snoww Posted July 18, 2019 Report Posted July 18, 2019 తిరుమల కొండ మీద కొత్త పద్ధతి! 18-07-2019 04:22:22 ఎల్1, 2, 3 దర్శనాలిక కాలగర్భంలో తిరిగి పాత ‘ప్రొటోకాల్’ విధానంలోకి చైర్మన్ ఆదేశాలు వెలువడ్డ వెంటనే కొండ మీద కొత్త పద్ధతి అమలులోకి బ్రేక్ టైం తగ్గించే యోచనలో టీటీడీ సన్నిధిగొల్లల హక్కులకు చైర్మన్ హామీ తిరుమల, జూలై 17: తిరుమల కొండపై వీఐపీ బ్రేకు దర్శనాలకు ఇప్పటిదాకా అనుసరించిన ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 విధానం కాలగర్భంలో కలిసిపోయింది. ఈ విధానాన్ని ఇక ముందు కొనసాగించబోమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం కొండపై ప్రకటించారు. ఆ వెంటనే ఆయ న ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ప్రముఖులకు కేటాయించే వీఐపీ బ్రేక్‌లోని ఎల్1, 2, 3 అనే విభజనను రద్దుచేసి, పూర్వం ఉ న్న ప్రొటోకాల్, సాధారణ వీఐపీ బ్రేక్ విధానాన్ని టీటీడీ ఉన్నతాధికారులు తక్షణం అ మల్లోకి తీసుకువచ్చారు. తొలుత సాఫ్ట్‌వేర్‌లో మా ర్పులు తీసుకురావటానికి కొంత సమయం పడుతుందని, రెండు మూడురోజుల్లో అమలు చేస్తామని మీడియాకు తెలిపినప్పటికీ, బుధవారం నుంచే నూతన విధానం అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం ఎంబీసీ కౌంటర్లో ఇచ్చే వీఐపీ బ్రేక్ టికెట్లపై ఎల్1, ఎల్2, ఎల్3 అని ముద్రించే విధానాన్ని రద్దు చేశారు. ‘‘సీఎం ఆదేశాల మేరకు సామాన్యులకు పెద్దపీట వేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాం. దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. ప్రస్తుత విధానంలో గతంలో దళారీ వ్యవస్థ నడిచింది. ఆ వివరాలను త్వరలో ఆధారాలతో సహా బయటపెడతాం’’ అని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రొటోకాల్ వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటిలాగే బ్రేక్‌ను అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం మూడు గంటల సమయం తీసుకుంటున్న వీఐపీ బ్రేక్ దర్శనాలను.. గంట, గంటన్నరకు కుదించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఎల్1, 2, 3లను రద్దు చేస్తున్న తరుణంలో ప్రత్యామ్నాయ దర్శన విధానాలపై ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే శని, ఆదివారాల్లో కూడా పూర్తిగా బ్రేక్‌ను రద్దు చేసే అంశంపై అప్పటికప్పుడు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాగా, సన్నిధిగొల్లలకు వంశపారంపర్య హక్కులు కల్పిస్తామని చైర్మన్ వెల్లడించారు. ‘‘వారి సమస్యలు పరిష్కరిస్తామని మా మేనిఫెస్టోలో పేర్కొన్నాం. అన్నట్టుగానే వారికి న్యాయం చేస్తాం. అలాగే, కొందరు ముఖ్య మైన అర్చ కులు శ్రీవారికి విశేష సేవలందించారు. వారి పదవీవిరమణకు గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని రద్దుచేసే అంశంపై కూడా బోర్డు పూర్తిస్థాయిలో ఏర్పాటైన తర్వాత చర్చి స్తాం’’ అని వివరించారు. Quote
snoww Posted July 19, 2019 Author Report Posted July 19, 2019 సామాన్యులకు సులువుగా శ్రీవారి దర్శనం బ్రేక్ దర్శనం టిక్కెట్ల విభజన రద్దుకు స్పందన తిరుమలలో తొలి రోజు గంట సమయం ఆదా తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ల విభజన రద్దుకు స్పందన లభిస్తోంది. బుధవారం తీసుకున్న నిర్ణయాన్ని తితిదే గురువారం ఆచరణలోకి తెచ్చింది. ఈ విధానం కింద గంట సమయం ఆదా అయింది. అదనంగా ఐదు వేల మందికిపైగా సామాన్యులు శ్రీవారిని దర్శించుకోగలిగారు. బ్రేక్ దర్శనం చేసుకున్న భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఉదయానికి వీఐపీ బ్రేక్ దర్శనం కింద 2,904 మందికి తితిదే టిక్కెట్లు ఇచ్చింది. వీరిలో 49 మంది ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులు ఉన్నారు. వీరందరినీ ఆలయానికి ముందుగా తీసుకెళ్లి హారతితో కూడిన శ్రీవారి దర్శనం చేయించి తీర్థం, శఠారీ మర్యాదలు చేసింది. కేవలం పది నిమిషాల వ్యవధిలో దర్శనం చేయించి మిగిలిన వారిని తర్వాత ప్రవేశపెట్టి 1.50 గంటల వ్యవధిలో బ్రేక్ దర్శనం పూర్తి చేసింది. సామాన్య భక్తుల రద్దీని బట్టి మర్యాదలు గురువారం ఉదయం రద్దీ సాధారణంగా ఉండడంతో ప్రొటోకాల్ ప్రముఖులకు మర్యాదలు చేయించి ఇతరులను కులశేఖరపడి వరకు అనుమతించారు. సాయంత్రానికి రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం కేవలం ప్రొటోకాల్ ప్రముఖులకే వీఐపీ దర్శనం ఉంటుంది. శనివారం ప్రముఖులకు ఎలాంటి మర్యాదలు లేకుండా దర్శనం చేయించడంతో పాటు ఇతరులకు లఘు దర్శనం చేయించాలని తితిదే నిర్ణయించింది. మరో మూడు రోజుల రద్దీ అధికంగా ఉండనున్నందున ముందస్తుగానే నిర్ణయం తీసుకుంది. రద్దీ సాధారణ స్థాయికి వచ్చిన పక్షంలో వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లను ఎక్కువగా ఇవ్వడంతో పాటు కులశేఖరపడి వరకు అనుమతిస్తారు. దాతలకు సౌకర్యాలు యథాతథం దాతలకు ఎలాంటి అసౌకర్యం కలిగించబోం. రూ.కోటి విరాళమిచ్చిన దాతకు లోగడ ఎల్-1 కింద టిక్కెట్లు ఇచ్చాం. వీరిని ఇకపై ప్రొటోకాల్ ప్రముఖులతో పాటు ఆలయానికి తీసుకెళ్లి దర్శనం చేయిస్తాం. రూ.10 లక్షలు ఇచ్చిన దాతలకు ఎల్-2 కింద దర్శనానికి అనుమతిస్తుండగా.. ఇకపై బ్రేక్ దర్శనానికి మాత్రమే అవకాశమిస్తాం. నూతన విధానంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. రద్దీ లేనప్పుడు బ్రేక్ దర్శనానికి అధిక ప్రాధాన్యమిస్తాం. -ఏవీ ధర్మారెడ్డి, ప్రత్యేకాధికారి, తిరుమల 23, 24 తేదీల్లో ఎక్కువ మందికి దర్శనం ఈ నెల 23న వయోవృద్ధులు(65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులకు, 24న 5 సంవత్సరాల్లోపు పిల్లలతో పాటు తల్లిదండ్రులకు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం కల్పించాలని తితిదే నిర్ణయించింది. వృద్ధులు, దివ్యాంగులకు రెండు పూటలకు కలిపి నిత్యం 1,400 మందికి అవకాశం కల్పిస్తుండగా.. 24న 4 వేల మందికి ప్రత్యేకంగా దర్శనభాగ్యం దక్కనుంది. ఇందుకు ఉచిత టోకెన్లను తిరుమలలోని మ్యూజియం ఎదుట ఉదయం 7 నుంచి జారీ చేస్తారు. చిన్నారులతో పాటు తల్లిదండ్రులకు ఈ నెల 24న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం నుంచి ఉచితంగా ప్రవేశం కల్పిస్తారు. సాధారణంగా నిత్యం ఏడాది వయసున్న పిల్లల తల్లిదండ్రులను ఆలయానికి ఉచితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుమతిస్తుండగా ప్రస్తుతం ఐదేళ్ల వారికి ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. Quote
RunRaajaRun123 Posted July 19, 2019 Report Posted July 19, 2019 Kompa theesi Tirupathi gudilo Yesu Siluva pettalani demand pettara endhi jagan n co Quote
Kontekurradu Posted July 19, 2019 Report Posted July 19, 2019 3 hours ago, RunRaajaRun123 said: Kompa theesi Tirupathi gudilo Yesu Siluva pettalani demand pettara endhi jagan n co YV Subbareddy is not Yesu bidda no Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.