Jump to content

Prime, Netflix and Hotstar Movie Updates


Recommended Posts

Posted
15 hours ago, LadiesTailor said:

Ekkada ? 

Iptv.. Ott or tv Starz anta not sure 

Posted

saptagiri llb chusa.

remake chesthe chesaru...names kuda marchara. telugu lawyer peru rajpal emti man. 

telugu actor peru emo albert pinto anta. names as it is hindi movie lovi vadesaru.

Posted

Miss India (Spoilers kaadu ehe motham story ide)

Tagline: Heroine ki mass hero elevations isthe tappa??? oh my thaman

కథనం-విశ్లేషణ: మన హీరోయిన్ గారికి టీ అంటే మహా ఇష్టం. ఎంతిష్టం అంటే.. ఆమెకు జబ్బు చేస్తే మాత్ర వేసుకోదు. టీనే తాగుతుంది. తర్వాత హీరోయిన్ అమెరికాకు వెళ్లి అక్కడ టీ దొరకలేదని విలవిలలాడిపోతుంది. ఒక అబ్బాయితో డిన్నర్ కు వెళ్లి ఫుల్లుగా బువ్వ తిన్నాక కూడా మళ్లీ టీనే అడుగుతుంది. వ్యాపారం చేయాలన్న తన ఆలోచనను ఇంట్లో వాళ్లు అర్థం చేసుకోలేదని బయటికి వచ్చేశాక ఆమెకు అప్పుడు కూడా టీనే గుర్తుకొస్తుంది. పెద్ద రేంజిలో టీ వ్యాపారం చేసెయ్యాలని ఫిక్సయిపోతుంది. అందుకోసం ఒక పెద్ద కాఫీ బ్రాండును నడిపించే మల్టీ మిలియనీర్ ను కలుస్తుంది. అతను కాదంటే సవాలు చేస్తుంది. సొంతంగా టీ బిజినెస్ పెట్టేస్తుంది. ఆమె ధాటికి వేల కోట్ల అధిపతి అయిన కాఫీ బ్రాండోడు కుప్పకూలిపోతాడు. అమెరికన్లందరూ డ్రగ్స్ కు బానిసలైపోయినట్లు మనమ్మాయి గారి టీ మత్తులో పడి కొట్టుకుంటారు. ఒకట్రెండు సార్లు టీ తాగిన పుణ్యానికి ఆమె టీ బిజినెస్ ప్రమాదంలో ఉందంటే నోట్ల కట్టలు పట్టుకుని ఆమె షాపులోకి పొలోమని వచ్చేస్తారు. ఆన్ లైన్లోనూ డాలర్లు కుమ్మరించేస్తారు. అంతా చదువుతుంటే.. ‘ఏమిటి ఈ టీ గోల’ అనిపిస్తోందా? నాలుగు వాక్యాలు చదువుతున్నందుకే అంత అసహనం కలిగితే.. తెరపై రెండుంబావు గంటల పాటు ఈ ‘టీ’ గోలను భరించే వాళ్ల పరిస్థితేంటో ఊహించుకోండి.

 

మిస్ ఇండియా’లో ఒక సన్నివేశంలో విలన్ గురించి పక్కనుండే అసిస్టెంట్ అమెరికాలోనే అతి పెద్ద ఇండియన్ బిజినెస్ మ్యాన్ అని ఉపోద్ఘాతం ఇస్తాడు. ఐతే ఇంట్లోంచి బయటికొచ్చేసి చేతిలో చిల్లిగవ్వ లేని హీరోయిన్ అలాంటోడిని నేరుగా ఆయన ఆఫీసులో కలిసి బిజినెస్ ప్రపోజల్ పెట్టేద్దామని వెళ్తుంది. రిసెప్షన్లో ఆయన కోసం అడిగితే అపాయింట్మెంట్ లేకపోతే ఆయన్ని కలవడానికి వీల్లేదంటారు. హీరోయిన్ ‘‘నన్ను కలవకపోతే పెద్ద అవకాశం కోల్పోతారని మీ ఎండీకి చెప్పు అంటుంది’’. ఆ మాట విని ఆ వేల కోట్ల అధిపతి అనామకురాలైన హీరోయిన్ రిసెప్షన్లో కూర్చున్న చోట ప్రత్యక్షం అయిపోతాడు. ఆమెతో తాపీగా ముచ్చట్లు పెడతాడు. బిజినెస్ ప్లాన్ వింటాడు. నీ ఐడియా బాలేదు కానీ ప్రెజెంటేషన్ బాగుంది నాతో చేతులు కలిపేయ్ అంటాడు. కానీ ఆ వేల కోట్ల అధిపతి ఆఫర్ నచ్చని హీరోయిన్ ‘‘మీదాకా వస్తానో.. మిమ్మల్నే దాటేస్తానో విధి నిర్ణయిస్తుంది’’ అంటూ  పంచ్ డైలాగ్ పేల్చి స్లోమోషన్లో నడుస్తుంటే ఒక పేద్ద మాస్ హీరోకు ఎలివేషన్ ఇస్తున్నట్లుగా మోతెక్కిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్.

