snoww Posted June 12, 2019 Report Posted June 12, 2019 21న మహోజ్వల దృశ్యం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు ప్రధాని మోదీని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించనున్న కేసీఆర్ ముఖ్య అతిథులుగా ఏపీ, మహారాష్ట్ర సీఎంలు జగన్, ఫడణవీస్ ఈనాడు - హైదరాబాద్ మహోజ్వల ఘట్టానికి ముహూర్తం కుదిరింది.. కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వాలన్న సర్కారు లక్ష్యం ఆచరణలో మరో ముందడుగు పడింది. అతి తక్కువ సమయంలోనే అద్భుతంగా రూపుదిద్దుకున్న భారీ సాగునీటి పథకం.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఏళ్ల తరబడి బీడువారి నోళ్లు తెరిచిన తెలంగాణ నేల నలుచెరగులకూ గోదారమ్మ ఉరకలు వేయనుంది. సాగునీరు లేక దుక్కి దున్నడమే దుఃఖప్రాయమైన ప్రాంతాల్లోకి గంగమ్మ పొంగిపొర్లనుంది. శంకుస్థాపన జరిగిన మూడేళ్లలోనే పూర్తయిన ఈ భారీ ప్రాజెక్టు జనం కల సాకారం చేస్తూ కళ్లముందే జలదృశ్యాన్ని ఆవిష్కరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం ఖర్చుచేసి పూర్తి చేసిన ప్రాజెక్టుగానే కాకుండా తెలంగాణలో అత్యధిక ఆయకట్టుకు సాగునీరు, అత్యధిక జనాభాకు తాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం ఈనెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరగనుంది. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీని, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, ఫడణవీస్‌లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మరికొద్దిరోజుల్లో కాళేశ్వరం కల సాకారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ప్రాజెక్టుల పునరాకృతి జరిగిన తర్వాత 2016 మే 2న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అంతరరాష్ట్ర సమస్యలు, భూసేకరణ పునరావాస సమస్యలు, అనుమతులు, కోర్టు కేసులు.. ఇలా అన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ రావడమే కాకుండా వర్షాకాలం పోనూ రెండేళ్లలోనే అత్యధిక భాగం పనులను పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసింది. నిధుల సమస్య రాకుండా బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంది. ఇంజినీర్లు, గుత్తేదారులతో నిరంతరం ముఖ్యమంత్రే స్వయంగా సమీక్షించి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవడం ద్వారా లక్ష్యానికి తగ్గట్లుగానే తక్కువ సమయంలో పనులు పూర్తి చేయించగలిగారు. మూడేళ్లలోనే సుమారు రూ. 50,000 కోట్లు ఈ ఒక్క ప్రాజెక్టుపైనే ప్రభుత్వం ఖర్చుపెట్టిందంటే సర్కారు దీనిపై ఎంత పట్టుదలతో ఉందో అర్థమవుతుంది.. 3 బ్యారేజీలు.. 3 ఎత్తిపోతల పథకాలు ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద నుంచి ప్రాణహిత నీటిని మళ్లించేలా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి ఉన్న అంతర రాష్ట్ర సమస్యలను పరిగణనలోకి తీసుకొని పునరాకృతి ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ప్రాణహిత-చేవెళ్ల లాగానే ఈ పథకానికి కూడా ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. తుమ్మిడిహట్టికి బదులు ప్రాణహిత నది వచ్చి గోదావరితో కలిసిన తర్వాత కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి గోదావరి నది ద్వారానే వెనక్కు ఎల్లంపల్లికి నీటిని మళ్లించేలా ఈ పథకాన్ని రూపొందించింది. కాళేశ్వరం దిగువ నుంచి గోదావరిపై మూడు బ్యారేజీలు, మూడు ఎత్తిపోతల పథకాలను చేపట్టి ఎల్లంపల్లికి నీటిని మళ్లించడం, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపుర, గంథమల తదితర రిజర్వాయర్ల ద్వారా ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు లక్ష్యం కాగా, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, వరద కాలువ తదితర పథకాల కింద 18.8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా లక్ష్యం. ఇందులో భాగంగా ఒక టీఎంసీ నీటిని మళ్లించేలా ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకాన్ని