Jump to content

Recommended Posts

Posted

Inkendi, Kesineni nani gadu jump...

Lok sabha la vunnade 3...andulo eedu pole jumping practice chestundu, inko 2...Ram Mohan naidu and Galla Jaydev...iddarilo okadini teesukuni pothe Lok Sabha la kuda party dukanam bandh cheyochu iga

Posted
2 minutes ago, Android_Halwa said:

Inkendi, Kesineni nani gadu jump...

Lok sabha la vunnade 3...andulo eedu pole jumping practice chestundu, inko 2...Ram Mohan naidu and Galla Jaydev...iddarilo okadini teesukuni pothe Lok Sabha la kuda party dukanam bandh cheyochu iga

Galla Jayadev is "GOPI" - Anytime jump possible...

Posted
కేశినేని, బుద్దా మధ్య మాటల యుద్ధం

ట్విట్టర్‌ వేదికగా పరస్పర విమర్శలు

నానికి మద్దతుగా నాగుల్‌ మీరా

KESIMENI2.jpg

ఈనాడు, అమరావతి:నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు.. నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు.. నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్లు చేస్తున్నాడు. దౌర్భాగ్యం! నిన్నటి వరకూ చంద్రబాబు కాళ్లు.. రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్లు.. వ్యక్తులు మాత్రమే తేడా.. కాళ్లు కాళ్లే. రాజకీయ జన్మలు, పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులనేవి... గుళ్లో కొబ్బరి చిప్పల దొంగలు, సైకిల్‌ బెల్లుల దొంగలకి, కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవీదారులకు అవసరం. నాకు అవసరం లేదు.’

- కేశినేని నాని, విజయవాడ ఎంపీ

‘బస్సుల మీద ఫైనాన్స్‌ తీసుకుని.. 1997లో సొంతంగా దొంగ రసీదులు తయారు చేసి దొంగ ముద్ర వేసుకుని.. కోట్లాది రూపాయలు ఫైనాన్స్‌ కంపెనీలకు మోసం చేసిన నువ్వా ట్వీట్లు చేసేది. దళిత నాయకుడు, మాజీ స్పీకర్‌ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబరుపై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి.. వినే ధైర్యం నీకుందా? చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే.. అతడినే అనరాని మాటలని ఆ పార్టీని కూల్చావు. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మనిస్తే ఇవాళ ఆయన గురించి శల్యుడిలా మాట్లాడుతున్నావు. విజయసాయిరెడ్డి మీద నేనో.. నువ్వో.. ఎవరు పోరాడుతున్నారనేది ప్రజలకు తెలుసు. నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు. ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చే ముందు ఆడిన ఆటలు.. ఈ పార్టీలో సాగవు. సంక్షోభం సమయంలో పార్టీ, నాయకుడి కోసం పోరాడే వాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు. చనిపోయే వరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’

- బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ

‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి కాలేదు. పులి పులే.. నక్క నక్కే. నాయకుని కోసం రాజీలేని పోరాటం చేసే తత్వం కేశినేని నాని డీఎన్‌ఏలోనే ఉంది. ప్రజాక్షేత్రం నుంచి గెలిచిన వారికే ప్రజానాయకులెవరో తెలుస్తుంది. కాగితం పులులకు కాదు. పార్టీ కష్టకాలంలో చంద్రన్న ఆదేశంతో బాధ్యత తలకెత్తుకుని, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించి, విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని విజయపథంలో నడిపిన కేశినేని నాని కష్టంతోనే నీకు, నాకు పదవులు దక్కాయి. గుర్తుపెట్టుకో.’

- నాగుల్‌మీరా, పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు మాజీ ఛైర్మన్‌

విజయవాడ నగర తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి పెరిగిపోయాయి. తాజాగా ఆదివారం ఉదయం నుంచి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య తీవ్రమైన పదజాలంతో ట్వీట్ల యుద్ధం నడిచింది. వరుసగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, అవహేళనలు చేసుకుంటూ రోడ్డెక్కారు. ఎంపీ కేశినేని నానికి మద్దతుగా.. బుద్దా వెంకన్న లక్ష్యంగా పోలీస్‌ హౌసింగ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ నాగుల్‌ మీరా సైతం ట్వీట్లను పెట్టారు. దీంతో నగర తెదేపాలో ఇన్నాళ్లూ అంతర్గతంగా ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. గత వారం రోజులుగా కేశినేని, బుద్దా మధ్య ట్విట్టర్‌ వేదికగా పరోక్షంగా మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలు చేసుకున్నది లేదు. కానీ.. ఆదివారం పరిస్థితి పతాక స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు.. నేరుగానే తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకున్నారు. వారం కిందట ఎంపీ కేశినేని నాని తొలిసారి బుద్దా వెంకన్న లక్ష్యంగా ఓ ట్వీట్‌ను పెట్టారు. అక్కడి నుంచి వీరి మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతూ వస్తోంది.

ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పార్టీలో ఒకే వర్గంగా ఉంటూ వచ్చారు. బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా మధ్య గతం నుంచి అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇవే.. తాజాగా ఎంపీ కేశినేని, బుద్దా వెంకన్న మధ్య వివాదంగా మారడానికి కారణమయ్యాయని తెలుస్తోంది. ఇటీవలే విజయవాడ నగరపాలక సంస్థ పదవీకాలం ముగియడంతో మాజీ కార్పొరేటర్లతో ఎంపీ కేశినేని నాని సమావేశం ఏర్పాటు చేశారు. నాగుల్‌మీరాను వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, అందరూ సహకరించాలంటూ కేశినేని నాని ఈ భేటీలో కోరినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై బుద్దా వెంకన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెదేపా నగర అధ్యక్షుడిగా ఉన్న తనకు తెలియకుండా సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి సూచనలు ఎలా చేస్తారని మండిపడ్డారు. కేశినేని నానికి పోటీగా మాజీ కార్పొరేటర్లతో బుద్దా వెంకన్న సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కేశినేని నాని ట్విట్టర్‌ వేదికగా.. ‘తెదేపాకు ప్రస్తుతం షో చేసే నాయకులు అవసరం లేదని.. పనిచేసేవాళ్లు కావాలంటూ’ వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్‌ బుద్దా వెంకన్న లక్ష్యంగానే పెట్టారని పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరిగింది. అప్పటినుంచి పరిస్థితి క్రమంగా ముదిరి.. తాజాగా ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో వ్యక్తిగత ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చింది.

బుద్ధా వెంకన్న ఇంటి వద్ద హడావుడి..

బుద్ధా వెంకన్న లక్ష్యంగా ఆదివారం ఉదయం కేశినేని ఓ ట్వీట్‌ పెట్టారు. వెంటనే దానికి కౌంటర్‌ను బుద్ధా వెంకన్న తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అలా.. ఒకరికి ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. తొలుత పరోక్షంగా ఆరంభమైన ట్వీట్ల యుద్ధం క్రమంగా తీవ్రమై.. వ్యక్తిగతంగా, వ్యాపారాలకు ముడిపెడుతూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. మధ్యలో నాగుల్‌మీరా సైతం కేశినేని నానికి మద్దతుగా.. బుద్ధా వెంకన్న లక్ష్యంగా ట్విట్లు పెట్టారు. చాలాకాలంగా అంతర్గతంగా నగర తెదేపా నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సంచలనం రేపాయి. దీనిపై తెదేపా అధిష్ఠానం సైతం దృష్టి సారించినట్టు సమాచారం. ఇలా ఒకరిపై ఒకరు ట్వీట్లను పెట్టుకున్న తర్వాత.. ఆదివారం రాత్రి బుద్ధా వెంకన్న ఇంటి వద్ద స్థానిక నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున పార్టీ శ్రేణులు గుమిగూడటంతో.. ఏదో గొడవ జరుగుతోందని వన్‌టౌన్‌ సీఐ కాశీవిశ్వనాథ్‌ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి పరిశీలించారు. తాము సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు బుద్ధా వెంకన్న పోలీసులకు తెలిపారు.

Posted

Ie Nani gadu enduko Lokesham ganne target sestunademo anipistundi...

Posted

suresh bob gaadu open heart lo eppudo annadu.. tdp lo join aithe vere party tho godava kaadu.. party lo janala madye godavalu ekkuva anduke ramanaidu gaadu baitaki ochesadu ani.. rotten party expiry date daggaraki ochesindi

Posted

Okapudu veedu kuda adhe kadha..devils slokalu chepinattu undhi 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...