Jump to content

Recommended Posts

Posted
అమ్ముదామంటే అడవి... కొందామంటే కొరివి
 

రాజధాని జిల్లాల్లో తగ్గిన రిజిస్ట్రేషన్లు..!

amr-top1a_233.jpg

అమరావతి రాజధాని పరిధిలో నాలుగు నెలల క్రితం గజం స్థలం రూ.40వేలు పలికింది. క్రయ విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం ఒకే సారి రూ.25వేలకు పడిపోయింది. రూ.20వేలకు అడుగుతున్నా కొనేవారు ముందుకు రావడం లేదని ఓ స్థిరాస్తి వ్యాపారి చెప్పారు. విజయవాడలో అన్ని అనుమతులు తీసుకొని బహుళ అంతస్తులు నిర్మించిన ఓ వ్యాపారి.. ఫ్లాట్లు కొనేవారు లేక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ధరలు తగ్గించినా కొనేవారు ముందుకు రావడంలేదని వాపోతున్నారు.

- ఇదీ రాజధాని జిల్లాల పరిస్థితి..!


 

కంచికచర్ల మండలం పరిధిలోని ఒక గ్రామంలో  ప్రముఖ సంస్థ 8 ఎకరాల్లో లేఅవుట్‌ వేసింది. రైతుల నుంచి ఎకరా కోటి ముప్పై లక్షల చొప్పున కొనుగోలు చేసింది. ఇంకా సొమ్ములు చెల్లించలేదు. అడ్వాన్సుగా ఎకరాకు రూ.30లక్షల చొప్పున చెల్లించింది. ప్రస్తుతం ధరలు విపరీతంగా తగ్గిపోవడంతో మిగిలిన సొమ్ము చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అక్కడ ధర ఎకరా రూ.70లక్షలకు పడిపోయిందని అంటున్నారు. నిన్నటి వరకు స్థలాన్ని అమ్మి అమ్మాయి పెళ్లి చేద్దామనుకున్న ఓరైతుకు ప్రస్తుతం ధర భారీగా పతనం కావడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.

ఈనాడు-అమరావతి

కేసారి ఉవ్వెత్తున ఎగిసిన రాజధాని జిల్లాల స్థిరాస్తి వ్యాపారం ప్రస్తుతం పడకేసింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పడిపోయింది. 2017లో రిజిస్ట్రేషన్ల కంటే 2018లో ఎక్కువ లావాదేవీలు నడిచాయి. 2019లో తిరోగమనం పట్టాయి. ప్రధానంగా  ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఎక్కువగా లావాదేవీలు జరుగుతాయి. ఈ ఏడాది ఆ మూడు నెలల్లోనే లావాదేవీలు నిలిపోయాయి. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. పలువురు ప్రవాసాంధ్రులు సైతం ఇక్కడ పెట్టుబడిగా పెట్టి నివేశన స్థలాలు, ఫ్లాట్లు సొంతం చేసుకున్నారు. అమరావతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో ఎక్కువ డాక్యుమెంట్లు రిజస్టర్‌ అయ్యాయి. మంగళగిరి ప్రాంతంలోనూ ఆదే జోరు కొనసాగింది. 2019 ఎన్నికల అనంతరం అనూహ్యంగా స్థిరాస్తి వ్యాపారం పడిపోయింది. ఎక్కువ మంది తెలంగాణ రాజధాని వైపు దృష్టి సారించారని వ్యాపారులు చెబుతున్నారు. రాజధాని ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతంలో జనసాంద్రత పెరుగుతుందని భావించారు. విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాల్లో నివాస, వాణిజ్య అవసరాలు ఉంటాయని స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టారు. ధరలు ఒకేసారి అమాంతం పెరిగాయి. తర్వాత పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేయడంతో స్థిరాస్తిపై ప్రభావం పడింది. జీఎస్‌టీ అమలు కూడా ప్రభావం చూపింది. ఎక్కువగా స్థిరాస్తి కొనుగోలులో పన్నులు చెల్లించని నల్లధనం చెలామణి అవుతుంది. దస్తావేజుల్లో ఉన్న ధరను మాత్రమే చూపిస్తుంటారు. మిగిలిన సొమ్మును అనధికారికంగా చెల్లిస్తుంటారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. సిమెంట్‌, స్టీలు ధరలు పెరిగిపోవడం, ఇసుక లభ్యత లేకపోవడం కూడా కొంత ఇబ్బందిగా మారింది. నీ కృష్ణా జిల్లాలో విజయవాడ రేంజి (డీఐజీ) పరిధిలో మచిలీపట్నం, విజయవాడ, విజయవాడ తూర్పు రిజిస్ట్రేషన్‌ జిల్లాలు ఉన్నాయి.  ముగ్గరు జిల్లా రిజిస్ట్రార్ల పరిధిలో మొత్తం 28 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో గత ఏడాదితో పోల్చితే 10.04 శాతం రిజిస్ట్రేషన్లు తగ్గాయి. మచిలీపట్నం పరిధిలో 13 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పరిస్థితీ ఇలాగే ఉంది.

