AndhraneedSCS Posted June 10, 2019 Report Posted June 10, 2019 అవినీతి అంతం ఎలా? 10-06-2019 03:54:13 ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలు తేవాలి వారం రోజుల్లో ప్రతిపాదనలతో రండి కార్యదర్శులు, శాఖాధిపతులకు జగన్ ఆదేశం అమరావతి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అవినీతిని నిరోధించి ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే లక్ష్యమంటున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశగా దృష్టి సారించారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటినుంచే అడుగులు వేస్తున్నారు. ప్రతిశాఖలోనూ అవినీతి రహితంగా ప్రజలకు సేవలు అందించాలన్న ఉద్దేశాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురానున్నారు. ప్రజలతో సంబంధం ఎక్కువుగా ఉన్న శాఖల్లో ఈ పని మరింత బలంగా చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల బదిలీలు దాదాపుగా పూర్తికావడంతో ఇక కార్యాచరణకు దిగాలని నిర్ణయించారు. కచ్చితంగా వారం రోజుల్లో ప్రతిశాఖలోనూ అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏం చేయాలన్న దానిపై పక్కా ప్రణాళికతో రావాలని కార్యదర్శులు, శాఖాధిపతులను ఆదేశించారు. వేగంగా సంస్కరణలు అవినీతి నియంత్రణ ఒకవైపు, ప్రభుత్వ ధనం ఆదా మరోవైపు అన్న లక్ష్యాలతో వెళ్తున్న ప్రభుత్వం... రివర్స్ టెండరింగ్ పద్ధతిలో రెండో లక్ష్యం చేరుకుంటామని అంటోంది. ప్రభుత్వ పనులను కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే సమయంలో వీలైనంత తక్కువకు పనిచేయించేలా చేయడం, ఎక్కువమంది పోటీపడేలా చేసి రేట్లు తగ్గించడం, మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నడిపించడం ఇందులో కీలకాంశాలు. ఇక రెండోవైపు ప్రజలకు ప్రభుత్వ శాఖల నుంచి అవినీతి రహితంగా సేవలందించడం. దీన్ని సాధించేందుకు ప్రతిశాఖలో ఇప్పటివరకూ జరిగిన సంస్కరణలను సమీక్షించి, మున్ముందు మరింత వేగంగా వెళ్లాలని భావిస్తోంది. ఎక్కడ అవినీతి జరిగినా... నేరుగా తన కార్యాలయానికే ఫోన్ చేసేలా వ్యవస్థ ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యాచరణ ప్రణాళికతో పాటు ఆ వ్యవస్థ ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యవస్థ ఉన్నా దాన్ని మరింత పకడ్బందీగా తయారుచేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆన్‌లైన్‌లో అవినీతి అరికట్టేదెలా? వాస్తవానికి ప్రభుత్వశాఖల్లో ప్రజలకు సులువుగా సేవలు అందేందుకు, అవినీతిని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు పలు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. పలు శాఖల్లో ఆన్‌లైన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. కుల, జన్మ, ఆదాయ ధ్రువపత్రాల్లాంటి వాటికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే ఇచ్చేసేలా ఏర్పాట్లు జరిగాయి. పురపాలక, రెవెన్యూ, రిజిస్ర్టేషన్స్, రవాణా, వాణిజ్య పన్నులు తదితర కీలక శాఖల్లోనూ అంతా ఆన్‌లైన్ పద్ధతి వచ్చేసింది. అయితే దీనివల్ల ప్రజలకు సంతృప్తిపరంగానే సేవలు అందుతున్నాయా? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. పద్ధతి ఏదైనా జరిగేది (అవినీతి) జరుగుతూనే ఉంటుందన్నట్లుగా వ్యవహారం తయారైంది. పురపాలక, రెవెన్యూ తదితర శాఖల్లో ఇది ప్రస్ఫుటంగానే కనిపిస్తోందన్న అభిప్రాయం నెలకొంది. మరికొన్ని శాఖల్లో సంస్కరణలు చేపట్టాలని భావించినా పలు ఒత్తిళ్ల కారణంగా చేయలేకపోయారు. ఇప్పుడు ఇలాంటి వాటన్నింటినీ సమీక్షించి పూర్తిస్థాయిలో సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు వేగంగా సేవలందించడమే లక్ష్యంగా సంస్కరణలు ఉండాలని నిర్ణయించింది. ఉద్యోగులకు తగిన గౌరవం, జీతభత్యాలు, ప్రోత్సాహకాలు కల్పిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఉత్తేజపరిచే దిశగా కూడా ముందుకెళ్లాలని భావిస్తోంది. ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై నేరుగా ఉద్యోగులనే సలహాలు అడుగుతూ, కార్యాచరణ ప్రణాళికను కూడా అక్కడి నుంచే తెప్పించే ప్రక్రియను చేపట్టింది. నిబంధనలు సులభతరం! మరోవైపు వివిధ శాఖల్లోని పనుల విషయంలో నిబంధనలు ఎలా ఉండాలన్న దానిపైనా చర్చ జరుగుతోందని సమాచారం. టెండర్లు, ప్రభుత్వ పనులు ఇవ్వడానికి సంబంధించిన వాటిలో నిబంధనలు కాస్త కఠినంగానే ఉండాలి. సమర్థుడైన కాంట్రాక్టరు, అనుభవజ్ఞులే వచ్చేలా ఏర్పాట్లు ఉంటాయి. ఇక చిన్న చిన్న పనులు, కాంట్రాక్టుల విషయంలో మరీ కఠినంగా నిబంధనలు ఉండాల్సిన పనిలేదు. ఇక రెండో అంశం... ప్రజలు, వివిధ వ్యాపారులకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందే సేవలు. ఈ సేవల విషయంలో కఠిన నిబంధనలు పెట్టడం వల్ల అవినీతి నెలకొంటోందనే అభిప్రాయం కూడా ఉంది. ఎన్ని నిబంధనలు ఉంటే అన్ని అడ్డంకులు, ఆపై అంత వ్యవహారం(అవినీతి) నడిపించేందుకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. అలా కాకుండా సులభతరంగా సేవలందేలా విధానాలు ఉంటే... ప్రజలు, వ్యాపారులకు ఒక భరోసా ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న కొందరు ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తున్నట్లు సమాచారం Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.