Jump to content

Recommended Posts

Posted
వరద గోదావర్రీ!

పోలవరం కాఫర్‌ డ్యాం రక్షణ, నిర్వాసితుల తరలింపుపై అధికారుల మల్లగుల్లాలు
స్పిల్‌వే మీదుగా ప్రవాహాల మళ్లింపు యత్నం
ఇండో కెనడియన్‌ కంపెనీ సలహా కోరిన అధికారులు

5ap-main2a_4.jpg

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. జులై, ఆగస్టు నెలల్లో గరిష్ఠ వరద వచ్చేటప్పుడు పోలవరంవద్ద తట్టుకోవడం ఎలా అనేది సమస్యగా మారింది. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నా కాఫర్‌డ్యాం రక్షణ, నిర్వాసితుల తరలింపుపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2019 జూన్‌ నెలాఖరు నాటికి కాఫర్‌ డ్యాంను 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించి స్పిల్‌ వే నిర్మాణం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలనే లక్ష్యంతో చేపట్టిన పనులు ఇప్పుడు మధ్యలోనే నిలిచిపోయాయి. లక్ష్యం మేరకు పురోగతి లేకపోవడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రణాళికలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాఫర్‌ డ్యాంవల్ల వరద సమయంలో ఎగువన ఎంత మేర నీరు నిలిచిపోతుంది? ఎగువన ఎన్ని గ్రామాలు వరదలో ఎన్ని రోజుల పాటు చిక్కుకుపోతాయి? ఎన్ని కుటుంబాలను వరద సమయంలో ఎన్ని రోజుల పాటు పునరావాస శిబిరాలకు తరలించాల్సి ఉంటుందనే కసరత్తు, కార్యాచరణ ఒక ఎత్తు అయితే... దాదాపు 35 మీటర్ల ఎత్తున నిర్మించిన కాఫర్‌ డ్యాంను ఎలా రక్షించుకోవాలి? లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో ఆ కాఫర్‌ డ్యాం కట్టకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకునేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కీలకాంశమైంది. ఈ పరిస్థితులపై... సమగ్ర కథనం

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- కుక్కునూరు

పోలవరం ప్రాజెక్టుకు కొత్త సవాలు ఎదురవుతోంది. సగం పూర్తయిన కాఫర్‌ డ్యాం రక్షణతోపాటు దానివల్ల ఎంతమేర నీరు నిలిచి ఎన్ని గ్రామాల ప్రజలను తరలించాలనేది ఇప్పుడు అధికారుల ముందున్న సవాలు. జులై, ఆగస్టు నెలల్లో గరిష్ఠ వరద వచ్చే సమయానికి ఈ సవాలును ఎదుర్కోవడానికి పోలవరం అధికారులు సిద్ధం కావాల్సి ఉంది.

5ap-main2b_2.jpg

వరద మళ్లింపు ఎలా?
పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా ఆకృతులు రూపొందించి నిర్మిస్తున్నారు. అది నూటికో కోటికో ఒక్కసారి వచ్చే వరద. 2013లో 28 లక్షల క్యూసెక్కుల గరిష్ఠ వరద వచ్చింది. అదే స్థాయి వరద వస్తే ప్రస్తుతం గోదావరికి అడ్డంగా కాఫర్‌ డ్యాం నిర్మించిన పరిస్థితుల్లో ఆ నీటిని ఎలా మళ్లిస్తారనేది చర్చనీయాంశమవుతోంది. గోదావరిలో 560 మీటర్ల మేర ఖాళీగా ఉన్న ప్రాంతం నుంచి కొంత వరద, దాదాపు 1000 మీటర్లకు పైగా పొడవున ఉన్న స్పిల్‌వే మీదుగా వరద (8 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు దాటితే)  దానంతట అదే మళ్లిపోతుందని పోలవరం చీఫ్‌ ఇంజినీరు శ్రీధర్‌ చెబుతున్నారు. ఎంత వరద వస్తే ఎంత ప్రభావం ఉంటుందనేది 3డి నమూనా, 2డి నమూనా అధ్యయనాలు ఉన్నాయని, వీటి ఆధారంగా కేంద్ర జలసంఘం నిపుణులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కాఫర్‌ డ్యాం రక్షణకు ఇండో కెనడియన్‌ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని, వారిని ఆకృతులు ఖరారు చేయాలని కోరామని పేర్కొన్నారు. వాటిని కేంద్ర జలసంఘం నిపుణులకు సమర్పించి అనుమతులు తీసుకుని రక్షణ చర్యలు చేపడతామని వెల్లడించారు.

