Jump to content

Fake White Ration card ki bokka?


Recommended Posts

Posted
ఇక దేశమంతా ఒకే రేషన్‌ కార్డు!

ఎక్కడి నుంచైనా సరకులు పొందే వీలు
త్వరలో ఏపీ, తెలంగాణలో అమలు.. పాసవాన్‌ వెల్లడి

27brk-rationcard.jpg

న్యూదిల్లీ: ‘ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు’ నినాదంతో ముందుకెళుతున్న కేంద్ర ప్రభుత్వం ఇదే సూత్రాన్ని రేషన్‌ కార్డుకు వర్తింపజేయనుంది. త్వరలో ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’ తీసుకురానుంది. దీనిద్వారా రేషన్‌ కార్డుదారులు దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఇకపై సరకులు పొందొచ్చని కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆహార భద్రతపై ఫుడ్‌ కార్పొరేషన్‌, కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు, వివిధ రాష్ట్రాల ఆహార శాఖ కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. జాతీయ ఆహార భద్రత చట్టం అమలు, కంప్యూటరైజేషన్‌, రేషన్‌ సరకుల నిల్వ, పంపిణీలో పారదర్శకత, ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ డిపోలను ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలను చర్చించారు.

ఈ సందర్భంగా ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’ అంశంపై చర్చించారు. దీనిపై ముందుకు వెళ్లనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ విధానంలో వివిధ రాష్ట్రాలకు తరలివెళ్లే వలసదారులు దేశంలో తమకు నచ్చిన కిరాణా దుకాణం నుంచి సరకులు తీసుకొనే వెసులుబాటు కలగనుంది. దీనివల్ల అవినీతికి కూడా ఆస్కారం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూలి పనులు చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు కూడా ఆహార భద్రతను యథావిధిగా పొందుతారని పాసవాన్‌ అన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచే మొదలు..
ఇప్పటికే ఏపీ, తెలంగాణ, గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, త్రిపుర రాష్ట్రాల్లో ఇంటిగ్రేటెడ్‌ పీడీఎస్‌ (ఐఎంపీడీఎస్‌) వ్యవస్థ అమలులో ఉంది. దీని ప్రకారం ఆయా రాష్ట్రాల్లోని లబ్ధిదారులు ఏ జిల్లాలోనైనా సరకులు పొందొచ్చు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామని గతంలో ముందుకొచ్చాయి. ఇదే తరహాలో ‘ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు’ విధానాన్ని రాబోయే రెండు నెలల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.  దశలవారీగా దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయనున్నారు. దీంతో పాటు అన్ని రేషన్‌కార్డులను ఒకచోట నిక్షిప్తం చేసి డూప్లికేషన్‌కు ఆస్కారం లేకుండా చేయాలని కేంద్రం భావిస్తోంది.

Posted

Pedda changes emi undavemo? May be they will just computerize existing records and share with centre 

Posted
13 minutes ago, AndhraneedSCS said:

Pedda changes emi undavemo? May be they will just computerize existing records and share with centre 

Yeah eliminates lot of fake ones which is lot money savings bodi utilizing all resources

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...