Jump to content

Recommended Posts

Posted
 
637002602311315665.jpg
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నయీం కేసు వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం)కింద ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’ దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తుకు స్పందించిన ఆర్టీఐ నయీం కేసు వివరాలు వెల్లడించింది. కాగా.. నయీం కేసులో మాజీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య, పలువురు మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, అడిషనల్‌ ఎస్పీలు, శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, అమరేందర్‌రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్, సాయి మనోహర్‌రావు, శ్రీనివాసరావు, ప్రకాశ్‌రావు, వెంకటనర్సయ్య పేర్లు ఉన్నాయి. అంతే కాదు.. ఈ కేసులో పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఇన్‌స్పెక్టర్లు మస్తాన్‌, శ్రీనివాసరావు, మాజీద్‌, వెంకట్‌రెడ్డి, వెంకటసూర్యప్రకాశ్‌, రవికిరణ్‌రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్‌, నరేందర్‌గౌడ్‌, దినేష్‌, సాదిఖ్‌మియా పేర్లు కూడా ఉన్నట్లు ఆర్టీఐ తెలిపింది.
 
 
టీఆర్ఎస్ నేతలు కూడా..!
నయీం కేసులో టీఆర్ఎస్‌ నేతలు కూడా ఉన్నట్లు ఆర్టీఐ తేల్చింది. మాజీ జెడ్పీటీసీ సుధాకర్‌, భువనగిరి కౌన్సిలర్‌ అబ్దుల్ నాజర్‌, మాజీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేష్‌ పేర్లు, మాజీ సర్పంచ్‌ పింగల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ, వెల్దండ టీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య పేర్లు ఉన్నాయి.
 
 
డబ్బుపై ఫోరం ఆరా!
అంతేకాదు నయీం కేసులో ఎంత డబ్బు స్వాధీనం చేసుకున్నారు? అని ప్రశ్నించింది. అయితే ఆర్టీఐ ప్రకారం వేసిన దరఖాస్తులో హోం మినిస్టర్‌ అసెంబ్లీలో చెప్పిన ప్రకటనకు పొంతన లేదని ఫోరం తేల్చింది. నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఫోరం కోరింది. కాగా.. నాడు నయీం ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు దొరికిందని పోలీసులు అధికారులు తేల్చారు. అంతేకాదు.. కౌంటింగ్‌ మెషీన్‌ తీసుకొచ్చి డబ్బులు లెక్కించడం జరిగింది. అయితే తర్వాత సిట్‌ ఐజీ మాట మార్చారని.. ఇప్పటి వరకు నయీం కేసులో రూ.2.08 కోట్లు దొరికాయని ఫోరం చెబుతోంది. అయితే 1944 గ్రాములు బంగారం దొరికిందన్న సిట్‌ అధికారులు.. రెండు కౌంటింగ్ మెషీన్లు పెట్టి రోజంతా లెక్కించినా ఇంతే సొమ్ము దొరికిందా..? అని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రశ్నిస్తోంది
Posted

Cases like these are a good source of Income for corrupt police, politicians 

Posted

Deeni meeda governor ki oka request icharu special team tho investigation cheyanani

Posted
2 minutes ago, MiryalgudaMaruthiRao said:

Anduke bayatiki rakunda mukkodu chesadu

గుడ్‌ గవర్నెన్స్‌... @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...