Jump to content

Tappu Evaridi


Recommended Posts

Posted
మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌‌కు కోపమొస్తే...
09-08-2019 15:32:12
 
 
637009615314142492.jpg
  • 88 మంది ఉద్యోగులపై వేటు
  • హరితహారం సమావేశానికి గైర్హాజరుపై కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఆగ్రహం
  • 64 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు, 24 మంది పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్‌ వేటు
  • ఇంత భారీ మొత్తంలో చర్యలు తీసుకోవడం తొలిసారి
మహబూబ్‌నగర్: ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం, జలశక్తి అభియాన్‌ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశం మధ్యలోనే ఉద్యోగులు వెళ్లిపోవడంపై మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ సీరియస్‌గా స్పందించారు. ఏకంగా 88 మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. 64 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు, 24 మంది పంచాయతీ కార్యదర్శులపై చర్యలకు ఉపక్రమించారు. గురువారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ అంబేద్కర్‌ కళాభవన్‌లో హరితహా రంపై ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శు లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేశారు.
 
 
సాయంత్రం 7 గంటలకు సమావేశం ప్రారంభం కాగా కలెక్టర్‌ ఎనిమిదిన్నర గంటలకు వెళ్లారు. అప్పటికే సమావేశానికి వచ్చిన పీల్డ్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. కలెక్టర్‌ వచ్చిన తర్వాత హాజరు శాతం తక్కువగా ఉండటంపై ప్రశ్నించడంతో వచ్చి వెళ్లిపోయారని అధికారులు సమాచారం ఇవ్వడంతో అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సి ఉండటం, జలశక్తి అభియాన్‌ పథకాన్ని ఎలా చేపట్టాలో వంటి అంశాలపై ప్లానింగ్‌ తయారు చేయాల్సిన సమావేశంపై ఇంత నిర్లక్ష్యం ఉండటం దారుణమని అయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మండలాల వారీగా గైర్వాజరైన వారి లెక్కలు తీసుకొని వారందరినీ వెంటనే సస్పెండ్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అప్పటికప్పుడే సంబంధిత శాఖ నుంచి సస్పెన్షన్‌ ఉత్తర్వులు కూడా వెలువడటం గమనార్హం.
 
 
సస్పెన్షన్‌కు గురైన ఫీల్డ్‌ అసిస్టెంట్లలో బాలానగర్‌ మండలంలో పది మంది, అడ్డాకులలో 14, జడ్చర్లలో నాలుగు, దేవరకద్రలో 7, సిసికుంటలో 1, కోయిల్‌కొండలో 8, నవాబుపేట 11, మహబూబ్‌నగర్‌లో 1, మిడ్జిల్‌లో 7, మూసాపేటలో ఒకరు ఉన్నారు. కలెక్టర్‌ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశ మందిరంలో నిశబ్ద వాతావరణం నెలకొన్నది. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ క్రాంతి, డీఆర్‌డీవో పీడీ విక్రంరెడ్డి, అటవీశాఖ అధికారి జంగా రెడ్డి తదితరులున్నారు.
Posted

First ee collector ni suspend cheyali govt

Adhi imp meeting iathe vadu enduku late vachadu

Posted
4 minutes ago, Hydrockers said:

First ee collector ni suspend cheyali govt..Adhi imp meeting iathe vadu enduku late vachadu

+1

Posted

Meeting at 7PM, he came at 8:30 PM and got very angry anta ... edo pai nundi digi vachadu ani feel avutunnadu emo 

  • Upvote 1
Posted
2 minutes ago, AndhraneedSCS said:

Meeting at 7PM, he came at 8:30 PM and got very angry anta ... edo pai nundi digi vachadu ani feel avutunnadu emo 

+1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...