండా, ఎలాంటి వివక్ష చూపకుండా’’ జీఎస్పీ విధానాన్ని అమలు చేసి ప్రయోజనాలు కల్పిస్తోందని గుర్తు చేసింది. ద్వైపాక్షిక వాణిజ్యంపై తాము చేసిన పలు సూచనలను అమెరికా అంగీకరించలేదని తెలిపింది. Quote
ekunadam_enkanna Posted June 2, 2019 Report Posted June 2, 2019 As long as UK and EU are vassals of USA, others can't do anything about this, except to wait for the next election results. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.