AndhraneedSCS Posted June 20, 2019 Author Report Posted June 20, 2019 35 minutes ago, snoww said: Ippudu entha acre? Quote
tom bhayya Posted June 20, 2019 Report Posted June 20, 2019 4 minutes ago, AndhraneedSCS said: Ippudu entha acre? 1 lakh Quote
snoww Posted June 20, 2019 Report Posted June 20, 2019 13 minutes ago, AndhraneedSCS said: Ippudu entha acre? kone vaadu vunte kada rate thelisedi. kone vaadu inka padathayee emo ani wait sesthadu. Jagan nundi clarity statement vache varaku ilane confusion vuntadi. I think jagan doing this intentionally to hit finances of pilla congress leaders. Quote
snoww Posted June 21, 2019 Report Posted June 21, 2019 రాజధానికి ముడి సరుకు బంద్ 21-06-2019 08:23:38 ఫెర్రీలో ఫంట్ నిలుపుదల భారీ వాహనాలను నిలిపివేసిన ట్రాన్స్‌పోర్టు కంపెనీలు ఫెర్రీ (ఇబ్రహీంపట్నం): గత కొన్ని నెలలుగా రాజధాని నిర్మాణాల కోసం భారీ వాహనాల ద్వారా తరలిస్తున్న ముడి సరుకు రవాణా ప్రస్తుతం నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణాల కోసం శరవేగంగా పనులు జరుగుతున్నపుడు ఇబ్రహీంపట్నం రాతి క్వారీల నుంచి కాంట్రాక్టు సంస్థలు పెద్ద ఎత్తున కంకర తరలింపునకు చర్యలు చేపట్టారు. ప్రత్యేక జీవోల ద్వారా అన్ని అనుమతులు తీసుకువచ్చి నదిపై భారీ ఫంట్‌ను నెలకొల్పొరు. ఒకేసారి 30 భారీ లారీలు 750 మెట్రిక్ టన్నుల కంకరను తరలించే విధంగా ఫంట్‌ను తయారు చేశారు. అదే విధంగా ముడిసరుకు తరలింపునకు చర్యలు తీసుకున్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థలతో పలు పెద్ద సంస్థల నిర్మాణాల కోసం ఇక్కడ నుంచే కంకర, ఇసుక, ఎర్రమట్టి తదితర వాటిని తరలించే విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ భారీ ఫంట్ ద్వారా వందలాది లారీలతో ముడి సరుకు తరలించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత కొద్ది రోజులు పనులు జరిగినప్పటికి ఆ తరువాత పూర్తిగా మందకొడిగా సాగటంతో లారీలను నిలుపుదల చేశారు. కొద్ది రోజుల క్రితం స్థానిక వైసీపీ నేతలు కూడ ఫంట్ నడవటానికి వీలు లేదంటూ వాదనకు దిగారు. దీంతో ఫంట్ నిర్వాహకులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫంట్ కాంట్రాక్టుకు సంబంధించిన వ్యక్తి తన వ్యక్తిగత గన్‌మెన్లతో ఫంట్ వద్దకు వచ్చినపుడు వైసీపీ నేతలు వాదనకు దిగారు. ఆ సమయంలో గన్‌మెన్ గాలిలోకి కాల్పులు జరిగినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఇంతలో రాజధానిలో పనులు ఆగిపోవటంతో ఫంట్‌ను నిలిపివేసి ఒడ్డుకు చేర్చినట్లు తెలుస్తోంది. ఫంట్ తిరుగుతుంటంతో కూలీలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేవి. ఆ పనులు నిలిపిచోవటడంతో కూలీలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Quote
Vaampire Posted June 21, 2019 Report Posted June 21, 2019 Funny. 2 weeks back same media reported ap treasury is bankrupt. Quote
AndhraneedSCS Posted June 21, 2019 Author Report Posted June 21, 2019 They rely on leaks from politicians and rumors @jagan kuda bankrupt ani cheppadu. Ee madya dani gurinchi matladatam ledu enduko Quote
snoww Posted June 21, 2019 Report Posted June 21, 2019 It is clear that Jagan is intentionally keeping silent on Amaravati . Doesn't seems he is bothered about dropping prices. Quote
snoww Posted June 21, 2019 Report Posted June 21, 2019 3 minutes ago, snoww said: It is clear that Jagan is intentionally keeping silent on Amaravati . Doesn't seems he is bothered about dropping prices. He formed some committee to give report on all projects . And gave them 2 months time to submit report. So 3 months varaku no update anukunta mostly. Quote
Gaali_Gottam_Govinda Posted June 21, 2019 Report Posted June 21, 2019 Jagan oka 3 years hold lo pedithe.......... 75-80% off ki vastayi. Jai Jagan Quote
AndhraneedSCS Posted June 21, 2019 Author Report Posted June 21, 2019 I am interested in buying there but not sure what the actual reality is oka 1 Crore pedithe Acre vastada a few KMs from Secratariat? Quote
snoww Posted June 21, 2019 Report Posted June 21, 2019 12 minutes ago, AndhraneedSCS said: I am interested in buying there but not sure what the actual reality is oka 1 Crore pedithe Acre vastada a few KMs from Secratariat? @tacobell fan @idibezwada @JambaKrantu Quote
