kakatiya Posted June 27, 2019 Author Report Posted June 27, 2019 దర్శకురాలిగా గిన్నిస్‌బుక్‌లో.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించారు. తొలిసారి ఆమె ‘మీనా’ అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించగా.. అప్పటి నుంచి 2009 వరకూ మొత్తం 44 సినిమాలు తీశారు. దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు. సూపర్‌స్టార్ కృష్ణతో వివాహం.. ‘సాక్షి’ చిత్రంతో తొలిసారిగా సూపర్‌స్టార్ కృష్ణతో నటించారు విజయనిర్మల. ఈ చిత్రమే వారి వివాహ బంధానికి కారణమైంది. తిరుపతిలో వీరి వివాహం జరిగింది. వివాహం అయ్యాక విజయ నిర్మల ‘అమ్మకోసం’ చిత్రంలో నటించింది. 2009లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన నేరము-శిక్ష చిత్రం దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం. 47 చిత్రాల్లో కృష్ణతో కలిసి ఆమె వెండితెరను పంచుకున్నారు. హీరోయిన్గా నటించిన తన తొలి చిత్రం ‘రంగులరాట్నం’కి నంది పురస్కారం అందుకున్నారు. సినీ రంగంలో ఇచ్చే ఉన్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును కూడా ఆమె అందుకున్నారు. Tags : vijayanirmala telugu actress director hero krishna Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.