Jump to content

Recommended Posts

Posted

శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో పూర్తిగా నిచిపోయింది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. ఔట్ ప్లో 37 వేల 139 క్యూసెక్కులు, జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 . 807 టిఎంసిలు గా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 202. 9673 టిఎంసిలు, పూర్తి స్థాయి నీటిమట్టం 885 , ప్రస్తుత నీటి మట్టం 882. 70 గా ఉంది.

Posted
9 hours ago, Hydrockers said:

శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో పూర్తిగా నిచిపోయింది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. ఔట్ ప్లో 37 వేల 139 క్యూసెక్కులు, జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 . 807 టిఎంసిలు గా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 202. 9673 టిఎంసిలు, పూర్తి స్థాయి నీటిమట్టం 885 , ప్రస్తుత నీటి మట్టం 882. 70 గా ఉంది.

already 13 TMCs vadesara?

Posted
7 minutes ago, AndhraneedSCS said:

already 13 TMCs vadesara?

Full cheyaru bro

Oka 2 to 3 feets unchutaru

Posted
2 minutes ago, Hydrockers said:

Full cheyaru bro

Oka 2 to 3 feets unchutaru

inka aa matram daniki 215 TMCs ani cheppukovadam waste emo ga.. just 202 ani chebithesaripoddi emo 

 

I see only 20,000 Cusecs outflow from Srisailam. 

 

THought they could use much more than that. Not releasing water from pothireddypadu?

Posted
Just now, AndhraneedSCS said:

inka aa matram daniki 215 TMCs ani cheppukovadam waste emo ga.. just 202 ani chebithesaripoddi emo 

 

I see only 20,000 Cusecs outflow from Srisailam. 

 

THought they could use much more than that. Not releasing water from pothireddypadu?

Koddiga paina sudden varshalu padite kastam ani full cheyaru

Inflow takkuva vaste hold chestaru perige chance unte vadilipedutaru

Any way river loki peddaga water rakapoiana summer varaku no issue anta

Maku iathe ee crop next crop ki kuda water vastai annaru

  • 2 weeks later...
Posted

రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా.. తెలంగాణలోని పాత నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో మున్నేరు, కట్టలేరు, వైరా తదితర వాగులు వంకలు పోటెత్తి ప్రవహించడంతో పులిచింతల ప్రాజెక్టుకు దిగువన కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి మంగళవారం రాత్రి 7 గంటలకు 31,135 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి (3.07 టీఎంసీలు) చేరుకోవడంతో.. కృష్ణా డెల్టాకు 20వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 12,491 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజి పది గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు.. పశ్చిమ కనుమల్లో కూడా సోమవారం వర్షాలు కురవడంతో ఎగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది.

ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండుకుండలుగా మారడంతో.. కాలువలకు విడుదల చేయగా మిగిలిన నీటిని విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల నుంచి మంగళవారం 50 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఉజ్జయిని, తుంగభద్ర నదుల్లో వరద పెరగడంతో కాలువలకు విడుదల చేయగా మిగిలిన నీటిని విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద బుధవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకోనుంది. గోదావరి, వంశధార నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి మంగళవారం 2,85,111 క్యూసెక్కులు రాగా కాలువలకు 14,300 క్యూసెక్కులు విడుదల చేసి, మిగిలిన నీటినిసముద్రంలోకి వదులుతున్నారు

Posted
ఉత్తర కర్ణాటక ప్రాంతానికి మరో జలగండం పొంచివుంది. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి తోడు మలెనాడుగా పిలిచే కోస్తా తీరంలోనూ భారీ వర్షాల దెబ్బకు ఇప్పటికే అనేక నదులు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాల గ్రామాల ప్రజలు వరదభయంతో రాత్రింబవళ్ళు జాగారం చేస్తున్నారు. జలవనరులశాఖ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఉత్తర కర్ణాటకలోని 80కుపైగా గ్రామాలకు మళ్ళీ వరద ముంపు ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బెళగావితోపాటు పలు జిల్లాల అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేశారు.
 
 
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణణగా ఉత్తర కర్ణాటకలోని 80కుపైగా గ్రామాలకు మళ్ళీ వరద ముంపు ప్రమాదం ఉందని తెలుస్తోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. జలవనరులశాఖ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం మలెనాడు, కోస్తా తీరంలోని తుంగ, భద్ర, హేమావతి నదులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా కోయ్నా సహా పలు డ్యామ్‌లనుంచి నీరు విడుదల చేయడంతో కృష్ణ, మలప్రభ, ఘటప్రభ నదులు పరవళ్ళు తొక్కుతున్నాయి. గత నెల వరదలతో ఇంకా కోలుకోని గ్రామస్తులు తాజా పరిస్థితితో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. బెళగావి జిల్లాలోని కృష్ణా, ఘటప్రభ, మలప్రభ, దూద్‌గంగా, వేద్‌గంగా, హిరణ్యకేశి నదులలోకి భారీ ప్రమాణంలో నీరు చేరుకుంటుండడంతో ఆదివారం పలు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి శిబిరాలకు తరలించారు.
 
చిక్కోడి తాలూకాలోని కారాదాగ గ్రామంలోని బెంగాళీ బాబా దేవస్థానం, కళ్మోళా గ్రామంలోని దత్తాత్రేయ దేవస్థానం జలావృతమయ్యాయి. హిరణ్యకేశి నదిలో ప్రవాహం కారణంగా ఉక్కేరి తాలూకాలోని గోటూరు - నాగనూరు గ్రామ వంతెన నీట మునిగింది. బెళగావి జిల్లాలోని వాస్కో రైలును ఆదివారం రద్దు చేశారు. మహారాష్ట్ర - కర్ణాటకలోని అనేక రోడ్డు, రైలు మార్గాలు నీట మునగడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బాగల్కోటె జిల్లాలో కూడా 7 వంతెనలు నీట మునిగినట్టు అధికారులు తెలిపారు. కాగా తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి బి.ఎ్‌స.యడియూరప్ప ఆదివారం రాత్రి సమీక్షించారు. వరదభయం అధికంగా ఉన్న ప్రాంతాలలో సహాయ చర్యలు, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
Posted

Inko 2 weeks lo Malli Vijayawada ki varada vache chance undi baboru miru hyd lo ne undandi asale already anni dams nindi unnai almatti Narayanpur jurala srishelam Sagar pulichintala anni almost full

Posted

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. శ్రీశైలం క్రస్ట్‌ గేట్లపైనుంచి వరద నీరు దూకుతుంది. శ్రీశైలం ఆరు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 3.69లక్షలు, ఔట్‌ఫ్లో 3.08లక్షల క్యూసెక్కులుగా ఉంది

Posted

నాగార్జునసాగర్‌ 8 గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 2.75లక్షలు, ఔట్‌ఫ్లో 1.20లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులు, పూర్తిస్థాయి 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటిసామర్థ్యం 309.65 టీఎంసీలు గా ఉంది

Posted
On 8/25/2019 at 10:58 PM, snoww said:

Singur , Nijam Sagar are still almost empty 

idi patadi anukunta SRSP la ki 15 TMC daka vachinavi last week

Posted
20 hours ago, Hydrockers said:

Inko 2 weeks lo Malli Vijayawada ki varada vache chance undi baboru miru hyd lo ne undandi asale already anni dams nindi unnai almatti Narayanpur jurala srishelam Sagar pulichintala anni almost full

Hyderabad lo NTR Bhavan ammesi baboriki oka home kattinchandi Amaravati lo Ani pulkas ki naa request. Baboru elagu Paisa theesela leru Amaravati lo own home kosam. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...