snoww Posted June 23, 2019 Report Posted June 23, 2019 ప్రజావేదికను అక్రమంగా నిర్మించారు నీటిపారుదల శాఖ అనుమతి, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కూడా లేదు అంచనాలు రూ.4.34 కోట్ల నుంచి 7.89 కోట్లకు పెంచేశారు అప్పటి మంత్రి నారాయణ నోటిమాట మీద దీన్ని కట్టేశారు తప్పులు చేసిన టీడీపీ దానిపై రాద్ధాంతం చేయడం సిగ్గుచేటు అక్రమమైనా అది ప్రభుత్వానిది కాబట్టి కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నాం అది చంద్రబాబు డబ్బులతోనో.. ఆయన తాత ఆస్తితోనో కట్టింది కాదు ‘సాక్షి’తో మంత్రి బొత్స సత్యనారాయణ Quote
snoww Posted June 23, 2019 Report Posted June 23, 2019 కృష్ణానది కరకట్టపై గత తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి అనుమతుల్లేకుండా ప్రజావేదికను అక్రమంగా నిర్మించిందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అయినా అది ప్రభుత్వానిది కావడం, అన్ని వసతులుండడంతో అక్కడ కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని టీడీపీ నాయకులు తప్పుపడుతూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శనివారం దానికి సంబంధించి పూర్తి నివేదికను సీఆర్‌డీఏ ద్వారా ఆయన తెప్పించుకుని అందులో జరిగిన అవకతవకలను గుర్తించారు. వాటిని ‘సాక్షి’కి వివరిస్తూ.. కరకట్టపై సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ప్రజావేదిక నిర్మాణానికి అనుమతివ్వడం సాధ్యంకాదని 2019 సెప్టెంబరు ఆరో తేదీన నీటిపారుదల శాఖ కృష్ణా సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజినీర్ స్పష్టంచేసినట్లు తెలిపారు. ప్రతిపాదిత ప్రాంతం కృష్ణా నది కరకట్టపై ఉండడం, వరద ప్రభావిత ప్రాంతంగా ఉండడంతోపాటు కరకట్టపై నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని లోకాయుక్త ఆదేశించిందని చెప్పారు. ప్రజావేదిక ప్లాన్‌కు సీఆర్‌డీఏగానీ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంæ అనుమతిగానీ లేవని ధృవీకరించినట్లు మంత్రి తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకపోయినా అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ నోటి మాటతో ఈ కట్టడాన్ని నిర్మించారని.. అది కూడా అంచనాలు భారీగా పెంచేశారని తెలిపారు. ఎన్‌సీసీ కంపెనీకి తొలుత రూ.4.34 కోట్ల అంచనాతో ఈ నిర్మాణ పని అప్పగించగా ఆ తర్వాత దాన్ని రూ.8.90 కోట్లకు పెంచేశారని, చివరికి రూ.7.59 కోట్లు నిర్మాణ కంపెనీకి చెల్లించారని తెలి¯పారు. ఇది కూడా అప్పటి మంత్రి నారాయణ నోటి మాటగా జరిగిందని తెలిపారు. ప్రజావేదిక నిర్మాణం ఏ రకంగా చూసినా అక్రమ నిర్మాణమేనని, దాని పక్కనే ఉన్న చంద్రబాబు నివాసం కూడా అక్రమమేనని బొత్స స్పష్టంచేశారు. టీడీపీ రాద్ధాంతం సిగ్గుచేటు ఈ అక్రమ నిర్మాణం గురించి టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రజావేదికను అక్రమంగా నిర్మించినా ప్రస్తుతానికి అన్ని వసతులతో అందుబాటులో ఉండడంవల్లే అక్కడ కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా వారి సామాజికవర్గానికి చెందిన వారి స్టార్ హోటళ్లలో కలెక్టర్ల సదస్సు నిర్వహించడంలేదని ప్రభుత్వానికి చెందిన భవనంలోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఉండవల్లి వెళ్లి ప్రజావేదికను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజావేదిక తమదంటూ టీడీపీ నేతలు గొడవ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కొత్త ప్రభుత్వం అధీనంలోకి వస్తాయనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. ప్రజావేదికలో సమావేశాలు నిర్వహించొద్దని టీడీపీ నేతలు అనడం సరికాదన్నారు. అది చంద్రబాబు డబ్బులతోనో లేక ఆయన తాత ఆస్తులతోనో కట్టింది కాదన్నారు. ప్రజావేదికపై అధికారులతో టీడీపీ నేతలు గొడవ పెట్టుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. అధికారులపై దాడులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బొత్స హెచ్చరించారు. Quote
snoww Posted June 23, 2019 Report Posted June 23, 2019 ఉండవల్లిలోని ప్రజావేదిక దుర్వినియోగానికీ కేరాఫ్ అడ్రస్ మూడేళ్లపాటు టీడీపీ ఆఫీసుగా వాడుకున్న చంద్రబాబు పార్టీ కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే ప్రభుత్వ భవనంలో పార్టీ కార్యక్రమాలేంటని విమర్శలొచ్చినా లెక్కలేదు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ దుర్వినియోగం ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మాత్రం గగ్గోలు Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.