కాఫర్‌ డ్యాం, స్పిల్‌ వే రక్షణ కీలకం!
స్పిల్‌ వే +25.72 మీటర్ల ఎత్తున ఉంది. కాఫర్‌ డ్యాం వైపు నదీగర్భం +4.50 మీటర్ల మేర ఉంది. ఈ నేపథ్యంలో ప్రవాహాలు ఎక్కువ మేర కాఫర్‌ డ్యాం వైపు సహజ గోదావరి మార్గంలోకే ఎక్కువగా వెళ్తాయని, అక్కడ వరద మట్టం పెరిగిన తర్వాతే స్పిల్‌వే వైపుగా వస్తాయని పేర్కొంటున్నారు. కాఫర్‌ డ్యాం వద్ద 15 నుంచి 20 లక్షల క్యూసెక్కుల వరద చేరిన తర్వాత మాత్రమే స్పిల్‌వే మీదుగా ప్రవాహాలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సవాళ్లిలా...
* కాఫర్‌ డ్యాంను దాదాపు 1400 మీటర్ల పొడవునా 35 మీటర్ల ఎత్తు వరకు గోదావరి మధ్యలో నిర్మించారు. దీనివల్ల వరద సమయంలో ఎగువన ఎంత మేర నీరు నిలిచిపోతుంది? ఆ మేరకు ఎగువన ఎన్ని గ్రామాలు వరదలో చిక్కుకుపోతాయి? ఎన్ని కుటుంబాలను వరద సమయంలో ఎన్ని రోజులపాటు పునరావాస శిబిరాలకు తరలించాల్సి ఉంటుందనే కసరత్తు, కార్యాచరణ ఒక ఎత్తు.
* దాదాపు 35 మీటర్ల ఎత్తున నిర్మించిన కాఫర్‌ డ్యాంను ఎలా రక్షించుకోవాలి? లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో ఆ కాఫర్‌ డ్యాం కట్టకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకునేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కీలకాంశం.

అధికారుల వాదన
* స్పిల్‌వే మీదుగా నీటిని వదిలేస్తాం కాబట్టి ఇబ్బందులు ఏమీ ఎదురుకాబోవు.
* స్పిల్‌వే వైపు, కాఫర్‌ డ్యాంనకు ఇరువైపులా కొద్దిమేర వదిలిన మార్గాల మీదుగా గోదావరి ప్రవాహం సజావుగా సాగిపోతుంది.

నిపుణుల వాదన
* స్పిల్‌వే పనులను పూర్తి రక్షణ స్థాయికి తీసుకెళ్లకుండానే అటువైపుగా నీరు వదలడం ఎంతవరకు శ్రేయస్కరం.
* రెండువైపులా ప్రవాహాలు సమంగా సర్దుకునేందుకు అవకాశం లేదు. కాఫర్‌ డ్యాంవైపే అధిక ఒరవడి ఉంటుంది. ఆ ప్రభావాన్ని అంచనా వేసి సరైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

మరికొందరి సూచన
ప్రస్తుత పరిస్థితుల్లో నిపుణులు, ఇంజినీర్లతో ఒక కమిటీని నియమించి ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించడం మేలు.

స్పిల్‌ వే వైపు మళ్లింపు.. రక్షణ మాటేమిటి?
* స్పిల్‌ వే మీదుగా ప్రవాహాలను మళ్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇక్కడ +25.72 మీటర్ల ఎత్తు నుంచి ప్రవాహాలు కిందకు వేగంగా వచ్చి పడతాయి. అక్కడ ఆ శక్తిని నియంత్రించే స్థాయి పనులు పూర్తి కాలేదని నిపుణులు చెబుతున్నారు.
* స్పిల్‌ వేలో దాదాపు 30 మీటర్ల లోతున గ్రౌటింగ్‌ పనులను పూర్తి చేయాల్సి ఉంది. అంతర్‌ ప్రవాహాలను నిరోధించేందుకు ఇది ముఖ్యం.. ఈ పనులు ఈ మధ్యనే ప్రారంభమయ్యాయి. అవి వేగంగా పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులు పూర్తికాక ముందే స్పిల్‌ వే మీదుగా మళ్లింపునకు సిద్ధపడటం శ్రేయస్కరమా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
* ఈ అన్ని అంశాలపై జల వనరులశాఖలోనే అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, ఇతర నిపుణులతో కమిటీ వేసి చర్చిస్తే మేలని ఆ శాఖలోనే అంతర్గతంగా కొందరు అభిప్రాయపడుతున్నారు.

5ap-main2c_3.jpg

కాఫర్‌ డ్యాం  ఏ స్థాయిలో....
మొదటి రీచ్‌: దాదాపు 200 మీటర్ల పొడవునా 18 మీటర్ల ఎత్తు వరకు నిర్మించారు. ఈ పనులను ఇప్పుడు నిలిపేస్తున్నారు.
రెండో రీచ్‌: దాదాపు 1400 మీటర్ల పొడవునా 35 మీటర్ల ఎత్తు వరకు కాఫర్‌ డ్యాం నిర్మించారు. గోదావరి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా నిలిచేది ఇదే.
మూడో రీచ్‌: దాదాపు 360 మీటర్ల పొడవునా పూర్తిగా ఖాళీగా ఉంది. నిర్మాణం చేపట్టలేదు.

