snoww Posted August 5, 2019 Report Posted August 5, 2019 పోలవరం కాఫర్ డ్యామ్.. వైసీపీ, టీడీపీ మధ్య తెరపైకి కొత్త వివాదం.. 8/5/2019 5:29:39 AM వరద.. రాజకీయం! ముంపు సమస్యపై పాలక, ప్రతిపక్షాల ఆరోపణలు రంపచోడవరం/దేవీపట్నం : గోదావరి వరద పోటెత్తుతోంది. దేవీపట్నం మండలంలోని 32 గ్రామాలు ముంపులో నానుతున్నాయి. ఇక్కడి జనాన్ని నిర్వాసిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు ఉన్నారు. మంత్రులు పర్యటించి ఆసరాగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. ఇదంతా ఓవైపు. మరోవైపు ఈ వరద రాజకీయ రంగు పులుముకుంది. ఈ వరద గిరిజన గ్రామాలను ముంచెత్తడానికి ఎవరు కారణమనే విషయంపై రగడ మొదలైంది. ముందు చూపు లేకుండా నిర్వాసితులను ఖాళీ చేయించకుండా గత టీడీపీ ప్రభుత్వం కాఫర్ డ్యామ్ నిర్మించిందని, దేవీపట్నం మండలంలోని చాలా గ్రామాలు వరదలో మునిగిపోవడానికి వారి అనాలోచిత చర్యలే కారణమని వైసీపీ ప్రభుత్వం ఆరోపణలను తెర మీదకు తెచ్చింది. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకంటే ముందు ముంపు మండలాల్లో బాధితులకు పునరావాస గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి. అలా జరగకపోవడం వల్లే ఏజెన్సీ మండలాలకు ముంపు నష్టం వాటిల్లింది’ అని ఆదివారం డిప్యూటీ సీఎం బోస్ ఆరోపించారు. ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, నేతలు కూడా వరద ముంచెత్తడానికి కాఫర్ డ్యామ్ ప్రధాన కారణమని చెబుతూ వస్తున్నారు. అయితే ఏజెన్సీలో ముంపు సమస్యకు అసలు కాఫర్ డ్యామ్ కారణమే కాదని, కేవలం ముందుచూపు లేకపోవడమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. సహాయక చర్యల్లో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం తంటాలు పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి 30 కేజీల బియ్యం, కిరోసిన్, మంచినూనె తదితర నిత్యావసరాలతోపాటు నగదును అందజేశామని.. ఇప్పుడు ఆలస్యంగా అరకొరగా చర్యలు చేపట్టారని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో ముంపు సమస్య రాజకీయ అంశంగా మారింది. రెండు పార్టీలు తమ వాదనను సమర్థించుకునే పనిలో పడ్డాయి. అయితే వరదకు కాఫర్ డ్యామ్ కారణమేనా.. అన్న అంశంలో ఇరిగేషన్ ఉన్నతాధికారి ఒకరు వాస్తవిక కోణాన్ని చెప్పారు. దేవీపట్నం వద్ద ఏటా వరద రావడం, ఆయా ప్రాంతాలు మునిగిపోవడం సర్వసాధారణం. కొందరు సురక్షిత పునరావాస ప్రాంతాలకు, కొందరు కొండ మీద తాత్కాలిక నివాస ప్రాంతాలకు తరలివెళతారు. ఈ ముంపు వచ్చాక ఒకటి రెండు రోజుల్లోనే నీరు వెనక్కు మళ్లిపోతుంది. దాంతో మళ్లీ తిరిగొస్తారు. ఈసారి అలా జరగలేదు. దీనికి ఒక కారణం ఇక్కడ వరదల సమయంలో గోదావరి నీటిమట్టం 26 మీటర్లు ఉంటుంది. ఈసారి 28 మీటర్లు ఉంది. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్ వల్ల ఉధృతి స్థాయి రెండు మీటర్ల మేర పెరిగింది. ముంపు ఏటా వచ్చినా ఒకటి రెండు రోజుల్లో లాగేసేది. ఈసారి నిలకడగా ఉండడంతో ముంపు తీవ్రత కనిపిస్తోందని చెప్పారు. ఇక నిర్వాసితులకు పునరావాస గృహాలను నిర్మించకపోవడంతో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగలేదు. నిర్వాసితులకు వసతి సౌకర్యాలు కల్పించడంలో ఆది నుంచీ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. నిర్వాసితులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారిది అరణ్యరోదనగానే మిగిలింది. ముఖ్యంగా జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు పునరావాసం కల్పించడంలోనూ, ఆర్‌ఆర్ ప్యాకేజీని అమలు చేయడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే