AndhraneedSCS Posted August 9, 2019 Report Posted August 9, 2019 గ్రామ వలంటీర్లలో వాళ్లుంటే వెంటనే తొలగించాలని ఆదేశాలు! 09-08-2019 11:04:27 చదువుకుంటున్న తొలగింపు ప్రైవేటు ఉద్యోగులను సైతం.. తొలగించాలంటూ ఆదేశాలు చిత్తూరు:చదువుకుంటున్న విద్యార్థులను గ్రామ వలంటీర్లుగా ఎంపిక చేసిన చోట తక్షణం వారిని తొలగించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఎం. గిరిజా శంకర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. వివిధ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను పలు చోట్ల వలంటీర్లుగా ఎంపిక చేశారని రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక శక్తివంతమైన వ్యవస్థను నిర్మిస్తున్న దశలో ఈ విధమైన ఎంపికలను తీవ్రమైనవిగా పరిగణిస్తున్నట్లు కమిషనరు ఆక్షేపించారు. దీన్ని వెంటనే సరిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను, జిల్లా పంచాయితీ అధికారులను, జడ్పీ సీఈవోలను ఆదేశించారు. ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న వారిని కూడా గుర్తించి తక్షణం తొలగించాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. విద్యార్థులు ఎలా ఎంపికయ్యారు? ఒక చిన్నపాటి జాగ్రత్తను అధికారులు విస్మరించడంతోనే రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు గ్రామ వలంటీర్లుగా ఎంపికయ్యారని సమాచారం.దరఖాస్తు చేసుకునే సమయంలోనే అభ్యర్థికి సంబంధించిన విద్యార్హతల సర్టిఫికెట్ల అప్‌లోడింగ్ విషయంలో అధికారులు ఏమరుపాటుకు గురయ్యారు. ఉదాహరణకు ఇంటర్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్ మార్కుల జాబితాను మాత్రం అప్‌లోడ్ చేయమన్నారు. అక్కడ ఇంటర్ మార్కుల జాబితాతోపాటు బదిలీ సర్టిఫికెట్టు (టీసీ)ను కూడా అప్‌లోడ్ చేయించి వుంటే ఈ సమస్య తలెత్తేది కాదు. ఎందుకంటే ఇంటర్ పూర్తి చేసిన వారు దానికి సంబంధించిన టీసీ, మార్కుల జాబితాలను ఆ పై చదువుల కోసం అందజేస్తేగానీ డిగ్రీలో కానీ, ఇతర కోర్సుల్లో కానీ చేరడానికి వీలుండదు. అడ్మిషన్ పూర్తయిన తరువాత మార్కుల జాబితాను మాత్రం తిరిగి ఇచ్చేస్తారు. టీసీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి ఇవ్వరు. కోర్సు పూర్తయిన తరువాత ఆ కోర్సుకు సంబంధించిన టీసీ మాత్రమే ఇస్తారుగానీ అంతకు ముందు ఇంటర్‌కు సంబంధించిన టీసీ ఇవ్వరు. దరఖాస్తు సమయంలో ఇంటర్ టీసీని కూడా అప్‌లోడ్ చేయాలని నిబంధన విధించి వుంటే ఇలా విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం వుండేది కాదు. ప్రైవేటు సంస్థల్లో పని చేసే వారిని కూడా గుర్తించి తక్షణం తొలగించాలని ఆదేశించారు. కానీ ఈ విధమైన వారి గుర్తింపు ఇప్పటికప్పుడే సాధ్యపడదని, గ్రామ వలంటీర్లు భాద్యతల్లో చేరిన తరువాత వీటికి సంబంధించి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారించి తొలగించ వచ్చునని చెబుతున్నారు Quote
AndhraneedSCS Posted August 9, 2019 Author Report Posted August 9, 2019 TC soft copy unte emi chestaru? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.