Jump to content

Kobbarimatta review..hit anukunta


Recommended Posts

Posted

 

కొబ్బరి మట్ట’ మూవీ రివ్యూ మూవీ రివ్యూ

samayam telugu
సంపూర్ణేష్ బాబు, ఇషికా సింగ్, గీతాంజలి, గాయత్రి గుప్తా, కత్తి మహేష్, షకీలా, ఏలూరి శ్రీను
Telugu, ComedyFri Aug 09 20191 Hrs 50 Min
విమర్శకుడి రేటింగ్3.0/5రీడర్ రేటింగ్3.5/5

కొబ్బరి మట్ట’ సంపూర్ణేష్ బాబు.. చూడ్డానికి పొట్టిగా, బానలా ఉండే పొట్టతో, వింత తలకట్టుతో హీరో అనిచెప్పుకోవడానికి ఒక్క ఫీచర్‌కూడా అతనిలో యాక్టివేట్ అయ్యి ఉండదు. కాని ఫన్ మాత్రం వైఫైలా హై స్పీడ్‌తో ఈ వింత కామెడీ పీస్ చుట్టూ ఉంటుంది. అతన్ని చూస్తేనే నవ్వు వచ్చేస్తుంటుంది. వీడెవడ్రా బాబు.. ఇలా ఉన్నాడు? అసలు ఇతను హీరో ఏంటి? ఇలాంటి సందేహాలు సంపూర్ణేష్ బాబు సినిమాలకు షరా మామూలే. అయితే ఇతను షర్ట్ విప్పితే పడి పడి నవ్వుకుంటారు.. అతని సిక్స్ ప్యాక్ చూసి కాదు కుండలా ఉంటే పొట్ట చూసి.. పంచ్‌ డైలాగులు చెబుతున్నా.. పిచ్చి డాన్సులు వేస్తున్నా.. మాస్‌ ఫైటింగులు చేస్తున్నా.. కామెడీ దానంతట అదే పుట్టుకొస్తుంది. అందుకే అతను సోషల్ మీడియాలో సంచలనం అయ్యాడు.. దటీజ్ సంపూ అనిపించాడు.

 

అతని సినిమాలు అన్ని సినిమాల మాదిరిగా ఉండవు. అతని సినిమాలను పలానా జానర్ అని కూడా కమిట్ కాలేము. కామెడీ, యాక్షన్, థ్రిల్లర్, హారర్, డ్రామా, లవ్.. ఇలా ఏ జానర్‌తో సంబంధం లేకుండా సంపూర్నేష్ బాబు సినిమాలు ఉంటాయి. అతని పెర్ఫామెన్స్ ప్రతిదీ పీక్స్‌లోనే ఉంటుంది. అందుకే అతని జానర్‌కి పీక్స్ జానర్ అంటే కరెక్టేమో. ఇక సంపూర్నేష్ బాబు సినిమాకి వచ్చే ముందు ప్రేక్షకుడు అతని గురించి తెలుసుకుని సిద్ధపడి రావాలి. ఏదో రెగ్యులర్ సినిమా చూస్తున్నట్టుగా థియేటర్స్ వచ్చి కూర్చుంటే కళ్లు బైర్లు కమ్మవచ్చు.. నెత్తి బొప్పి కట్టవచ్చు.. ఇంకేదైనా జరగవచ్చు. అతన్ని సీరియస్‌గా తీసుకున్నారా.. ఇక మీ పని అయిపోయినట్టే.

 


ఇక ఈ బర్నింగ్ స్టార్‌ని ఒక రూపంలో చూస్తేనే కామెడీ పీక్స్‌లో ఉంటుంది.. అలాంటి త్రిపాత్రాభినయం చేస్తే ఆ రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ‘కొబ్బరి మట్ట’తో చూపించేందుకు నేడు (ఆగస్టు 10) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన త్రిపాత్రాభిన‌యంలో ‘హృద‌య‌కాలేయం’ సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నంతో రూప‌క్ రొనాల్డ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’.. మంచి అంచనాలతో నేడు విడులైంది.

ఈ సినిమా ఎలా ఉందన్న విషయం చెప్పడానికి మచ్చుకి ఓ రెండు సీన్లు రివీల్ చేస్తున్నాం. పాపారాయుడు (సంపూర్ణేష్ బాబు) కత్తిపోటుకు గురై చావుబతుకుల మధ్య ఉంటాడు.పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు-పాపారాయుడు కొడుకు) తన తండ్రిని ఒడిలో పెట్టుకుని కడుపులో దిగిన కత్తిని బయటకు తీస్తాడు. వెంటనే పాపారాయుడు చాలా నొప్పిగా ఉందిరా అని అనడంతో వెంటనే అదే కత్తిని తండ్రి కడుపులో దించేస్తాడు పెదరాయుడు. ఇక పాపారాయుడు చనిపోతుంటే పక్కనే ఉన్న భార్య నేను ఉండలేనండీ అని ఏడుస్తుంది. అయితే రా.. నేను చనిపోతే నువ్ ఒంటరి దానివి అయిపోతావ్ కాదా అని తన కడుపులో ఉన్న కత్తిని భార్య కడుపులో దించేసి ఇద్దరూ కలిసి చనిపోతారు.