తన దగ్గర పైసా పెట్టుబడి లేదు. పైగా తాను అమ్మాలనుకున్న ఉత్పత్తికి ఆ దేశంలో ఉనికే లేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న మరో ఉత్పత్తికి అక్కడి జనాలు అడిక్ట్ అయి ఉన్నారు. అలాంటపుడు వాళ్ల ఆలోచన మార్చి.. తన ఉత్పత్తి వైపు ఆకర్షితుల్ని చేసి తన వ్యాపారాన్ని ఒక స్థాయికి తీసుకురావడానికి హీరోయిన్ ఎంతగా స్ట్రగుల్ అవ్వాలి. దీన్నెంత బలంగా చూపించాలి. కానీ ‘మిస్ ఇండియా’లో మాత్రం హీరోయిన్ గట్టిగా ఒక కొటేషన్ చెబితే చాలు.. మూడు కోట్ల పెట్టుబడి రెడీ. అనుకోకుండా తన షాపులోకి వచ్చిన కుక్కపిల్లను ఆడించి దాని యజమానికి ఒక టీ చేసి ఇస్తే చాలు.. బిజినెస్ సూపర్ హిట్.. దేశమంతా బ్రాంచులు. ఇన్వెస్టర్లు ‘ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు జాయిన్ విత్ యు’ అంటూ పొంగిపోతారు. రెండు నెలలు తిరిగేలోపు హీరోయిన్ బిజినెస్ చూసి విలన్ షాక్. బ్లాంక్ చెక్ తీసి ఆమె ముందు పెట్టేసి ఆమె వ్యాపారాన్ని తనకు రాసిచ్చేయమంటాడు. ఆమె నో అందని పరమ రొటీన్ గా తన పక్కనున్న స్నేహితురాలిని కొనేసి వ్యాపారాన్ని దెబ్బ తీసేస్తాడు. కూలిపోయిన ఆమె సామ్రాజ్యాన్ని చూసి కామెడీ చేస్తాడు. అయినా హీరోయిన్ తగ్గుతుందా..? ఛాన్సే లేదు. ‘‘నువ్వు గ్రాముల్లో కలిగించిన ఈ కష్టాన్ని టన్నుల్లో తీసుకోవడానికి రెడీగా ఉండు మిస్టర్ కైలాష్’’ అంటూ ‘జల్సా’లో పవన్ కళ్యాణ్ స్టైల్లో పంచ్ డైలాగ్ పేల్చి స్లో మోషన్లో ముందుకు కదులుతుంది. మళ్లీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్.

కథలో ఏమాత్రం అతకని విధంగా మాస్ హీరోల స్టయిల్లో హీరోయిన్ పాత్రను ప్రెజెంట్ చేసి ప్రేక్షకులను తీవ్రమైన అసహనానికి గురి చేశాడు కొత్త దర్శకుడు నరేంద్రనాథ్.

Posted
8 hours ago, padmasri said:

Yes. That one 

Ok thank you. I like that lead actor acting, recently watched Marvelous miss maisel , good acting

Posted
2 hours ago, Dippindots said:

Miss India shooting nijamga America lo chesara 🙉

Yes foreign lone 

Posted
Just now, Battu123 said:

Europe?

Emo. Pedda outdoors em cheyale

max Goa anukunta

Posted
Just now, Dippindots said:

Emo. Pedda outdoors em cheyale

max Goa anukunta

Ok trailer lo manchi rich buildup icharu

Posted
3 minutes ago, Battu123 said:

Ok trailer lo manchi rich buildup icharu

Antha build up ae

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...