వచ్చారు. ఇదే ఇప్పుడు శాపంగా మారింది. అధికారుల వైఫల్యం.. నెపం కాఫర్ డ్యామ్‌కు దాదాపు రెండు నెలల నుంచి దేవీపట్నం మండలాలకు చెందిన ప్రజలు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. వరదల సమయంలో తమ గ్రామాలు మునిగిపోతాయని, తక్షణ చర్యలు చేపట్టాలని వేడుకుంటూనే ఉన్నారు. కానీ ఇక్కడ ముందస్తు చర్యలేవీ జరగలేదు. వాస్తవానికి దేవీపట్నం మండలంలో వరద ముంచెత్తడం కొత్తేమీ కాదు. వరద సమయంలో కొండ మీదకు కొన్ని గ్రామాల గిరిజనులు పెట్టీబేడా సర్దుకుని చేరుకుంటారు. మిగిలిన వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు చేరుస్తారు. వారికి వరద రోజుల్లో ఆహార ఏర్పాట్లు చేస్తారు. వైద్యపరమైన సహాయం అందిస్తారు. బోట్లు, నాటు పడవలను సిద్ధం చేస్తారు. కానీ ఈసారి ముందుగా అధికారులు మేల్కోలేదు. బదిలీల కారణంగా ఉన్నతాధికారులూ దృష్టి పెట్టలేదు. దాంతో వారం రోజుల నుంచే కసరత్తు ప్రారంభించారు. గోదావరి వరదను సకాలంలో గుర్తించకపోవడం, ప్రజలను అప్రమత్తం చేయడంలో తగిన శ్రద్ధ చూపించకపోవడం, బాధితులను సహాయక శిబిరాలకు తరలించడం, వారికి ఆహారాన్ని సకాలంలో అందించడం వరకూ ప్రతి అంశంలోనూ అధికారుల వైఫల్యం కనిపించింది. గోదావరి జిల్లాల్లో.. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వరద సమయంలో పనిచేసిన అనుభవం ఉన్నవారెవరూ క్షేత్ర స్థాయిలో లేకపోవడం ప్రధాన సమస్య అయ్యింది. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్వయంగా ఇక్కడి పరిస్థితులపై నిరంతరం ఎన్ని సూచనలు చేస్తున్నా అధికారులు మాత్రం సహాయ చర్యలను సకాలంలో చేపట్టలేకపోయారు. వరదకు కాఫర్ డ్యామే కారణమనే ముద్ర వేసి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నట్టు కనిపిస్తోంది. నిత్యావసరాలు అందించడంలో విఫలం ‘వరద బాధితులందరికీ ఏ లోటూ జరక్కూడదు. బాధితులకు ఆసరాగా నిలవండి’ అంటూ సీఎం ప్రకటన చేయడమేగాకుండా ఏఏ నిత్యావసరాలు అందించాలో ఉత్తర్వులూ ఇచ్చారు. అధికారులు వీటిని అందించడంలో ఇంకా కసరత్తులోనే ఉన్నారు. ముఖ్యంగా సహాయక శిబిరాల్లో ఉన్న బాధితులకు సకాలంలో ఆహారాన్ని అందించలేని పరిస్థితి ఉంది. దేవీపట్నం, తొయ్యేరు, ఎ.వీరవరం, పూడిపల్లి, పోశమ్మగండి శిబిరాలకు కేంద్రీకృత వంటశాల నుంచి ఆహారాన్ని తయారు చేయించాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. నాణ్యమైన ఆహారం అందించడం లేదని, సకాలంలో పంపిణీ చేయడం లేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. దేవీపట్నంలోని శిబిరానికి శనివారం అర్ధరాత్రి, ఆదివారం మధ్నాహ్నం మూడు దాటాక ఆహారాన్ని పంపించడంతో అక్కడి వారు ఆకలితో అలమటించారు. స్థానికంగానే వండి వడ్డించే ఏర్పాట్లు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. దాంతో శిబిరాలకు రావడానికి ముంపు బాధితులు ఆసక్తి చూపడం లేదు. తప్పొప్పులు పక్కనబెడితేనే... వరద సహాయమంటే అత్యవసర సాయం. వరదకు కారణాలను విశ్లేషణ చేయడం ఒక ఎత్తైతే, సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదిక చేపట్టడంలో ఏమాత్రం ఏమరపాటు ఉండకూడదు. దేవీపట్నం మండలంలోని 32 గ్రామాలకు వరదతోపాటు ఎగువున ఉభయగోదావరి జిల్లాలకు సరిహద్దున ఉన్న కొన్ని గిరిజన గ్రామాలూ ఉన్నాయి. వారికి సాయం అందించాలన్నా ఎంతో కష్టంతో కూడుకున్న పని. వరద సమయాల్లో పూర్తి అనుభవం ఉన్న అధికారులను నియమిస్తే బాధితులకు తక్షణ సాయం అందుతుంది. లేదంటే పెద్ద మూల్యమే చెల్లించాలి. కనీసం రోడ్డు సదుపాయం కూడా లేని ప్రాంతాల నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో కేంద్రీకరించేలా చేయాలని బాధిత గ్రామాల జనం కోరుతున్నారు. Quote