చేపట్టింది. మొదట రోజూ రెండు టీఎంసీల నీటిని మళ్లించి తర్వాత మరో టీఎంసీ నీటిని మళ్లించేలా పనులు పూర్తి చేయనుంది. ప్రస్తుతం 4,992.47 మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా, మూడో టీఎంసీ పని పూర్తయిన తర్వాత మొత్తం 7,000 మెగావాట్లకు పైగా అవసరం. ఈ పథకంలో 20 లిప్టులు, 19 పంపుహౌస్‌ల నిర్మాణం చేపట్టగా, 141 టీఎంసీల నీటి నిల్వకు 19 జలాశయాల నిర్మాణాన్ని చేపట్టారు. మొదటి దశలో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి కాళేశ్వరం పథకంలో భాగంగా మొదట మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని మళ్లిస్తారు. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల నిర్మాణం చేపట్టగా, ఈ బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు మూడు లిప్టుల నిర్మాణాన్ని చేపట్టారు. నూరు మీటర్ల పూర్తి స్థాయి మట్టంతో 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా చేపట్టిన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 85 గేట్లు అమర్చడంతోపాటు ఇవి రేడియల్ గేట్లు కావడంతో పైకి లాగేందుకు అవసరమైన మోటార్లను కూడా అమర్చారు. 1.63 కిలోమీటర్ల పొడవున ఈ బ్యారేజీలో 25 గేట్లు మహారాష్ట్ర వైపు ఉండగా, మిగిలిన గేట్లు తెలంగాణ వైపు ఉన్నాయి. ఈ బ్యారేజీలో నిల్వ అయిన నీటిని వెనుకభాగం నుంచి ఎత్తిపోసేందుకు కన్నెపల్లి వద్ద 11 మోటార్లు, పంపులు అమర్చడం దాదాపు పూర్తయింది. రెండు, మూడు పంపులు, మోటార్లకు సంబంధించి కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. గోదావరి నుంచి ఈ పంపుహౌస్‌లోకి నీటిని మళ్లించే హెడ్‌రెగ్యులేటర్, ఈ పంపుహౌస్ నుంచి ఎత్తిపోసే నీటిని అన్నారం బ్యారేజీకి మళ్లించే ప్రధాన కాలువ పని పూర్తయింది. వర్షాకాలం పోనూ సుమారు రెండేళ్లలోనే ఈ పంపుహౌస్ పనులు పూర్తయ్యాయి. అన్నారం బ్యారేజీ పని ముందుగానే పూర్తయింది. ఇక్కడ పంపుహౌస్ నిర్మాణం పూర్తి కావచ్చింది. సుందిళ్ల బ్యారేజి నిర్మాణం పూర్తికాగా, ఈ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసే పంపుహౌస్ నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. మేడిగడ్డ నుంచి నీటిని మళ్లిస్తే ఈ మూడు బ్యారేజీల్లో నిల్వ అయ్యే నీరు గోదావరి నదిలో ఎప్పుడూ ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజీని ఎల్‌అండ్‌టి, అన్నారం బ్యారేజిని అప్కాన్స్, సుందిళ్ల బ్యారేజీని నవయుగ ఇంజినీరింగ్ సంస్థలు చేయగా, మూడు లిఫ్టు పనులను మెగా ఇంజినీరింగ్ చేసింది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు నీటిని మళ్లించే పనుల్లో మొదటి లిప్టు నుంచి ఇప్పటికే ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేశారు. ఇంకో లిప్టు పని కూడా పూర్తికావచ్చింది. ఈ రెండు లిఫ్టుల మధ్యలో రెండు సొరంగ మార్గాలున్నాయి. వీటి లైనింగ్ పని పూర్తి కావల్సి ఉంది. ఈ నెలాఖరుకు కావచ్చంటున్నా ఇంకొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇది పూర్తయితే మిడ్‌మానేరు వరకు నీళ్లు వస్తాయి. తర్వాత దిగువన రిజర్వాయర్ల పనులు, ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పనులు పూర్తి కావలసి ఉంటుంది. ఎండను, వడగాల్పులను తట్టుకొని ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కల్లా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో ఇంజినీర్లు, కార్మికులు ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా షిప్టుల్లో 24 గంటలూ పని చేశారు. