snoww Posted July 3, 2019 Report Posted July 3, 2019 రాష్ట్ర రాజధానికి నీటి కష్టాలు అవసరమైన మేర సరఫరా లేని కావేరి నీరు తీవ్ర వర్షాభావంతో రిజర్వాయర్లలో అడుగంటిన నీరు పరిస్థితి ఇలాగే కొనసాగితే భయంకరంగా మారనున్న నీటి సమస్య సాక్షి బెంగళూరు : భవిష్యత్లో బెంగళూరు నగరం మరో చెన్నైగా మారనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నీటి కటకటతో చెన్నై నగరం తీవ్ర కష్టాలు పడుతోంది. ఇదే తరహాలో బెంగళూరుకు కూడా తాగునీటి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే తీవ్ర వర్షాభావం వల్ల కావేరి నీరు దాదాపుగా లభ్యత తగ్గిపోతూ వస్తోంది. చాలా అపార్టుమెంట్లకు కావేరి నీరు లభించడం లేదు. నగరవాసులు ప్రస్తుతం కావేరి నీరు కంటే బోరు నీళ్లు, వాటర్ ట్యాంకర్ల మీదే ఎక్కువగా ఆధార పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో చెన్నైగా మారడానికి ఎంతో సమయం పట్టదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వేగంగా తగ్గుతున్న భూగర్భజలాలు.. చెన్నై నగరానికి నీటిని సరఫరా చేసే నాలుగు రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో చెన్నై నగరానికి నీటి సరఫరా చేయడం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కష్టసాధ్యంగా మారింది. పొరుగింటికి అంటుకున్న మంట పక్కనే ఉన్న మన ఇంటికి చేరడానికి ఎక్కువ సమయం పట్టదన్న రీతిగా బెంగళూరుకు నీటి కష్టాలు త్వరలోనే సంభవించే విధంగా ఉన్నాయి. బెంగళూరులో కూడా ప్రస్తుతం నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు రాత్రిబవళ్లు నీటి గురించి ఆలోచించాలిన పరిస్థితి దాపురించింది. బెంగళూరులో 40కి పైగా బోర్వెల్స్లోని నీరు ఒకే నెలలో అడుగంటాయి. భూగర్భ జలాలు దాదాపుగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 600 అడుగుల లోతుకు తవ్వినప్పటికీ చుక్క నీరు పడని పరిస్థితి ఉంది. రెండు మూడు రోజులకొకసారి కావేరి నీరు.. నీటి కొరత కారణంగా నీటిని డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నీటి ట్యాంకర్ కోసం ఆర్డర్ చే స్తే వెంటనే లభించడం లేదు. 20 లీటర్ల ఒక క్యాన్ నీరు రూ. 10 చెల్లిస్తే కానీ దొర కడం లేదు. బెంగళూరులో రెండు, మూ డు రోజులకొకసారి కావేరి నీటిని అ«ధికారులు వదులుతున్నారు. ఆ వచ్చే నీరు కూడా ఒక గంట మాత్రమే వస్తోంది. నగరంలో దాదాపు 70 శాతం అపార్టుమెంట్లకు కావేరి నీరు ఇప్పటికే అందడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో దా దాపుగా 75 వేల అపార్టుమెంట్లు ఉం డగా.. అందులో 22 వేల అపార్టుమెంట్లకు మాత్రమే కావేరి నది అందుతోంది. మిగిలిన వారు వాటర్ ట్యాంకర్లు, బోరుబావుల మీదే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో శరావతి నది నీటిని కూడా బెంగళూరుకు తరలించాలని రాష్ట్ర ప్రభు త్వం ఆలోచన చేస్తోంది. అయితే శివమొ గ్గ జిల్లా పలు సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మలేనాడు ప్రాంతానికి ప్రాణధారమైన శరావతి నీటిని బెంగళూరుకు తరలిస్తే శివమొగ్గ, చిక్కమగళూరు, ఉడుపి వంటి జిల్లాలకు తాగు నీటి ఎద్దడి ఏర్పడుతుంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతాయని ఆశగా ఎదురు చూసిన రాష్ట్ర జనాలకు తీవ్ర నిరాశ ఎదురయింది. దీంతో తీవ్ర వర్షాభావం పరిస్థితుల్లో శరావతి నీటిని బెంగళూరుకు తరలిస్తే తమ పరిస్థితి ఏంటని మలేనాడు ప్రాంతవాసులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన పారిశ్రామీకరణ వల్లే.. మరోవైపు బెంగళూరు నగరం ఎంతో వేగంగా విస్తరిస్తున్న రీత్యా విపరీతమైన పారిశ్రామీకరణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో బెంగళూరులో అనేక చెట్లను తొలగించాల్సి వచ్చింది. పలు చెరువులను పూడ్చి అక్కడ ఆకాశహరŠామ్యలను నిర్మించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, అభివృద్ధి పేరిట సహజ సంపదనను నాశనం చేస్తూ పోయారు. కెంపేగౌడ నిర్మించిన వందలాది చెరువులు ప్రస్తుతం అంతరించిపోయాయి. దీంతో వర్షాభావం పరిస్థితులు తలెత్తి ప్రస్తుతం నీటికటకటకు దారితీసింది. ప్రస్తుతం నగరానికి నీటిని సరఫరా చేసే కేఆర్ఎస్, హేమావతి, హారంగి, కబిని జలాశయాల్లో నీరు దాదాపుగా అడుగంటే స్థితిలో ఉంది. గత జూన్ నెలలోనూ ఈ జలాశయాల్లోకి నీరు వచ్చి చేరలేదు. మున్ముందు కూడా ఇన్ఫ్లో లేకపోతే బెంగళూరుకు నీటి ఇక్కట్లు తప్పవు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు నగర ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. బెళ్లందూరు వంటి చెరువుల్లో ఈ ఉష్ణోగ్రత పుణ్యమా అని అప్పుడప్పుడు నిప్పులు కక్కుతున్నాయి. ఆయా చెరువుల్లో మంటలు వ్యాపిస్తున్నాయి. కొన్ని చెరువుల్లో అయితే నీరే ఉండడం లేదు. ఒకవేళ ఉన్న కాలుష్య నీటి వల్ల ఎవరికీ ప్రయోజనం కాకుండా పోతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బెంగళూరు నగరం నరకకూపంగా మారనుందనడంలో అతిశయోక్తి లేదు. Quote
EntoJeevitham Posted July 3, 2019 Report Posted July 3, 2019 Eppudo poyindi kada vaaa.. BANGALORE, 2010 ma relatives lo okathanu untundey.. velli visit chesinappude antha saturation ki reach ayyindi ani vinna.. WATER, POLLUTION, TRAFFIC, and the best known for Weather kuda Goneee... Quote
kingcasanova Posted July 3, 2019 Report Posted July 3, 2019 almost 10 years back nunche sanka naaakipoindi Quote
Assam_Bhayya Posted July 3, 2019 Report Posted July 3, 2019 Bangalore outskirts lo kuda equal to hyd prime area prices, endho janalu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.