snoww Posted August 2, 2019 Report Posted August 2, 2019 రాజకీయ జంప్! పార్టీ మారనున్న బొండా ఉమా! రాజకీయ చర్చకు దారి తీసిన ట్వీట్ ఈనాడు అమరావతి ‘హలో బెజవాడ..! నా తర్వాత రాజకీయ అడుగుపై చర్చ జరుగుతున్న తరుణంలో వేయబోతున్న సాహస, ధైర్యవంతమైన అడుగు ఇలా ఉండబోతోంది..!’ - ఇదీ మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు చేసిన ట్వీటు! విదేశీ పర్యటనలో ఉన్న బొండా ఉమా ఈ ట్వీట్‌తో పాటు ఆయన చేసిన బంగీ జంప్ దృశ్యాలను జోడించారు. తెదేపా నేతల్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ ఈ ట్వీటుపై చర్చ ప్రారంభమైంది. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన చేసిన ట్వీటుతో పార్టీ మారడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన వైకాపాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన అనుచరులు ఇదే అంశాన్ని ధ్రువీకరిస్తున్నారు. తాజాగా ‘బంగీజంప్’తో బొండా ఉమామహేశ్వరరావు రాజకీయ జంప్ ఖరారైంది. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించడం విశేషం. సాధారణ ఎన్నికల్లో (2019) విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బొండా ఉమామహేశ్వరరావు కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైకాపా తరఫున పోటీ చేసిన మల్లాది విష్ణు ఈ స్థానం నుంచి అతి తక్కువ ఆధిక్యతతో గెలిచారు. దీనిపై బొండా ఉమా పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. రీకౌంటింగ్ డిమాండ్ చేసినా ఎన్నికల అధికారి అనుమతించలేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కొట్టివేశారు. తక్కువ ఓట్లతో ఓటమి చెందడంతో అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 2014 ఎన్నికల్లో తొలిసారి మధ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి బొండా ఉమా గెలుపొందారు. అంతకుముందు తెదేపాలో పలు పదవులు నిర్వహించారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన సామాజిక వర్గానికి తెదేపా ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సామాజిక వర్గాల సమీకరణలో ఆయన మంత్రి పదవిని ఆశించారు. తప్పక వరిస్తుందని అంచనా వేశారు. కానీ పలు సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీనిపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. కొన్ని వ్యాఖ్యలు చేయడం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా నియమించారు. ఎన్నికలు అయ్యేంత వరకు ఆ పదవిలో కొనసాగారు. మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎంపీ కేశినేని నానితో కలిసి పని చేశారు. టీం విజయవాడ పేరుతో సమన్వయంతో పనిచేశామని చెప్పుకొన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి రూ.కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అయితే రవాణా శాఖ నాటి కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం వ్యవహారంలో బొండాఉమా కూడా ఉన్నారు. కమిషనర్ గన్‌మెన్‌పై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలోనే ఆగ్రహం ప్రదర్శించారు. దీంతో కమిషనర్‌ను క్షమాపణలు అడిగి ఆ వివాదానికి తెరదించారు. మధ్య నియోజకవర్గంలో వివాదాలు చాలానే చుట్టుముట్టాయి. ఎక్కువగా భూముల ఆక్రమణపై వివాదాలు చెలరేగాయి. స్వాతంత్య్ర సమరయోధునికి చెందిన స్థలాన్ని స్థిరాస్తి వ్యాపారం కోసం బొండా ఉమా అనుచరులు కబ్జా చేశారనే దానిపై కేసులు నమోదు అయ్యాయి. దీనిలో బొండా ఉమా భార్య పేరున కూడా రిజిస్టర్ చేశారు. తర్వాత వివాదం వెలుగులోకి రావడంతో రద్దు చేసుకున్నారు. ఈ వివాదం వెనుక ఉమా ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. దానికి సంబంధం లేదని ఆయన పలుమార్లు వివరణలు ఇచ్చారు. ఎమ్మెల్యే హోదాలో కాలువ గట్లు, భూములు సంస్థల పేరుతో ఇచ్చారు. ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేశారు. దీంతో నియోజకవర్గంలో అనుకూల వర్గంతో పాటు వ్యతిరేక వర్గం తయారైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన తన సామాజికవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు. కాకినాడలో జరిగిన కాపు సామాజిక వర్గ నేతల సమావేశానికి హాజరయ్యారు. నాడే పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరగడంతో ఆయన ఖండించారు. తర్వాత విజయవాడలో అదే సామాజిక వర్గ సమావేశానికి ఆయన నేతృత్వం వహించారు. భవిష్యత్తులో కాపు సామాజిక వర్గం తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు. పార్టీ మారడం లేదని నాడు వెల్లడించారు. ఇటీవల ఆయన న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. కువరవ్ వంతెన వద్ద బంగీ జంప్‌ను జులై 31న ఉదయం 10 గంటలకు చేశారు. 