Jump to content

Recommended Posts

Posted
కర్నూలు: వర్షాలు లేక పత్తి రైతు విలవిల
17-07-2019 18:55:02
 
636989865012631155.jpg
కర్నూలు: చినుకు పడలేదు. మరోవైపు గాలి, ఎండ, దీంతో మొలక దశలోనే పత్తిపంట ఎండిపోతోంది. కళ్లముందే ఎండిన పంటకు ప్రాణం పోసేందుకు రైతులు మొక్క మొక్కకు నీరు పోసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది రైతులు అయితే నీళ్లు కొని మొక్కలకు పోసే స్థోమత లేక పటను పొలంలోనే దున్నేస్తున్నారు. కన్నీరు మున్నీరవుతున్నారు. తొలకరి పలుకరించి వెళ్లిపోయింది. రైతు మేను పులకరించేలోపు కనుమరుగైంది. అడపాదడపా కురిసిన వర్షాలకే రైతన్న పొంగిపోయాడు. విత్తనాలు వేసేందుకు అనువైన పదును భూమిలో ఉండడంతో అన్నదాతలు విత్తు వేశారు. ఇక అప్పటి నుంచి వరుణడు మొండికేశాడు. ఇంతలోనే నేలలోని కొద్దిపాటి తేమకు బెత్తెడు ఎత్తులో మొలక వచ్చింది. చాలా ప్రాంతాల్లో అయితే మొక్క మొలవక విత్తనం నేలలోనే ఎండిపోయింది.
 
జిల్లాలో పత్తిసాగు విస్తీర్ణం 2.40 లక్షల హెక్టార్లు. ప్రతి ఏటా పశ్చిమ ప్రాంతలో అత్యధికంగా పత్తి సాగవుతోంది. కానీ ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ఆదోనీ డివిజన్‌లో చాలా చోట్ల పత్తి ఇంకా నాటలేదు. నంద్యాల డివిజన్ పరిధిలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. దీంతో రైతులు పత్తి విత్తనాలు నాటారు. విత్తు వేసిన నెల రోజుల నుంచే వర్షాలు కురవలేదు. దీంతో చాలా చోట్ల విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. ట్యాంకర్లతో నీళ్లు కొని మొక్కలకు పోసే స్థోమత లేక చాలా మంది రైతులు పత్తి పంటను దున్నేసి.. వర్షం వస్తే రెండో పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్‌లో మొదటి పంటగా సాగు చేసిన పత్తి పూర్తిగా వాడిపోయింది. ఎకరాకు వేలు ఖర్చు చేసిన పంట కళ్లముందే ఎండిపోతోంది. గత ఏడాది ఇవ్వాల్సిన పంట పరిహారం ఇంతవరకు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Posted
16 minutes ago, Hydrockers said:

Bro mottam chadivava news ?

Chadivi unte ese vadivi kademo

why?

they want govt to help them. 

last year di kuda adugutunnaru. I think their demand is legitimate

Posted
16 minutes ago, AndhraneedSCS said:

why?

they want govt to help them. 

last year di kuda adugutunnaru. I think their demand is legitimate

No crop insurance last year?

Posted
8 minutes ago, Hydrockers said:

No crop insurance last year?

Crop Insurance as a scheme doesn't exist. I think its more of a grey area where Farmers think they have to get something but Govt thinks they dont have to give anything,...

Posted
6 minutes ago, AndhraneedSCS said:

Crop Insurance as a scheme doesn't exist. I think its more of a grey area where Farmers think they have to get something but Govt thinks they dont have to give anything,...

Govt Crop Insurance పెద్ద joke . A more transparent systematic may be Private sector presence will help . 

Posted
Just now, Hitman said:

Govt Crop Insurance పెద్ద joke . A more transparent systematic may be Private sector presence will help . 

Private sector ante. vadu Conditions tho champestadu ga 

Posted
1 hour ago, AndhraneedSCS said:
కర్నూలు: వర్షాలు లేక పత్తి రైతు విలవిల
17-07-2019 18:55:02
 
636989865012631155.jpg
కర్నూలు: చినుకు పడలేదు. మరోవైపు గాలి, ఎండ, దీంతో మొలక దశలోనే పత్తిపంట ఎండిపోతోంది. కళ్లముందే ఎండిన పంటకు ప్రాణం పోసేందుకు రైతులు మొక్క మొక్కకు నీరు పోసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది రైతులు అయితే నీళ్లు కొని మొక్కలకు పోసే స్థోమత లేక పటను పొలంలోనే దున్నేస్తున్నారు. కన్నీరు మున్నీరవుతున్నారు. తొలకరి పలుకరించి వెళ్లిపోయింది. రైతు మేను పులకరించేలోపు కనుమరుగైంది. అడపాదడపా కురిసిన వర్షాలకే రైతన్న పొంగిపోయాడు. విత్తనాలు వేసేందుకు అనువైన పదును భూమిలో ఉండడంతో అన్నదాతలు విత్తు వేశారు. ఇక అప్పటి నుంచి వరుణడు మొండికేశాడు. ఇంతలోనే నేలలోని కొద్దిపాటి తేమకు బెత్తెడు ఎత్తులో మొలక వచ్చింది. చాలా ప్రాంతాల్లో అయితే మొక్క మొలవక విత్తనం నేలలోనే ఎండిపోయింది.
 
జిల్లాలో పత్తిసాగు విస్తీర్ణం 2.40 లక్షల హెక్టార్లు. ప్రతి ఏటా పశ్చిమ ప్రాంతలో అత్యధికంగా పత్తి సాగవుతోంది. కానీ ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ఆదోనీ డివిజన్‌లో చాలా చోట్ల పత్తి ఇంకా నాటలేదు. నంద్యాల డివిజన్ పరిధిలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. దీంతో రైతులు పత్తి విత్తనాలు నాటారు. విత్తు వేసిన నెల రోజుల నుంచే వర్షాలు కురవలేదు. దీంతో చాలా చోట్ల విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. ట్యాంకర్లతో నీళ్లు కొని మొక్కలకు పోసే స్థోమత లేక చాలా మంది రైతులు పత్తి పంటను దున్నేసి.. వర్షం వస్తే రెండో పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్‌లో మొదటి పంటగా సాగు చేసిన పత్తి పూర్తిగా వాడిపోయింది. ఎకరాకు వేలు ఖర్చు చేసిన పంట కళ్లముందే ఎండిపోతోంది. గత ఏడాది ఇవ్వాల్సిన పంట పరిహారం ఇంతవరకు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Hope these farmers get compensated

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...