Jump to content

Recommended Posts

Posted

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కొత్తే. అక్కడ జరిగే ఏ చిన్న విషయమైనా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ముందు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆ తర్వాత డీఎంకే అధినేత కరుణానిధి వరుస మరణాలతో తమిళనాట కొంతమేర రాజకీయ శూన్యత ఏర్పడింది. అయితే ఆ శూన్యతను తనకు అనుకూలంగా మలచుకోవడంలో అధికార అన్నాడీఎంకే విఫలమవగా... విపక్ష డీఎంకే మాత్రం దానిని బాగానే ఉపయోగించుకుందని చెప్పాలి. కరుణానిధి చనిపోగానే... డీఎంకే పగ్గాలు చేపట్టిన ఎంకే స్టాలిన్... ఇప్పుడు కొత్తగా తన వారసుడిని రంగంలోకి దించేశారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లోనే సత్తా చాటిన స్టాలిన్ కుమారుడు ప్రముఖ కోలీవుడ్ హీరో ఉధయనిధి స్థాలిన్... ఇప్పుడు రాజకీయంగా మరింతగా యాక్టివేట్ అవుతున్నారు. ఇందుకోసం సినిమాలను దాదాపుగా పక్కన పెట్టేసిన ఉధయనిధి త్వరలో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో తండ్రిని సీఎం చేసేందుకు పక్కా ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నారు. ఇందులో భాగంగా ప్రజా యాత్ర పేరిట త్వరలోనే ఉధయనిధి తమిళనాడును చుట్టేయనున్నారు. ఈ దిశగా ఇప్పుడు తమిళనాట ఎన్నికలు లేకున్నా రాజకీయం హీటెక్కిపోయినట్టేనన్న వాదన వినిపిస్తోంది.



తమిళనాట కాకలు తీరిన రాజకీయ యోధుడిగా ఎదిగిన కరుణానిధి మనవడిగా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న స్టాలిన్ కు కుమారుడిగా ఉధయనిధి తొలుత సినిమా రంగొన్నే ఎంచుకున్నారు. ఆదిలో నిర్మాతగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉధయనిధి... ఆ తర్వాత ఏకంగా హీరో అయిపోయాడు. వరుస హిట్లతో తనకంటూ ఓ అభిమాన సమూహాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. సినీ నిర్మాతగా హీరోగా ఉన్నా కూడా డీఎంకే అధికార పత్రికలో కీలక భూమిక పోషిస్తూ వచ్చిన ఉధయనిధి... తాత మరణించగానే రాజకీయంగా బాగానే యాక్టివేట్ అయ్యారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఓ వైపు తండ్రి స్టాలిన్ రాష్ట్రాన్ని చుట్టేస్తే... ఉధయనిధి కూడా మరోపక్క రాష్ట్రాన్ని చుట్టేశారు. ఫలితంగా డీఎంకే దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక గడచిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజా సార్వత్రిక ఎన్నికల్లోనూ తన అనుచరులకు ఓ మోస్తరు టికెట్లు ఇప్పించుకున్న ఉధయనిధి వారిని గెలిపింకుని సత్తా చాటారు. నేరుగా స్టాలిన్ వారసుడిగా పదవులు అందుకోకుండానే... స్టాలిన్ మాదిరే పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగేందుకే ఉధయనిధి ఇష్టపడ్డారు. అందులో భాగంగానే పార్టీలో ఏ కీలక పదవిలో లేకున్నా కూడా పార్టీ నేతల గెలుపు కోసం తనవంతు శ్రమించారు. ఫలితం కూడా సాధించారు. 

తాజాగా తండ్రిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా ఉధయనిధి ఇప్పుడు ప్రజా యాత్ర పేరిట ఓ భారీ కార్యక్రమానికి తెర తీస్తున్నారు. నాడు మనకు మనమేనన్న నినాదంతో స్టాలిన్ సత్తా చాటితే... ఇప్పుడు స్టాలిన్ ను సీఎం చేద్దాం అన్న నినాదంతో ఉధయనిధి రంగంలోకి దిగబోతున్నారు. ఉధయనిధి చేపట్టే పాదయాత్రకు సంబందించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాకున్నా... తమిళనాడులోని దాదాపుగా అన్ని ప్రాంతాలను టచ్ చేసేలానే ఈ యాత్ర ఉండబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాను అనుకున్నట్లుగా తండ్రిని సీఎం పీఠంలో కూర్చోబెడితే.. ఉధయనిధి ఇకపై సినిమాలకు పూర్తి స్థాయిలో స్వస్తి చెప్పేసి రాజకీయ నేతగానే కొనసాగుతారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా... కరుణ కోసం స్టాలిన్ పాటుపడినట్టుగానే... ఇప్పుడు స్టాలిన్ కోసం ఉధయనిధి కష్టపడేందుకు సిద్ధమయ్యారన్న మాట.

Posted

Andaru ready ga ne unnaru active ga

Jagan , KTR , uday , and nikhil odipoyina kuda active gane unnadu 

mana pappu garu emo ala 

Posted
19 hours ago, Hydrockers said:

Andaru ready ga ne unnaru active ga

Jagan , KTR , uday , and nikhil odipoyina kuda active gane unnadu 

mana pappu garu emo ala 

@BeerBob123

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...