Jump to content

Recommended Posts

Posted

కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతం

జూరాలకు 2.662 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు

శ్రీశైలంలోకి 2.36 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

సాక్షి, హైదరాబాద్‌: వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి ఉగ్ర రూపం దాల్చుతున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలన్నీ నిండటం, ఉప నదులు ఉప్పొంగుతుండటంతో నదుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, కోయినా, పశ్చమ కనుమల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్‌లోకి 2.5 లక్షల నుంచి 3 లక్షల క్యూసెక్కు ల మేర వరద వస్తుండగా అంతే మొత్తం దిగువ జూరాల, శ్రీశైలాన్ని చేరుతోంది. శ్రీశైలంలో నీటినిల్వ 121 టీఎంసీలకు చేరింది. 
భారీ వర్షాలు.. అంతే భారీ వరద

కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర మహాబలేశ్వర్‌లో ఆది, సోమవారాల్లో 38 సెం.మీ వర్షం కురవగా కోయినా పరిధిలో 25 సెం.మీ వర్షం కురిసింది. ఇతర చోట్ల సైతం భారీ వర్షాలు కురవడంతో కృష్ణా బేసిన్‌లోని ఉప నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్‌లకు వరద ఉధృతి 20 వేల క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కుల మేర పెరుగుతోంది. సోమవారం ఆల్మట్టిలోకి 2,59 లక్షల క్యూసెక్కుల (23.54 టీఎంసీలు) మేర వరద వస్తుం డగా నారాయణపూర్‌లోకి 3 లక్షల క్యూసెక్కుల (27.27 టీఎంసీలు) వరద వస్తోంది. దీంతో జూరాలకు 2.62 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తుండగా అంతేమొత్తంలో నీటిని దిగువ శ్రీశైలానికి వదులుతున్నారు.

శ్రీశైలానికి ప్రస్తుతం 2.36 లక్షల క్యూసెక్కుల (21.45 టీఎంసీలు) వరద నమోదైంది. ఎగువ కురిసిన వర్షాల వల్ల మంగళవారం నుంచి వరద పెరిగే అవకాశం ఉంది. కనిష్టంగా 3 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చే అవకాశముందని కేంద్ర జలసం ఘం అంచనా వేసింది. అదే జరిగితే శ్రీశైలం 4–5 రోజుల్లోనే నిండనుంది. ఇప్పటికే శ్రీశైలం ద్వారా ఏపీ, తెలంగాణ తాగు, సాగు, విద్యుత్‌ అవసరాలకు 45,453 క్యూసెక్కుల నీటి విని యోగం మొదలు పెట్టింది. అయినా వరద ఉధృతి దృష్ట్యా ప్రాజెక్టు త్వరలోనే నిండనుంది. మహారాష్ట్రలోని ఉజ్జయినీ ప్రాజెక్టులోకి 1.60 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ 117 టీఎంసీలు కాగా ఇప్పటికే నీటి నిల్వ 97 టీఎంసీలకు చేరుకుంది. మరో 20 టీఎంసీలు వస్తే ఉజ్జయినీ రెండ్రోజుల్లో నిండుతుంది. 

ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత...
గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. సోమవారం మేడిగడ్డ వద్ద 7.97 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం నమోదైంది. మేడిగడ్డ 81 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మేడిగడ్డ పాయింట్‌ నుంచి 180 టీఎం సీల నీరు కిందికి వెళింది. వర్షాలతో ఎల్లంపల్లి నిండటంతో దానిలోకి వస్తున్న 35,953 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఎస్సారెస్పీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవాహాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి.

నేడు గోదావరిని పరిశీలించనున్న సీఎం కేసీఆర్‌
మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరి నదిని చూడడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, గోలివాడ పంప్‌హౌస్, ధర్మపురి పుణ్యక్షేత్రాలను సీఎం సందర్శిస్తారు. అధికారులు ఇంజనీర్లతోపాటు ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఈ పర్యటన సాగిస్తారు.
telangana-water.jpg

Posted
12 minutes ago, Hydrockers said:

Inko 2 or 3 days lo sagar ki gattiga vadulutaru emo water 

Sagar, Pulichintala kuda fill ayipothaya ee sari?

Posted
Just now, AndhraneedSCS said:

Sagar, Pulichintala kuda fill ayipothaya ee sari?