43 మీటర్ల ఎత్తు నుంచి ఆయన బంగీ జంప్ చేశారు. నదిలో నీటిని తాకుతూ మళ్లీ బంగీ చేశారు. దీన్నే ట్విట్టర్‌లో పెట్టారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం రాజకీయాల్లోనూ తీసుకుంటానని ఆయన ప్రకటించారు. ఇది రాజకీయ పార్టీ మార్పునకే సంకేతంగా భావిస్తున్నారు. వైకాపా.. తూర్పుపై దృష్టి..! బొండా ఉమాకు తెదేపాలో కొంత మంది నేతలతోనే సఖ్యత ఉంది. కొంత మందితో అంతగా కలిసేవారు కాదు. ఎంపీ కేశినేని నానితో సఖ్యత ఉండేది. ఆయన కూడా ఇప్పుడు పార్టీలో రెబల్‌గా మారారు. ట్వీట్ల యుద్ధం చేస్తున్నారు. అయితే ఆయన భాజపా వైపు దృష్టి సారించారని ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం ఖండిస్తున్నారు. పార్టీ మారే ప్రసక్తి లేదని చెబుతున్నారు. మధ్య నియోజకవర్గంలో రాజకీయంగా పారిశ్రామికవేత్త కోగంటి సత్యంతో బొండా ఉమాకు విభేదాలు ఉన్నాయి. ఎన్నికల్లో ఉమాకు వ్యతిరేకంగా సత్యం వైకాపాకు మద్దతు ఇచ్చారు. గతంలో సత్యంతో వ్యాపార సంబంధాలు ఉండేవి. వీరి భాగస్వామి రాంప్రసాద్ హైదరాబాద్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిలో నిందితుడిగా కోగంటి సత్యం ఉన్నారు. పోలీసులు అరెస్టు చేశారు. ఇది సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ పరిణామాలు కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయన రాకను ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వైకాపాలో చేరితే తూర్పు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి ఆయన చేసిన ట్వీటు మాత్రం పార్టీ మార్పును ధ్రువీకరిస్తోంది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. Quote
kothavani Posted August 2, 2019 Report Posted August 2, 2019 Idu highlight Girish chowdary @girish2105 · Jul 31 Replying to @Bondauma_MLA Adi Bungee jump anna,Spelling lo mistake ayina parle....But Political life lo jarigithene Bagodu 2 Quote
Android_Halwa Posted August 2, 2019 Report Posted August 2, 2019 7 minutes ago, kothavani said: Idu highlight Girish chowdary @girish2105 · Jul 31 Replying to @Bondauma_MLA Adi Bungee jump anna,Spelling lo mistake ayina parle....But Political life lo jarigithene Bagodu 2 Hehe...inko 5 yendlu entha mothukunna peddaga origedi emi ledu Quote
reality Posted August 2, 2019 Report Posted August 2, 2019 14 minutes ago, snoww said: Odiemma engilipeesu.. Quote
Amy99 Posted August 2, 2019 Report Posted August 2, 2019 3 minutes ago, reality said: Odiemma engilipeesu.. Quote
Jailjaggay Posted August 2, 2019 Report Posted August 2, 2019 5 minutes ago, ARYA said: labor gadu 5 minutes ago, Amy99 said: Quote
raccharambola Posted August 2, 2019 Report Posted August 2, 2019 malli veediki mantri padavi TDP lo raledani edchadu last time, LoT of folks are ready to contest from TDP in Vijayawada central. Let him go.. Quote
Hydrockers Posted August 2, 2019 Report Posted August 2, 2019 Call money case lu unnai anukunta kada Quote
AndhraneedSCS Posted August 2, 2019 Report Posted August 2, 2019 BJP loki velthunnada? YCP loka? Bungee jump ki match avvali ante sahasopetham ga PSP kani JSP loki kani try chestada? Quote
caesar Posted August 2, 2019 Report Posted August 2, 2019 Hammayyaa manchidhi Ra ayyaa.... 2004 lo 4% reservations Kaaps isthaa ani ivakapoyina Reddy ys Ni gelipinchaaru... PK ni comment chesi...Kaaps Ni asalu dekhanu kooda dekhaledhu REDDY Jagan.....poyi Sanka naakandi raa Babu REDDY raajy lo Jagan dhi... Quote
reality Posted August 2, 2019 Report Posted August 2, 2019 2 minutes ago, caesar said: Hammayyaa manchidhi Ra ayyaa.... 2004 lo 4% reservations Kaaps isthaa ani ivakapoyina Reddy ys Ni gelipinchaaru... PK ni comment chesi...Kaaps Ni asalu dekhanu kooda dekhaledhu REDDY Jagan.....poyi Sanka naakandi raa Babu REDDY raajy lo Jagan dhi... Lokesh next in line anta...ila andharu velli armpitlicking sesthe, chivariki sandral okade migilipothademo ani Devibob chodhry worrying anta. Quote
snoww Posted August 2, 2019 Author Report Posted August 2, 2019 2 hours ago, AndhraneedSCS said: BJP loki velthunnada? YCP loka? Bungee jump ki match avvali ante sahasopetham ga PSP kani JSP loki kani try chestada? Dramoji vesina news. So ycp ee anukunta Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.