Jump to content

Recommended Posts

Posted
1 minute ago, kevinUsa said:

whats wrong ?

 

mari bapaneese ani kathalu cheppav ga edo exemption ani edo annav. 

 

  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • shamsher_007

    15

  • kevinUsa

    8

  • LordOfMud

    4

  • Android_Halwa

    3

Popular Days

Posted
1 minute ago, kevinUsa said:

whats wrong ?

 

idhe, ila undabatte akkada thurak mund@kodUkS kathalu 10ginig. 

pilli guddidaithe yeluka edo yetti chupinchukuntu thirigindhanta alage undi ni waalakam. 

em saduvukunnav vayya s@@k@lodi saduvulu. unna deshaniki value ivvanodu unte entha pothe entha. ani @amit shah bhaavam.

Posted

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఓ కీలక చట్టానికి అంతకంటే కీలక సవరణ చేసింది. ఈ సవరణకు పార్లమెంటులో ఆమోద ముద్ర కూడా పడిపోయింది. ఈ సవరణతో కోరలు వచ్చిన ఆ చట్టంతో ఇకపై ప్రభుత్వంపై విమర్శలు చేసే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదండోయ్... బీజేపీ సర్కారుకు కోపం తెప్పించే వారిని ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కఠినమైన సెక్షన్లతో ఏకంగా ఉగ్రవాద ముద్ర వేసి లోపలేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.



ఇంతగా ఆందోళన రేకెత్తిస్తున్న ఆ చట్టం ఏమిటి - చేసిన సవరణ ఏమిటన్న విషయానికి వస్తే... ఇప్పటికే అమలులో ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టానికి మోదీ సర్కారు ఓ కీలక సవరణ చేసింది. ఈ సవరణతో ఏ వ్యక్తి పై అయినా ఏ చిన్న అనుమానం వచ్చినా... ఆ వ్యక్తిపై అప్పటికప్పుడు తీవ్రవాది అన్న ముద్ర పడిపోతుంది. దీనిని ప్రశ్నించడానికి కూడా వీల్లేదన్న రీతిలో ఈ చట్టానికి సవరణ చేశారు. ఇంతటి కీలక సవరణ చేసిన మోదీ సర్కారుపై విపక్షాలు ఒంటికాలిపై లేచాయి. కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. అయినా కూడా వెనక్కు తగ్గని మోదీ సర్కారు... సభలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఇంతటి కీలక సవరణకు సింగిల్ స్టెప్ లోనే ఆమోదం ఇచ్చేసింది.

ఇప్పటివరకు అమల్లో ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టం ద్వారా... తీవ్రవాద సంస్థలకు అనుకూలంగా పని చేసే వ్యక్తులతో పాటు ఆయా సంస్థలపై తీవ్రవాద ముద్ర వేసి కేసులు పెట్టేవారు. అయితే తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు తాము పనిచేస్తున్న సంస్థపై తీవ్ర వాద ముద్ర పడిన వెంటనే దాని నుంచి బయటకు వచ్చేస్తూ కొత్త సంస్థలు పెట్టుకుని తమ కార్యకలాపాలు నిర్వహించేవారు. ఇదే సాకును చూపెట్టిన మోదీ సర్కారు... ఇప్పుడు ఈ చట్టానికి కొత్త సవరణ సంస్థలతో సంబంధం ఉన్నా - లేకున్నా కూడా వ్యక్తులపై తీవ్రవాది అన్న ముద్ర వేసేందుకు రంగం సిద్ధం చేసింది. విపక్షాలు కూడా ఇదే వాదనతోనే ఈ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే విపక్షాల వాదనకు కౌంటర్ ఇచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... విపక్షాలన్నీ సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

ఇలాంటి కఠినమైన చట్టాలు అమెరికా - చైనా - ఇజ్రాయిల్ - పాకిస్థాన్ లలో ఇప్పటికే అమల్లో ఉన్నాయని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఏదేని తీవ్రవాద సంస్థను బహిష్కరిస్తే... ఆ వెంటనే దానిలోని సభ్యులు కొత్త సంస్థను పెట్టుకుని తప్పించుకుంటున్నారని కూడా ఆయన వాదించారు. నిజాయతీగా పనిచేసే వారిపై ఎలాంటి కేసులు ఉండవని షా చెప్పుకొచ్చారు. తాము ప్రతిపాదించిన బిల్లును సమర్ధించుకునేందుకు ఇప్పుడు బాగానే చెబుతారు గానీ... రేపు ఏదేనీ కీలక పరిణామం చోటుచేసుకుంటే... తీవ్రవాద సంస్థలతో సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టరని గ్యారెంటీ ఏమిటన్న అసలు సిసలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తంగా తమకు వ్యతిరేకంగా మాట్లాడితే.. ఇక టెర్రరిస్టు ముద్ర వేయడం గ్యారెంటీ అన్న కోణంలో బీజేపీ సర్కారు తీసుకొచ్చిన ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...