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు, ఇంకోవైపు నదిలో ఇసుక కారణంగా వచ్చే వేడి.. చేయాల్సిందంతా కాంక్రీటు, స్టీలుతో కూడుకున్న పని. అయినా అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని పనులు పూర్తి చేయడానికి అహర్నిశలు కష్టపడ్డారు. ఈ ప్రాజెక్టులో రోజూ వేలాదిమంది పని చేశారు. ఒక్కో పని వద్ద సరాసరిన రోజు 2,500 నుంచి 3,000 మందికి పైగా పని చేశారు. బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. జూనియర్ ఇంజినీర్లు మొదలుకొని ఉన్నతస్థాయి ఇంజినీర్ల వరకు ప్రాజెక్టు వద్దే మకాం వేసి పనులు చేయించారు. ప్రధానితో భేటీకి సమయం కోరిన సీఎంఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎవరెవరిని ఆహ్వానించాలి, ఇతరత్రా సన్నాహాల గురించి అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు వద్ద యాగ నిర్వహణ గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. దిల్లీలో ఆయనను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానపత్రిక అందించనున్నారు. పీఎంతో ప్రత్యేక భేటీ కోసం ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ప్రధాని కార్యాలయ అధికారులను సమయం కోరింది. గోదావరి జలాలతో లక్షల ఎకరాల సాగు లక్ష్యంతో తెరాస ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణాన్ని చేపట్టింది. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి, పూర్తి చేసిన ముఖ్యమంత్రిగా ప్రత్యేక ఘనత కేసీఆర్ సొంతం కానుంది..దీనిని పూర్తిగా రాష్ట్ర నిధులతోనే నిర్మించారు. ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరైతే ప్రాధాన్యం సంతరించుకుంటుందని, ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సాయం అందే వీలుంటుందని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ ఈనెల 14న దిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించాలని సీఎం యోచిస్తున్నారు. ఇందుకోసమే ప్రధానిని కలిసేందుకు సమయం కోరినట్లు తెలిసింది. పీఎంవో నుంచి సమాచారం అందిన తర్వాత ప్రధానితో భేటీ ఖరారు అవుతుంది. అలాగే మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ను, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. వారితో బుధవారం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి వద్దకు ప్రత్యేకంగా వెళ్లి మరీ ఆహ్వానించనున్నారు. మేడిగడ్డ నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదరడం.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆ ప్రభుత్వం పూర్తిగా సహకరించడం తెలిసిందే. సమర్థంగా పనిచేద్దాం.. చరిత్రలో నిలిచిపోదాం.. విద్యుత్ ఉద్యోగులకు సీఎండీ ప్రభాకరరావు సూచన కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, అందుకు అనుగుణంగా ఎత్తిపోతల పథకాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించి సమర్థతను చాటుకోవాలని విద్యుత్ ఉద్యోగులకు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గడువులోగా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశామని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించే అతి పెద్ద క్రతువులో విద్యుత్ శాఖది కీలక పాత్ర అని, దీన్ని విజయవంతం చేయడానికి విద్యుత్ ఉద్యోగులు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. సీఎం లక్ష్యం నెరవేర్చి రైతుల రుణం తీర్చుకోవాలని ఆయన ఉద్యోగులను కోరారు. Quote
snoww Posted June 12, 2019 Author Report Posted June 12, 2019 Quote ప్రధాని మోదీని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించనున్న కేసీఆర్ Good job dora. You are not behaving cheaply like CBN. Quote
TOM_BHAYYA Posted June 12, 2019 Report Posted June 12, 2019 Fake.. okka ppt rale .. Bus lalla janalu pole.. etla finish avvudhhi va Quote
snoww Posted June 12, 2019 Author Report Posted June 12, 2019 2 minutes ago, TOM_BHAYYA said: Fake.. okka ppt rale .. Bus lalla janalu pole.. etla finish avvudhhi va Agreed. Gallery walks ekkada , Gate opening ceremony lu evi, bus tour lu evi , PPT lu levu , Project site daggara ladies singing songs levu. Quote
snoww Posted June 12, 2019 Author Report Posted June 12, 2019 next 5 years rains manchiga padithe inka TG lo dora ki thirugu ledu. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.