snoww Posted July 5, 2019 Report Posted July 5, 2019 వైకాపా దాడులతో ఊళ్లల్లో ఉండలేకపోతున్నాం చంద్రబాబుకు మొర పెట్టుకున్న కార్యకర్తలు పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ‘ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి మాపై వేధింపులు ఎక్కువయ్యాయి. వైకాపా నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. ఊళ్లల్లో ఉండలేకపోతున్నాం. పార్టీ మారమని ఒత్తిడి చేస్తున్నారు’.. అంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు, వృద్ధులు అధినేత చంద్రబాబుకు మొర పెట్టుకున్నారు. వైకాపా నాయకులు దాడులకు పాల్పడటం వల్ల ఊరు వదిలి మరోచోట బతకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, కాకుమాను మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం తెదేపా రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబుకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గతంలో ఇచ్చిన వృద్ధాప్య పింఛను ఎంతో ఆసరాగా ఉపయోగపడిందని, ఎన్నికల్లో ఓడిపోవడం తీరని వ్యధ కలిగిస్తుందని వాపోయారు. జానకిరామ భక్త సమాజానికి చెందిన వృద్ధులు పింఛను డబ్బుతో మందులకు పిల్లలపై ఆధారపడకుండా రోజులు వెళ్లబుచ్చామని గుర్తు చేసుకున్నారు. అధికారం కోల్పోవడం వల్ల తలచుకున్న ప్రతిసారీ ఆవేదనను తట్టుకోలేక పోతున్నామని తెలిపారు. తెదేపా ఆవిర్భావం నుంచి కార్యకర్తగా ఉన్నందుకు పగబట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోస్టుమాన్‌గా ఉద్యోగ విరమణ చేసిన బాబూరావు అనే కార్యకర్త వాపోయారు. ఊళ్లో ఉంటే దాడులు చేస్తారని భయపడి గుంటూరులో నివసించడం కష్టమవుతుందని తమ గోడును వెళ్లబోసుకున్నారు. పింఛను తీసుకునేందుకు సొంతూరు వెళ్లాలంటే ధైర్యం చాలడంలేదన్నారు. కార్యకర్తల ఆవేదనను అర్థం చేసుకున్న చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా దాడుల నుంచి కార్యకర్తలను కాపాడుకుంటామని, రక్షణగా ఉంటామని స్పష్టం చేశారు. నిరంతరం కార్యకర్తలతోనే ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తల నుంచి వినతులను స్వీకరించారు. Quote
snoww Posted July 5, 2019 Author Report Posted July 5, 2019 mammalni oorilo vundanivvaka povatam endi ayya 1 Quote
Jai_MegaStar Posted July 5, 2019 Report Posted July 5, 2019 Pulivendula Pulakesi reddy gaani daggariki evaru povatledaa Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.