Jump to content

Recommended Posts

Posted
12 ప్రాజెక్టులపై థర్డ్‌పార్టీ ఎంక్వైరీ: సీఎం జగన్
06-06-2019 20:45:23
 
636954507235839301.jpg
అమరావతి: జలవనరుల శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులపై థర్డ్‌పార్టీ విచారణ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే కొన్ని ప్రాజెక్ట్‌లలో రీటెండరింగ్‌ వేసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రధాన ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌ల మంజూరు, ఖర్చులపై థర్డ్‌పార్టీ విచారణ జరిపిస్తామని సీఎం తెలిపారు.
 
 
12 ప్రాజెక్టులపై థర్డ్‌పార్టీ ఎంక్వైరీ వేస్తామని ఆయన అన్నారు. గాలేరు- నగరి, హంద్రీనీవా, పోలవరం, పట్టిసీమ, వంశధార, వెలుగోడు, తోటపల్లి, అవుకు సుజల స్రవంతి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీఎం పేర్కొన్నారు. ఎగువ పెన్నాపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో ఎగువ సీలేరు ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందన్న జగన్, బైరవానితిప్ప ప్రాజెక్టులో రూ.860 కోట్ల అంచనాలు పెంచారని సీఎం వెల్లడించారు. అన్ని ప్రాజెక్టులపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.
Posted
సీఆర్‌డీఏపై సీఎం సమీక్ష వాయిదా 
06-06-2019 03:59:06
 
  • నేడు కొత్త కమిషనర్‌ బాధ్యతల స్వీకారం
 
అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి వై.ఎ్‌స.జగన్మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించ తలపెట్టిన సమీక్షా సమావేశం వాయిదా పడినట్లు తెలిసింది. సీఎం గత కొద్ది రోజులుగా శాఖలవారీ సమీక్షలు జరుపుతున్న సంగతి విదితమే. బుధవారం వరకు సమీక్షలు జరగని కొన్ని శాఖలపై గురువారం సమావేశాలు నిర్వహించాలని భావించారని.. దీంతో సీఆర్‌డీఏపై సమీక్ష వాయిదా పడినట్లు సమాచారం. నిజానికి సీఎం సమీక్ష కోసం గత కొన్ని రోజులుగా సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. అమరావతి నిర్మాణంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని జగన్‌ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిర్వహించదలచిన సమీక్షకు ఎంతో ప్రాధాన్యం చేకూరింది. అంతేగాక.. అమరావతిపై ముఖ్యమంత్రి ఉద్దేశం ఏమిటో దీని ద్వారా స్పష్టంగా తెలుస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా.. సీఆర్‌డీఏ నూతన కమిషనర్‌గా నియమితులైన పి.లక్ష్మీ నరసింహ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. అదనపు కమిషనర్‌గా నియమితులైన కె.విజయ కొద్ది రోజుల తర్వాత బాధ్యతలు చేపడతారని తెలిసింది.
 
సీఆర్‌డీఏలో కాంట్రాక్టు అధికారుల రాజీనామా?
ప్రభుత్వ అధికారులుగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం ఏపీసీఆర్‌డీఏలో కాంట్రాక్టు అధికారులుగా చేరిన పలువురు అధికారులు ఆయా పోస్టులకు రాజీనామాలు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఇద్దరు అధికారులు రాజీనామా పత్రం సమర్పించారని, మిగిలిన వారు కూడా త్వరలోనే వైదొలగనున్నారని సమాచారం. రాజధాని నిర్మాణ వ్యవహారాలు నిరాఘాటంగా జరిగేందుకు సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు గత కొన్నేళ్లలో పలువురు ప్రభుత్వోద్యోగులను వారి రిటైర్మెంట్‌ అనంతరం సీఆర్‌డీఏలోకి తీసుకున్నారు. వీరు పది మంది వరకు ఉన్నారు. కాంట్రాక్టు అధికారుల పని తీరును ప్రభుత్వం మదింపు చేస్తోందని, దాని ఆధారంగా కొద్ది రోజుల్లోనే ఎవరిని కొనసాగించాలి, ఎవరిని తొలగించాలనే విషయంలో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. స్వచ్ఛందంగా రాజీనామా చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్వాసనకు ఆదేశాలు జారీ చేయొచ్చని.. అక్కడి వరకూ తెచ్చుకోవడం ఎందుకని వైదొలగడానికి సిద్ధపడుతున్నారు.
Posted

3rd party ante Jujubi.. CBN guppetloki easy ga vachestaru.. nijam ga inquiry cheyinchali ante.. Roja, Kodali Nani, Ambati Rambabu ..lanti team to oka committe veyiste sari..

Posted
17 minutes ago, AndhraneedSCS said:

Ivanni publicity stunts.. emi jaragadhu 

Time will tell. 

Posted
1 minute ago, snoww said:

Time will tell. 

Chala expect sesthunattnav

all the best 

Posted
38 minutes ago, Kontekurradu said:

Chala expect sesthunattnav

all the best 

Everyone knows those cases will go no where. people with die with old age and those cases will still be going on in courts. 

He will mostly focus on exposing all the scams so that he can counter the pilla congress arguments in future if they talk about his corruption

Posted
4 minutes ago, psycopk said:

ori eedi eshalo... kani... eni chudaledu...

Jagan win avuthadu ani ee DB lo evaru ina antey kooda ide dialogs kottav samara @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...