కొందరు ఇంజినీర్ల అభిప్రాయం ఇదీ..
* ప్రవాహాలు స్పిల్‌ వే, కాఫర్‌ డ్యాంవైపు ఒకే తరహాలో మళ్లే వీలు లేనందున ప్రవాహ వడి, వేగం కాఫర్‌ డ్యాం వైపు ఎక్కువగా ఉంటాయి.
* అక్కడ ప్రవాహ వడి (వెలాసిటీ) సెకనుకు 5 మీటర్ల నుంచి 7.75 మీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది.
* ఈ కోణంలో కాఫర్‌ డ్యాం రక్షణపై దృష్టి సారించాల్సి ఉంటుంది.


పూర్తి కాని పునరావాస కాలనీలు

5ap-main2d_2.jpg

కాఫర్‌డ్యాం నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని 41.15 కాంటూరు స్థాయి లో నీరు నిల్వ ఉండే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం రెండో ఫేజ్‌లో 26 గ్రామాలను ఖాళీ చేయించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం కుక్కునూరు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 31 ప్రాంతాల్లో నిర్వాసిత కాలనీల నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ పనులు పూర్తి కాకపోవడంతో వరదతో ముంపు ముంచుకొస్తే నిర్వాసితులను తరలించేందుకు ఆస్కారం లేకుండా పోతోంది. ఎంత వరద వస్తే ఎంత మేర ముంపు ఉంటుంది? ఎన్ని గ్రామాలకు, ఎన్ని కుటుంబాలకు తాత్కాలిక పునరావాసం ఎక్కడ? ఎలా కల్పించాలనే విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని పోలవరం అథారిటీ సూచించింది.


పోలవరం ఎగువన ముంపు ముప్పే!

ప్రస్తుతం పోలవరంలో నిర్మాణాలవల్ల గోదావరికి 28 లక్షల గరిష్ఠ వరద వస్తే 35 మీటర్ల స్థాయికి ఎగువన నీరు నిలిచిపోతుందని లెక్కిస్తున్నారు. ఇటీవల జరిగిన పోలవరం అథారిటీ సమావేశంలో ఈ మేరకు చర్చించారు. ఆ స్థాయి వరద వస్తే పోలవరం ఎగువన నిర్వాసిత గ్రామాల్లో 18,635 కుటుంబాలపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇంతవరకు వారిలో 3,922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు.

Posted

Yellow Media ki sudden gaa annitilo issues ippudu kanipisthunnayee.

Kia lo , Polavaram rehab lo , works lo

Posted
17 minutes ago, snoww said:

Yellow Media ki sudden gaa annitilo issues ippudu kanipisthunnayee.

Kia lo , Polavaram rehab lo , works lo

Janaalaki annintlo issues unnayi ani thelisey Jagan ni gelipinchaaru so Jagan fix chesi chupinchaali 

Posted
36 minutes ago, tom bhayya said:

Janaalaki annintlo issues unnayi ani thelisey Jagan ni gelipinchaaru so Jagan fix chesi chupinchaali 

Nuv code raasi bugs nannu fix cheyamanntu vundi idi 

Posted
27 minutes ago, Sucker said:

Nuv code raasi bugs nannu fix cheyamanntu vundi idi 

naa code nachakey kadha nannu fire chesi ninnu hire chesukundhi.. dhora ki aithey andhrolla kutra antey ayipothundhi Jagan anna ki aa chance ledhu

Posted
16 minutes ago, tom bhayya said:

naa code nachakey kadha nannu fire chesi ninnu hire chesukundhi.. dhora ki aithey andhrolla kutra antey ayipothundhi Jagan anna ki aa chance ledhu

CBN will brief that it is 5 modi's kutra. 

Modi kcr jagan trump Putin. 

Posted
1 minute ago, snoww said:

CBN will brief that it is 5 modi's kutra. 

Modi kcr jagan trump Putin. 

nakka is not cm now Jagan anna brief chesi cheppali ippudu 

Posted
5 minutes ago, snoww said:

CBN will brief that it is 5 modi's kutra. 

Modi kcr jagan trump Putin. 

paragon cheppu tho kodtaru kukkani inko sari andhra ki vaste.

Posted
5 minutes ago, tom bhayya said:

nakka is not cm now Jagan anna brief chesi cheppali ippudu 

Sendraal Saar will brief more than jagan.

Sendraal Saar ki roju TV lo kanipinchaka pothe sleep raadu

Posted
1 minute ago, snoww said:

Sendraal Saar will brief more than jagan.

Sendraal Saar ki roju TV lo kanipinchaka pothe sleep raadu

nakka foreign trip going kadha for a week with family, jagana anna spl flight lo poyi delhi ki resolve cheyyali

Posted
3 minutes ago, tom bhayya said:

nakka foreign trip going kadha for a week with family, jagana anna spl flight lo poyi delhi ki resolve cheyyali

Foreign trip cancelled . He will bring lakhs of crores investments to AP now in assembly sessions. 

Posted
11 minutes ago, snoww said:

Foreign trip cancelled . He will bring lakhs of crores investments to AP now in assembly sessions. 

jagan anna assembly sessions lo last few years lo chesinatta?  

Posted
3 hours ago, tom bhayya said:

jagan anna assembly sessions lo last few years lo chesinatta?  

tom bhayya

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...