snoww Posted May 27, 2020 Author Report Posted May 27, 2020 29న కొండపోచమ్మ ప్రారంభానికి సర్వం సిద్ధం పంప్‌హౌజ్ మోటార్లను ఆన్ చేయనున్న సీఎం కేసీఆర్ 618 మీ. ఎత్తున ఉన్న రిజర్వాయర్‌లోకి నీరు ప్రారంభోత్సవానికి హాజరు కానున్న చినజీయర్ ముందుగా కొండపోచమ్మ గుడి వద్ద యాగం ఏర్పాట్లను పరిశీలించిన హరీశ్, అధికారులు కీలక ఘట్టానికి చేరుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇక నేరుగా ఆయకట్టుకు నీరందించే అవకాశం వచ్చే వానాకాలంలో 1200 చెరువులను కాళేశ్వరం జలాలతో నింపాలని యోచన హైదరాబాద్/గజ్వేల్, మే 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులోకి నీటి విడుదలకు ముహూర్తం ఖరారయింది. కేవలం మూడేళ్లలోపే పూర్తయిన ప్రాజెక్టుగా కొండపోచమ్మసాగర్ దేశంలోనే సరికొత్త రికార్డును నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఈ నెల 29న ఉదయం 11.30 గంటలకు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో నిర్మించిన పంప్‌హౌజ్ నుంచి నీటిని కొండపోచమ్మ ప్రాజెక్టులోకి సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 618 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలు చేరనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మొత్తం 10 దశల్లో నీటిని తరలించగా.. సముద్ర మట్టానికి 88 మీటర్ల ఎత్తున్న మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, రామడుగు, మిడ్‌మానేరు, అనంతగిరి (అన్నపూర్ణ), రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ ద్వారా కొండపోచమ్మసాగర్‌లోకి సాగునీరు వస్తోంది. 618 మీటర్ల ఎత్తుకు నీరు చేరడంతో గ్రావిటీ ద్వారా ఉమ్మడి మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందనుంది. కాగా, ములుగు మండలంలోని మామిడ్యాల, బైలంపూర్, తానేదార్‌పల్లి గ్రామాల పరిధిలోని 4,600 ఎకరాల విస్తీర్ణంలో రూ.3,030 కోట్ల వ్యయంతో కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్‌లో వెలిసిన కొండపోచమ్మ పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టిన సీఎం కేసీఆర్.. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా కొండపోచమ్మ ఆలయం వద్ద ప్రత్యేక యాగం నిర్వహించాలని అధికారులు, పాలకమండలిని ఆదేశించారు. యాగానికి ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు ప్రారభానికి త్రిదండి చినజీయర్ స్వామి హాజరై ఆశీర్వచనం ఇవ్వనున్నారు. ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 1500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడంతోపాటు సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి, ఈఎన్‌సీ హరిరాం, ఎస్‌ఈ వేణు.. పరిశీలించారు. యాగం నిర్వహించే స్థలాన్ని ఎంపీ సంతోష్‌కుమార్.. శృంగేరి పండితుడు గోపీకృష్ణశర్మతో కలిసి పరిశీలించారు. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. భవిష్యత్తులో హైదరాబాద్ తాగునీటి అవసరాలు కూడా తీర్చనున్నారు. ఈ రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఎనిమిది ప్రధాన కాలువలను నిర్మించారు. గ్రావిటీ ద్వారా నీటిని తొలుత సిద్దిపేట జిల్లాలోని 1,721 చెరువులకు విడుదల చేయనున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.