tamu Posted August 19, 2019 Report Posted August 19, 2019 సమంతకు టాలీవుడ్లో ఎప్పుడూ మంచి పేరే ఉంది. సౌత్ ఇండియాలో మోస్ట్ లవ్డ్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కేవలం నటనతోనే కాదు.. తన వ్యక్తిత్వంతోనూ భారీగా అభిమానగణాన్ని సంపాదించుకుందామె. హిపోక్రసీకి దూరంగా.. చాలా క్యాజువల్‌గా ఉంటుందని.. అస్సలు ఇగో ఉండదని ఆమె గురించి పొగుడుతుంటారంతా. ఐతే ఇలాంటి ఇమేజ్ ఉన్న సమంత.. కొన్ని రోజులుగా కొంత అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకుముందు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా ఆమె స్పందించేది. దాన్ని ప్రమోట్ చేసేది. కానీ తన మామ కొత్త సినిమా మన్మథుడు-2 విషయంలో మాత్రం మౌనం పాటించింది. ఆ సినిమాలో చిన్న పాత్ర కూడా చేసిన సామ్.. దీని గురించి గత రెండు మూడు వారాల్లో ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. సినిమాకు ప్రమోషన్ చాలా అవసరమైన సమయంలో సమంత మన్మథుడు-2 గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. ఎందుకీ వ్యూహాత్మక మౌనం అన్నది అర్థం కాలేదు. మరోవైపు తాను నటించిన మహానటి సినిమాకు గాను కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైతే అభినందిస్తూ ఒక ట్వీట్ చేయలేదు. బైట్ ఇవ్వలేదు. మూడు అవార్డులు అందుకున్న మహానటి టీంకు కూడా విషెస్ చెప్పలేదు. అలాగని సమంత ట్విట్టర్లో యాక్టివ్‌గా లేదేమో.. ఏదైనా టూర్లో ఉందేమో అంటే అదేమీ లేదు. హైదరాబాద్‌లోనే ఉంది. తన సినిమా ఓ బేబీ గురించి ట్వీట్లు వేస్తూనే ఉంది. మరి తన సినిమా విషయంలో స్వార్థం చూపిస్తూ తాను స్పందించాల్సి ఉన్న వేరే సినిమాల గురించి సామ్ ఎందుకు స్పందించకుండా ఉందన్నది జనాలకు అర్థం కావడం లేదు Quote
jefferson1 Posted August 19, 2019 Report Posted August 19, 2019 Samantha ni edo chesi unatadu...naughty fellow Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.