snoww Posted July 19, 2019 Report Posted July 19, 2019 తాను ప్రస్తుతం ఉంటున్న ఇల్లు తనది కాదని... లింగమనేని రమేశ్ అనే వ్యక్తి దగ్గర అద్దెకు తీసుకున్నానని చెప్పారు. ప్రజావేదిక కూడా తన నివాసం కాదని, ప్రభుత్వానిదని గుర్తుచేశారు. ‘‘భవనాల కూల్చివేత పట్ల రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. దౌర్జన్యాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దు. అవసరమైతే రోడ్డుపై పడుకుంటా తప్ప ఎవరి బెదిరింపులకూ లొంగను’’ అని తెలిపారు. Quote
snoww Posted July 19, 2019 Author Report Posted July 19, 2019 చంద్రబాబుకు బుర్ర ఉందా? 19-07-2019 03:31:40 అక్రమమని తెలిసీ అక్కడే ఉంటారా! ప్రజావేదిక సక్రమమైతే కూల్చివేతను హైకోర్టు సమర్థించిందేం?: జగన్ అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నేత చంద్రబాబుకు బుర్ర, జ్ఞానం ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్ సభలో మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చవద్దంటూ చంద్రబాబు కోర్టుకెళ్లారని, కోర్టు కూడా కూల్చివేతను సమర్థించిందని తెలిపారు. ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణానికి 2007 రివర్ కన్జర్వేటర్ అనుమతిచ్చారని చంద్రబాబు సభలో చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం భవనానికి, స్విమ్మింగ్ఫూల్కి ఒకే నిబంధనలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ‘‘ఈ స్థాయి వ్యక్తి తాను అక్రమ భవనంలోనే ఉంటానని, ఏం చేసుకుంటారో చేసుకోండనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆయనకు బుర్ర, జ్ఞానం ఉన్నాయా!’’ అని విమర్శించారు. Quote
snoww Posted July 19, 2019 Author Report Posted July 19, 2019 ఆ ఇంటికి మరోసారి నోటీసు: మంత్రి బొత్స కరకట్టపై చంద్రబాబు ఉంటున్న ఇంటితో పాటు మరో 30 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చామని మంత్రి బొత్స తెలిపారు. చంద్రబాబు ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేశ్ తాను అమెరికాలో ఉన్నందున 10 రోజులు ఆగాలని కోరగా తాము అందుకు అంగీకరించామన్నారు. గడువు దాటినప్పటికీ స్పందన రాకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు తాము సిద్ధమవుతున్నామని చెప్పారు. సీఆర్డీఏ చట్టం ప్రకారమే తాము ప్రజావేదికను కూల్చేశామని, ఆ చట్టం చేసిన చంద్రబాబే దాన్ని ఉల్లంఘించారని తెలిపారు. ఆ భవనం ఖాళీ చేయాలని కోర్టు రెండుసార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఏమాత్రం జ్ఞానం, విజ్ఞత, మనిషికుండాల్సిన విలువలు లేకుండా ఇంకా చంద్రబాబు అక్కడే ఉంటున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.