snoww Posted June 22, 2019 Report Posted June 22, 2019 తండ్రి బీజేపీ.. తనయుడు టీడీపీ 6/22/2019 2:46:45 AM బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీజీ వెంకటేశ్ టీడీపీలోనే కొనసాగుతానన్న టీజీ భరత్ కర్నూలు, జూన్ 21(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన తనయుడు, యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ బీజేపీలో చేరుతారా..? టీడీపీలోనే కొనసాగుతారా..? అన్న సస్పెన్స్‌కు తెరదించుతూ టీడీపీలోనే కొనసాగుతానని టీజీ భరత్ పేర్కొన్నారు. తండ్రి ఒక పార్టీలో.. తనయుడు మరో పార్టీలో కొనసాగాలనుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సంయుక్త ఆంధ్రప్రదేశ్ కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో టీజీ వెంకటేశ్ చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 జరిగిన ఎన్నికల్లో కాంగ్రె్‌సను వీడి ఆయన టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీజీ ఓటమి చెందారు. టీడీపీ అధినేత చంద్రబాబు టీజీని రాజ్యసభకు పంపించారు. ఆ తర్వాత తన వారసుడిగా తనయుడు టీజీ భరత్‌ను రాజకీయ అరంగేట్రం చేయించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అప్పటి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికే కర్నూలు టీడీపీ టికెట్ ఖరారు కావచ్చని అందరూ అనుకున్నారు. అయితే.. రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా చక్రం తిప్పి తనయుడు భరత్‌కు టికెట్ వచ్చేలా చూసుకున్నారు. ఎలాగైనా భరత్‌ను అసెంబ్లీకి పంపాలని ఈ ఎన్నికల్లో ప్రయత్నించారు. అయితే.. భరత్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. రాజ్యసభ సభ్యుడుగా ఉన్న టీజీ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. తండ్రి బాటలోనే తనయుడు భరత్ కూడా బీజేపీలో చేరుతారని భావించారు. అందరి ఆలోచనలకు విరుద్ధంగా తాను టీడీపీలోనే కొనసాగుతానని, ఇదే విషయాన్ని యువనేత నారా లోకే్‌షకు కూడా ఫోన్లో చెప్పానని టీజీ భరత్ పేర్కొన్నారు. టీజీ కుటుంబ సన్నిహితులు తండ్రి వెంట వెళ్లాలా.. తనయుడు బాటలో నడవాలా..? తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీలోనే కొనసాగుతా: టీజీ భరత్ పార్టీని వీడే ముందు నాన్న నాతో ఫోన్లో మాట్లాడారు. బీజేపీలోకి వెళ్తున్నట్లు చెప్పారు. అయితే నేను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పాను. రాజకీయంగా అది నీ వ్యక్తిగత విషయమని నాన్న అన్నారు. నాన్న బీజేపీలో చేరిన వెంటనే నేను మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే్‌షకు ఫోన్ చేసి తాను టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీ వీడే ఆలోచన లేదని చెప్పాను. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. తిరిగి రాగానే అమరావతికి వెళ్లి లోకే్‌షతో పాటు చంద్రబాబును కూడా కలుస్తాను. 2019 ఎన్నికలో ఎంత ఒత్తిడి ఉన్నా నాపై నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారు. పార్టీలో కొనసాగుతూ కార్యకర్తలకు అండగా ఉంటా. Quote
snoww Posted June 22, 2019 Author Report Posted June 22, 2019 daggubati and purundeshwari different parties lo ela vuntaaru ani gola sesina pilla congress ippudu em antaadi. samsaram vyabhicharam logic again Quote
Kuppampsyco Posted June 22, 2019 Report Posted June 22, 2019 1 minute ago, snoww said: daggubati and purundeshwari different parties lo ela vuntaaru ani gola sesina pilla congress ippudu em antaadi. samsaram vyabhicharam logic again Gidi kotha passion to protect their a$$es. Quote
Vaampire Posted June 22, 2019 Report Posted June 22, 2019 Ds & son kooda. Ds still in trs. Son in bjp Quote
snoww Posted June 22, 2019 Author Report Posted June 22, 2019 4 minutes ago, Vaampire said: Ds & son kooda. Ds still in trs. Son in bjp I thought DS was kicked out of TRS ? Quote
Hydrockers Posted June 22, 2019 Report Posted June 22, 2019 16 minutes ago, snoww said: I thought DS was kicked out of TRS ? Not yet Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.