ఇక పాపారాయుడు చనిపోతున్న సందర్భంలో నీకు ఏ కష్టం వచ్చినా నన్ను నాన్నా అని పిలువు అని సమాధిలో నుండి అయినా వచ్చేస్తా అని చెప్పి చనిపోతాడు. సినిమా క్లైమాక్స్‌లో పాపారాయుడ్ని విలన్‌లు కొడుతుంటే.. తండ్రి పాపారాయుడు మాట గుర్తుకు వచ్చి నాన్నా అని పిలివడంతో సమాధిని చీల్చుకుంటూ వచ్చి విలన్‌లను ఉతికి ఆరేసి.. మళ్లీ సమాధిలోకి వెళిపోతాడు పాపారాయుడు. ఇలాంటి భయంకరమైన, బీభత్సమైన, సత్య దూరమైన, అరాచకమైన సన్నివేశాలు ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాయి ప్రేక్షకుల్ని నవ్విస్తాయి

 

ఇక కథ అంటూ పెద్దగా చెప్పుకోవానికి ఏం ఉండదు.. ఇదో సరదా కథ. రెండు గంటల పాటు లాజిక్, మ్యాజిక్ ఆశించకుండా ఇది సంపూర్ణేష్ బాబు సినిమా అని ప్రిపేర్ అయితే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. పాపారాయుడు (సంపూర్ణేష్ బాబు) కుటుంబం తర తరాలుగా ఊరికి పెద్దగా ఉంటుంది. ఊరి కోసం పాపారాయుడు చనిపోతూ.. తన కొడుకు పెదరాయుడ్ని కుటుంబానికి ఊరికి వారసుడ్ని చేస్తాడు. పెదరాయుడుకి ముగ్గరు తమ్మళ్లు, ముగ్గురు చెల్లెల్లు. అలాగే ముగ్గురు భార్యలు కూడా. ఈ కుటుంబాన్ని అంతా ‘కొబ్బరి మట్ట’కు ఉండే ఆకుల్లా కాపాడుకుంటూ ఉంటాడు. ఈ కథలోకి ఆండ్రాయిడ్ (సంపూర్ణేష్ బాబు) అనే కొత్త పాత్ర చేరుతాడు. ఇంతకీ ఈ ఆండ్రాయిడ్ ఎవరు? అతనికి పెదరాయుడుకి సంబంధం ఏంటి? అతను పెదరాయుడు పోలికలతో ఎందుకు పుడతాడు? అన్నదే కామెడీ కథలో కీలకం.

స్టార్ హీరోలు కాస్త అతిగా చేస్తే ట్రోల్ చేయడం ఎంత సహజమో.. సంపూర్ణేష్ బాబు సినిమాలో అతి లేకపోతే లోటుగా అనిపిస్తుంది. అందుకే అతని బర్నింగ్ స్టామినాను దృష్టిలో పెట్టుకుని అల్లిన కథే ఈ ‘కొబ్బరి మట్ట’. పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు పాత్రల్లో సంపూర్ణేష్ బాబు ఓ పెద్ద అరాచకమే చేశారు. వన్ మేన్ షోతో పొట్టచెక్కలు చేశాడు. సీన్ సీన్‌‌లో పంచ్.. ఆ పంచ్‌లో ఫన్.. ఆ ఫన్‌లో వల్గారిటీ ఉన్నా ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాడు. డాన్స్, ఫైట్లతో సహా కడుపుబ్బా నవ్వించారు.

అతనికి భార్యలుగా నటించిన ముగ్గురూ.. గాయత్రి గుప్తా, ఇషికా సింగ్, గీతాంజలి కామెడీలో భాగం అయ్యారు. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది షకీలా (పండు), కాముడు (కత్తి మహేష్) పాత్ర గురించి. ఈ ఇద్దరూ భార్య భర్తలుగా నటించి కామెడీ పీక్స్ చేరేలా చేశారు. చాలా రోజుల తరువాత షకీలాకు తెలుగులో ఓ మంచి పాత్ర పడింది. ఆండ్రాయిడ్ ఎంట్రీ తరువాత ఈ రెండు పాత్రలకు ప్రాధాన్యత పెరిగింది. కత్తి మహేష్ ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. అతని వ్యక్తిగత జీవితాన్ని కూడా కామెడీగా వాడేశాడు దర్శకుడు రొనాల్డ్ సన్.

