Jump to content

Amazon to open its world's largest campus building in Hyderabad next week


Recommended Posts

Posted

chalo lay offs gone start in Amazon soon

most positions will be out sourced too India office

Posted
హైదరాబాద్‌లో అతి భారీ అమెజాన్‌ క్యాంపస్‌
18-08-2019 03:13:57
 
 
637016948367128401.jpg
 
 
  • 21న ప్రారంభం.. ముఖ్య అతిథిగా కేసీఆర్‌!
  • 15 అంతస్తులు.. 9 వేల మంది ఉద్యోగులు
  • కంపెనీ క్యాంపస్‌లలో ప్రపంచంలోనే ఇది పెద్దది 
 
హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): అమెరికా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్‌ భవనాన్ని త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభించనుంది. నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో 10 ఎకరాల స్థలంలో అత్యాధునిక మౌలికవసతులతో దీనిని నిర్మించారు. 15 అంతస్తుల భవనంలో 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో పార్కింగ్‌ ప్రదేశం, మరో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేసే కార్యాలయ ప్రాంగణాన్ని నిర్మించారు. దీన్ని బుధవారం (21న) లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అమెజాన్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కంట్రీ మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌, అమెజాన్‌ గ్లోబల్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఫెసిలిటీస్‌ డైరెక్టర్‌ జాన్‌ స్కోటీర్‌, కంపెనీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇటీవలే భవనం నిర్మాణం పూర్తయింది. దాదాపు ఏడువేల మంది ఉద్యోగులు అందులోంచే విధులు నిర్వహిస్తున్నా, అధికారికంగా దాన్ని ప్రారంభించలేదు. ఈ నెల 21న భవన ప్రారంభోత్సవాన్ని ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేతుల మీదుగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబరు చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 9000కు పెరుగుతుందనీ, భవిష్యత్తులో మరింత పెరగొచ్చనీ అంటున్నారు. అమెజాన్‌ ప్రతినిధులు ప్రభుత్వానికి తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగా నిర్మించిన భవనంలో ఒకేసారి 26000 నుంచి 30000 మంది పనిచేసేలా మౌలిక వసతులను కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. అమెజాన్‌కు చెందిన వివిధ గ్లోబల్‌ బిజినెస్‌, టెక్నాలజీ టీమ్స్‌ బ్యాకెండ్‌ కార్యకలాపాలను ఇక్కడ నుంచే ఉద్యోగులు నిర్వహించనున్నట్టు గతంలో కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌కు అమెజాన్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ (గోదాము)ను రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఇది నాలుగు లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఉంది. 2020 మధ్యకాలం నాటికి దీన్ని 5.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంకు పెంచుకోవాలన్న యోచనలో ఉంది.
 
 
అమెరికా కంపెనీలకు కేరాఫ్‌ అడ్రస్‌ హైదరాబాద్‌
అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్ర్‌సగా మారుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో యూఎ్‌సకు చెందిన మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, యాపిల్‌, క్వాల్‌కామ్‌లు తమ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవలే అమెరికన్‌ డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేపాల్‌ హైదరాబాద్‌లో తన మూడో గ్లోబల్‌ టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించింది. ఇందులో వంద మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అమెరికాకు చెందిన మరో కంపెనీ సర్వీ్‌సనౌ కూడా ఈ మధ్యనే కొత్త డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఇది కంపెనీకి ఆసియాలోనే అతిపెద్ద సెంటర్‌. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కంపెనీకి రెండో అతిపెద్ద కేంద్రం. ఇందులో రెండు వేల మంది పని చేస్తున్నారు. వచ్చే ఏడాది కాలంలో మరో 1200 మందిని కంపెనీ నియమించుకోనుంది.
Posted
3 hours ago, chittimallu_14 said:

God no... inkoka peddha company... more people, more traffic, it gets even worse. Spread them out FFS

LOL true 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...