snoww Posted August 5, 2019 Author Report Posted August 5, 2019 గిరిజనులను ముంచిన కాఫర్ డ్యామ్ Aug 05, 2019, 04:13 IST వరదకు ముందు కాఫర్ డ్యామ్, కాఫర్ డ్యామ్ వద్ద వరద ఉధృతి గోదావరి వరద ముంపులో ఐదు వేల కుటుంబాలు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికకే నిండా మునక కనీస అంచనాల్లేకుండా టీడీపీ సర్కార్ చేసిన తప్పిదాలే ఉపద్రవానికి కారణం సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: నిపుణుల మాటలను పెడచెవిన పెట్టి చంద్రబాబు సర్కార్ నిర్మించిన కాఫర్ డ్యామ్ గిరిజనుల ‘కొంప’ ముంచింది. అదే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో మన్యం వాసులు నిద్రలేని రాత్రులు గడిపే స్థితికి కారణమైంది. కాఫర్ డ్యామ్ నిర్మాణంతో సమీప గ్రామాల్లో ప్రజలు వరద ముంపులో చిక్కుకుంటారని తెలిసినా నాటి ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం డ్యామ్‌కు సమీపాన ఉన్న దేవీపట్నం నుంచి కూనవరం మండలం వరకూ ఉన్న సుమారు ఐదు వేల కుటుంబాలు గోదావరి వరద ముంపునకు గురయ్యాయి. కాఫర్ డ్యామ్‌ను ఒక క్రమ పద్ధతిలో నిర్మించి ఉంటే ఇంతటి వరదను ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పడేదే కాదు. అటు పశ్చిమ గోదావరి జిల్లా పైడిపాక నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా పోసమ్మగండి వరకూ 1800 మీటర్ల పొడవు, 2400 మీటర్ల వెడల్పుతో కాఫర్ డ్యామ్‌ను నిర్మించారు. ఈ డ్యామ్‌కు రెండు వైపులా 300 మీటర్లు వంతున ఖాళీగా వదిలేశారు. ఏటా గోదావరికి ఆగస్టు వచ్చేసరికి వరదలు వస్తాయని తెలిసి కూడా ముందస్తు అంచనాలు లేకుండా చంద్రబాబు సర్కార్ డ్యామ్ నిర్మాణం చేపట్టింది. కాఫర్ డ్యామ్ నిర్మించే ముందు కనీసం నిర్వాసితులకు రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ (ఆర్‌అండ్‌ఆర్) ప్యాకేజీ అందజేసి కాలనీలు నిర్మించి ఉంటే ఇప్పుడు ఇంతటి విపత్కర పరిస్థితి ఎదురయ్యేది కాదు. వాస్తవానికి భద్రాచలం వద్ద గోదావరి 53 అడుగులకు చేరుకుని మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడు మాత్రమే ఈ గిరిజన గ్రామాలు వరద ముంపునకు గురవుతాయి. కానీ ప్రస్తుతం భద్రాచలం వద్ద 46 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే జారీ చేశారు. అంటే.. వరద ముంపు ఈ గిరిజన గ్రామాలకు ఉండకూడదు. 48 అడుగులతో ఉన్నప్పుడు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే 30 గ్రామాలు, 53 అడుగులతో ఉన్నప్పుడు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే గిరిజన గ్రామాలన్నీ వరద నీటిలో మునిగిపోతాయి. గోదావరికి భారీగా వరదలు వచ్చి భద్రాచలం వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన 1953, 1986, 2006, 2013లలో మాత్రమే ఈ గిరిజన గ్రామాలు నీట మునిగాయి. కానీ ఇప్పుడు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసే సరికే గిరిజన గ్రామాలన్నీ జలదిగ్బంధానికి గురయ్యాయి. ఇదంతా కాఫర్ డ్యామ్ నిర్మాణంతో ఎదురైన వరద ఉధృతేనని అధికారులే చెబుతున్నారు. Quote
snoww Posted August 5, 2019 Author Report Posted August 5, 2019 Both Saakshit and Boothu Kittu versions posted Quote
Idassamed Posted August 5, 2019 Report Posted August 5, 2019 5 minutes ago, snoww said: Both Saakshit and Boothu Kittu versions posted Please post the gist of these articles bro. Thanks. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.