 



ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. కథనం, మాటలు గురించి. ‘హృద‌య‌కాలేయం’ సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ ఈ చిత్రాన్ని ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని సుమారు ఐదేళ్ల పాటు ఈ సినిమాను సొంతంగా నిర్మించారు. వాస్తవానికి ఈ ఐదేళ్లలో కొబ్బరి మట్ట షూటింగ్ జరిగింది 39 రోజులే. అంటే 39 రోజుల్లోనే కొబ్బరి మట్ట చిత్రాన్ని కంప్లీట్ చేశారు. చిన్న సినిమా కథలు రాసేటప్పుడు పాత్రలు ఎంపిక పెద్ద ఛాలెంజ్ లాంటిది. ఎన్ని ఎక్కువ పాత్రలు ఉంటే.. అంత బడ్జెట్ భారం. పైగా షూటింగ్‌కి కూడా కష్టం. అయితే చిత్ర కథకుడు స్టీవెన్ సన్.. ఈ చిన్న చిత్రం ద్వారా పెద్ద ప్రయోగమే చేశారు. సంపూ త్రిపాత్రాభినయం, అతనికి ముగ్గురు భార్యలు, ముగ్గురు తమ్ములు, ఓ పెద్ద ఊరి, ఆ ఊరి జనం, షకీలా, కత్తి మహేష్ అతని కథలో మొత్తం పెద్ద ఊరే కనిపిస్తుంది.

వీటన్నింటికీ బ్యాలెన్స్ చేస్తూ కథ రాయడం.. అందులో కామెడీ జోడించడం.. పరిమిత బడ్జెట్‌లో సినిమాను తీయడం అంటే చిన్న విషయం కాదు. అయితే వీటన్నింటిని అతిగమించి ‘కొబ్బరి మట్ట’ యూనిట్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. రచయిత కామెడీ సెన్స్‌తో పాటు ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవడంలో తన పెన్ పవర్ వాడారు. ఈ సినిమాలో మాటలు.. హీరో చేష్టలు అతిగా ఉన్నా.. కామెడీ బ్రహ్మాండంగా పండింది. ఇక ఆండ్రాయుడు చెప్పే 3.27 నిమిషాల భారీ డైలాగ్‌కి థియేటర్స్‌లో చప్పట్ల మోత మోగింది.

సంపూర్నేష్ బాబుకి సినిమాకి ప్రిపేర్డ్‌గా రాని వాళ్లు ఇదేం సినిమారా బాబు అనుకోవడం ఎంత సహజమో. పైగా ఈ కామెడీ పీస్‌ను రెండు గంటల పాటు స్క్రీన్‌పై చూడటమూ భారమే. అయితే ఈ పిచ్చ కామెడీని బోర్ ఫీల్ అయ్యేవాళ్ల ఎంతమంది ఉంటారో.. జై సంపూర్ణేష్ బాబు అని జై కొట్టేవాళ్లు అంతేమంది ఉంటారు. సో.. బీ ప్రిపేర్డ్ ‘కొబ్బరి మట్ట’.

 



అయితే ఈ సినిమా నిర్మాణంలో బడ్జెట్ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ సంపూర్ణేష్ బాబు గత చిత్రాలకంటే రిచ్‌గానే ఉంటుంది. అయితే త్రిపాత్రాభినయం చేయించడంలో టెక్నాలజీ జోలికి పోకుండా డూప్స్‌తో చేయించాడు దర్శకుడు. చాలా చోట్ల సంపూర్ణేష్ బాబు ప్లేస్‌లో డూప్ కనిపిస్తుంటాడు. ముజీర్ మాలిక్ కెమెరా పనితనం బాగుంది. కోనసీమ అందాలు దర్శనం ఇస్తాయి. రియలిస్టిక్ లొకేషన్స్‌లో సీన్స్ నేచురల్‌గా అనిపిస్తాయి. సయ్యద్ కమ్రాన్ సాంగ్స్ సందర్భాను సారంగా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వలేదు. ఎడిటింగ్ వర్క్ బాగుంది.

ఓవరాల్‌గా.. ప్రతి సీన్ అతిగానే ఉంటుంది. ఆ అతినే ప్రధానాంశంగా తీసుకుని ‘కొబ్బరి మట్ట’ను రూపొందించారు కాబట్టి హిట్.. యావరేజ్.. ఫ్లాఫ్ అనే కేటగిరిలో చేరని ఓ ప్రత్యేకమైన చిత్రం ఈ ‘కొబ్బరిమట్ట’.

రేటింగ్: 3/5

Posted

A director gadi 10gudiki greatandhra vadu review kuda rayaledu...eenadu vadi jabardasth better annattu rasadu..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...