Inflow perigite dead easy 

Posted

Paina gattiga varshalu padutunayi kabatti 4lacs inflow vaste 10ndays lo anni dams nindipotai 

Hope for best

Posted
22 hours ago, Hydrockers said:

Inflow perigite dead easy 

4 to 5 lakh cusecs per day vaste oka 10 days pattiddi telugu rastralaki projects nindali ante sagar lo 200tmcs paine nindali it takes 15 days as per current rate 

Posted
1 minute ago, manadonga said:

4 to 5 lakh cusecs per day vaste oka 10 days pattiddi telugu rastralaki projects nindali ante sagar lo 200tmcs paine nindali it takes 15 days as per current rate 

5 lac cusecs per day ante around 50 tmc 

Posted
2 minutes ago, Hydrockers said:

5 lac cusecs per day ante around 50 tmc 

Approximately 

Posted

కృష్ణమ్మ పరవళ్లు

7 Aug, 2019 04:42 IST|Sakshi
fb.png
google+.png
twitter.png
whatsapp.png
pinterest.png
linkedin.png
sg.jpg?itok=AiMu90IV పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తడంతో దిగువకు వెళ్తున్న కృష్ణా జలాలు

ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి నాలుగు లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల

నేడు శ్రీశైలానికి నాలుగు నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల వరద

వరద ఇదే రీతిలో కొనసాగితే మూడు రోజుల్లో శ్రీశైలం.. వారంలో సాగర్‌ నిండే అవకాశం

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి మంగళవారం శాంతించగా కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చిన వరద జలాల్లో 7,800 క్యూసెక్కులను డెల్టా కాలువలకు విడుదల చేసి, మిగులుగా ఉన్న 10,45,848 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. బుధవారం వరద మరింత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రానికి 2,10,312 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 82,661 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 868.6 అడుగుల్లో 135.94 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ప్రధానంగా నదీ జన్మస్థానమైన మహాబలేశ్వరం పర్వతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల ఎగువ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి భారీగా వరద వస్తోంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరికల మేరకు ఈ రెండు జలాశయాల నుంచి మంగళవారం సాయంత్రం నీటి విడుదలను నాలుగు లక్షల క్యూసెక్కులకు పెంచారు. బీమా నదిపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తిగా నిండింది. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు జూరాల ప్రాజెక్టు మీదుగా శ్రీశైలాన్ని చేరనున్నాయి. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి నాలుగు నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని జలవనరుల శాఖ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరద ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లో శ్రీశైలం, ఆ తర్వాత వారం రోజుల్లో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు నిండుతాయి. తుంగభద్రలో సోమవారంతో పోల్చితే.. మంగళవారం వరద ప్రవాహం కాస్త పెరిగింది. 

శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పాదన
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించారు. మంగళవారం ఉదయం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో 0.226 మిలియన్‌ యూనిట్లు, భూగర్భ విద్యుత్‌ కేంద్రంలో 15.703 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. 

నేడు తీరం దాటనున్న వాయుగుండం
ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. బుధవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశాలోని బాలాసోర్‌ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. తుపానుగా మారే అవకాశం లేదని స్పష్టం చేసింది. మత్స్యకారులెవ్వరూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

ప్రభుత్వ సహాయ చర్యలు ముమ్మరం
తూర్పుగోదావరిలో వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. ముంపునకు గురైన గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తూర్పు గోదావరి జిల్లాలో 18,809 మందికి 85 సహాయ, పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించింది. వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 85 వైద్య శిబిరాలను నిర్వహించింది. ఒక్కో వరద బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు ఉచితంగా పంపిణీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 1,377.5 క్వింటాళ్ల బియ్యం, 10,100 లీటర్ల కిరోసిన్, 5,240 కిలోల కందిపప్పు, 6,967 లీటర్ల పామాయిల్, 6,967 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 420 గ్రామాల ప్రజలు వరదలబారిన పడ్డారు. రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో తూర్పుగోదావరి జిల్లాలో 64, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కలిపి మొత్తం 112 గ్రామాలకు రవాణా సదుపాయాలు లేకుండా పోయాయి. 17,737 ఇళ్లు గత 24 గంటలుగా జలదిగ్బంధంలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు తొమ్మిది వేల ఎకరాల్లోని పంటలు వరద ముంపునకు గురయ్యాయి. సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్‌ మంగళవారం వరద బాధితులను పరామర్శించారు. వచ్చే ఉగాది నాటికి వరద బాధితులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

Posted

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేసి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు 73,512 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవాకు 1,013 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 6 వేల క్యూసెక్కులు, తెలంగాణ ప్రాంతంలోని కల్వకుర్తికి 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 2,92,490 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. శ్రీశైలం గరిష్ట స్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలుకాగా ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటిమట్టం 871.20 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 146.9200 టీఎంసీలుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...