amr-top1b_41.jpg

* గుంటూరు జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, తెనాలి, అమరావతి రిజిస్ట్రేషన్‌ జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 35 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2017లో 44434 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి. 2018లో 60628 దస్తావేజులు రిజస్టర్‌ జరిగాయి. దాదాపు 36.45 శాతం వృద్ధిరేటు కనిపించింది. 2019లో 51941 డాక్యుమెంట్లు మాత్రమే నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే 14.33 శాతం తక్కువ లావాదేవీలు జరిగాయి.
నీ రెండు రాజధాని జిల్లాల్లో ఈ ఏడాది దాదాపు 2వేల కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా వస్తుందని అంచనా వేశారు. కానీ తిరోగమనంలో  ఉండటంతో భారీగా పతనం అయింది. మరోవైపు రిజిస్ట్రేషన్‌ శాఖలో కమీషన్ల పద్ధతి కూడా ప్రభావితం చేస్తోంది.
* సీఆర్‌డీఏ పరిధిలో అనధికార లేఅవుట్లు ఎక్కువగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు తక్కువగా జరుగుతున్నాయి. జీపీఏలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముందుగా కొనుగోలు ఒప్పందం చేసుకుని జీపీఏ తీసుకుంటున్నారు. తర్వాత నేరుగా విక్రయదారులకు రిజిస్టర్‌ చేస్తున్నారు. దీంతో ఖజనాకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది.
* భూముల విలువ కాకుండా నిర్మాణ రంగంలో తక్కువలో తక్కువగా చదరపు అడుగు నిర్మాణానికి రూ.1500 వరకు ఖర్చు అవుతుంది. భూమి విలువతో కలిపి దాదాపురూ.2500 నుంచి 5వేల వరకు విక్రయిస్తున్నారు. ఇటీవల స్థిరాస్తి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులను ఆకర్షించలేకపోతున్నామని అంటున్నారు. నీ స్థిరాస్తి వ్యాపారం ఆశాజనకంగా లేదని, కొనుగోలు దారులు లేరు. అమ్మేవారు వేచిచూసే ధోరణిలో ఉన్నారని క్రెడాయ్‌ విజయవాడ ప్రతినిధి వి.ఎన్‌.స్వామి అంటున్నారు.

Posted
Quote

కంచికచర్ల మండలం పరిధిలోని ఒక గ్రామంలో  ప్రముఖ సంస్థ 8 ఎకరాల్లో లేఅవుట్‌ వేసింది. రైతుల నుంచి ఎకరా కోటి ముప్పై లక్షల చొప్పున కొనుగోలు చేసింది. ఇంకా సొమ్ములు చెల్లించలేదు. అడ్వాన్సుగా ఎకరాకు రూ.30లక్షల చొప్పున చెల్లించింది. 

@tacobell fan vuncle deals ila kooda vuntaya 

Posted
8 minutes ago, tacobell fan said:

30ve4t.gif

ee Gif ni eppudu chusina fresh ga untadi .. oka 10 seconds navvukunta 

Posted

అమరావతి ఎప్పుడో RIP (Rested in peace ).. 

Posted

Jagan band start ayyedhi...Revenue dept major source of income govt kii..6 months lo 1/3 kuda reach avvva ledhu..

Posted

election results and uncertaintly valla ayyi undavachu. ivanni picha lite. 

 

next month it will overcome all missing registrations 

Posted
4 minutes ago, AndhraneedSCS said:

election results and uncertaintly valla ayyi undavachu. ivanni picha lite. 

 

next month it will overcome all missing registrations 

Uncertainty ఏమీ లేదు.. People are certain about development will not happen in any near future. He already made a big dent with his anti TDP policies without even considering some might help to generate income. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...