snoww Posted July 29, 2019 Report Posted July 29, 2019 పోలవరం పనులు బంద్ 29-07-2019 03:52:54 బాబు పెట్టిన గేటు తొలగింపు త్రివేణి సంస్థ నిష్క్రమణ కొత్త టెండర్లు పిలుస్తారని ప్రచారం సిబ్బందిని తగ్గిస్తున్న నవయుగ రాజమహేంద్రవరం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. వాస్తవానికి అక్కడ కొన్ని రోజులుగా పెద్దగా పనులు జరగడం లేదు. స్పిల్‌వే, కాఫర్ డ్యాం రక్షణ పనులు మాత్రమే జరుగుతున్నాయి. వర్షాల వల్ల వాటిని కూడా ఆపేసినట్లు అక్కడి అధికారులు చెబుతున్నా.. అసలు కారణం మాత్రం.. ఉన్న కాంట్రాక్టర్లను తొలగించి కొత్తగా టెండర్లు పిలుస్తారన్న ప్రచారమే! రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేయాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో.. ఇప్పటివరకు పనిచేస్తున్న కాంట్రాక్టు సంస్థలు నెమ్మదిగా వెళ్లిపోతున్నాయి. త్రివేణి సంస్థ ఇప్పటికే ఖాళీ చేసింది. స్పిల్‌వే, పవర్ ప్రాజెక్టు పనులు చేపట్టిన నవయుగ ఇంకా వెళ్లకపోయినా.. ఉద్యోగులను మాత్రం క్రమంగా తగ్గిస్తోంది. దీంతో కొత్త టెండర్లు పిలిచే వరకూ పనులు జరిగే అవకాశం లేనట్లే! ఇంకోవైపు.. పోలవరం స్పిల్‌వేలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది ఒక గేటును ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్పిల్‌వే మొత్తం 48 గేట్లు అమర్చాల్సిఉంది. అప్పట్లో ఒక గేటు బిగించారు. బెకమ్ కంపెనీ ప్రస్తుతం 48 గేట్ల ఫ్యాబ్రికేషన్ వర్కు పూర్తి చేసింది. పిల్లర్ల పని పూర్తయితే వాటిని బిగించేయవచ్చు. చంద్రబాబు ప్రారంభించిన గేటును తొలగించారు. వరదలు ఎక్కువగా వస్తే స్పిల్‌వే నుంచి మళ్లిస్తామని.. అందువల్లే గేటు తొలగించామని అధికారులు చెబుతున్నారు. ఇక ఎగువ కాఫర్ డ్యాం రక్షణ చర్యలు కూడా ఇంచుమించు పూర్తయ్యాయి. ఈ ఏడాది 6-8 లక్షల క్యూసెక్కుల వరకు వరద రావచ్చని ఇరిగేషన్ అధికారుల అంచనా. 8 లక్షల క్యూసెక్కుల లోపు వరద ఉన్నా కాఫర్ డ్యాంకు ఎటువంటి నష్టం ఉండదని చెబుతున్నారు. కానీ 5 లక్షల క్యూసెక్కుల వరద దాటితే ఎగువభాగంలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుం కాఫర్ డ్యాంకు చివర్లలో ఉన్న నది ఖాళీ భాగం నుంచి ఇన్‌ఫ్లోస్ ధవళేశ్వరం బ్యారేజీకి వస్తున్నాయి. 5లక్షల క్యూసెక్కులు దాటితే స్పిల్‌వే నుంచి మళ్లిస్తామని అధికారులు చెబుతున్నారు. అంతకంటే దాటితే ఎగువ భాగంలో కొన్ని గ్రామాలను తాత్కాలికంగా... అంటే వరద ఉన్నన్ని రోజులూ ఖాళీ చేయవలసి ఉంటుందని, నిర్వాసితులకు తాత్కాలిక పునరావాసం కూడా రెవెన్యూ అధికారులు కల్పిస్తారని ఒక అధికారి తెలిపారు. Quote
snoww Posted July 29, 2019 Author Report Posted July 29, 2019 calling @Paidithalli Nuvvu opening ceremony ki kotlu karchu sesi pettinchina gate ni peekeyyatam endi ayya gif please Quote
Hitman Posted July 29, 2019 Report Posted July 29, 2019 57 minutes ago, Hector8 said: చంద్ర అన్న మాల వంటి ప్రోగ్రాం ఏమైనా వస్తే చెప్పు Quote
r2d2 Posted July 29, 2019 Report Posted July 29, 2019 State is doomed for ever.. only BJP can save AP... waiting for Jamli... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.