Jump to content

Estart Music - current AP News


Recommended Posts

Posted
పోలవరంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు..!

నవయుగకే పనులు?

polavaramhigh1a.jpg

అమరావతి: పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది. నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. టెండర్‌ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. దీంతో పోలవరం పనులు నవయుగ సంస్థే కొనసాగించే అవకాశముంది.

 

 

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    17

  • mettastar

    4

  • TensionNahiLeneka

    3

  • Hydrockers

    2

Popular Days

Top Posters In This Topic

Posted

అమరావతి: కృష్ణానది వరదపై ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదని ఫలితంగా వరద ఉద్ధృతికి 6 వేల ఎకరాలు నీట మునిగాయని తెదేపా ఎంపీ గల్లాజయదేవ్‌ అన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్‌ నేతలు కేశినేని నాని, దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. పంటనష్టపోయి 10 వేల మంది కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని అన్నారు. అమరావతి రాజధానిపై మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి  వ్యాఖ్యలను భాజపా నేతలు తప్పుపట్టారని గుర్తు చేశారు.

తాజా తీర్పు జగన్‌కు చెంపపెట్టు
పోలవరం విషయంలో హైకోర్టు తాజా తీర్పు ముఖ్యమంత్రి జగన్‌ తొందరపాటు నిర్ణయానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే పోలవరం పవర్‌ ప్రాజెక్టును కొట్టేయాలని చూశారని, అందుకే వై.ఎస్‌ బంధువుతో పీటర్‌ కమిటీ ఏర్పాటు చేశారని ఆరోపించారు. పోలవరం పరిధిలోని 7 ముంపు మండలాలను మన భూభాగంలో కలిపేందుకు చంద్రబాబు కృషి చేశారన్నారు. ముంపు మండలాలను కలపడం వల్లే ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయ తెలిపారు. డ్యామ్‌ సైట్‌ వద్ద ప్రజలను ఖాళీ చేయించేందుకు గతంలో రూ.115 కోట్లు పరిహారం ఇచ్చామన్నారు.2015లోనే డ్యామ్‌ సైట్‌ ఖాళీ అయిపోయిందని గుర్తు చేశారు.

Posted

Will this not create conflict of interest between government and contracting company ?

Posted

విజయవాడ: రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై విదేశీ పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ ట్విటర్‌ ద్వారా అయినా స్పందించాలని కోరారు. విజయవాడలోని తెదేపా కార్యాలయంలో ఉమా మీడియాతో మాట్లాడారు. రాజధాని రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారం కాదని చెప్పారు. ఇప్పటికే నాలుగు జిల్లాల నుంచి తమ ప్రాంతానికి రాజధాని తరలి రాబోతోందనే ప్రకటనలు వస్తున్నాయన్నారు. 33వేల మంది రైతుల త్యాగాన్ని.. రాజధాని శంకుస్థాపన ఎవరి చేతుల మీదుగా జరిగిందనే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. 

రాజధాని మార్పు అంశంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్న తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి మాటలకు విలువ ఎక్కడిదని ఉమా ప్రశ్నించారు.  ప్రధానికి రాజధాని విషయంలో రాసిన లేఖను బయటపెట్టి పారదర్శక పాలన గురించి మాట్లాడాలని ఉమా డిమాండ్‌ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులను ఆ తర్వాతి ప్రభుత్వాలు కొనసాగించాయని.. దాని వల్లే హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలిచిందన్నారు. జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ నిలిపి వేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు.

Posted

మరోవైపు తాము ఏంచేసినా.. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే చేస్తున్నామన్న వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఎన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారంటూ ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.స్వార్థ ప్రయోజనాల కోసం ప్రధానిని అడ్డు పెట్టుకోవడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు.

Posted
2 minutes ago, Spartan said:

who owns Navayuga...

Some krishna reddy

Posted
2 minutes ago, Spartan said:

who owns Navayuga...

I think they funded tdp in 2014

Posted
Just now, mettastar said:

Some krishna reddy

 

Just now, mettastar said:

I think they funded tdp in 2014

ok.

Posted
1 minute ago, mettastar said:

Some krishna reddy

adi megha engineering which is doing kaaleshwaram

navayuga dramoji thatha viyyankudu di 

Posted

Flood management failure - YCP %$#$

కృష్ణానదికి వరదలు వస్తే విజయవాడలోని కృష్ణలంక, రామలింగేశ్వర్‌నగర్‌, యనమలకుదురు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఇందుకోసం తమ ఇళ్ళకు కృష్ణానది నుంచి రక్షణ కావాలని 2009 నుంచి 2014 మధ్య కాలంలో స్థానికులు ఆందోళన చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం మొదటి దశలో యనమలకుదురు నుంచి భూపేష్‌నగర్‌ వరకు 2.1 కిలోమీటర్ల నిర్మాణం పూర్తిచేసింది. ఈలోగా ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం రక్షణ గోడను పట్టించుకోలేదు. పైగా ఈ నిర్మాణం పై కూడా ప్రభుత్వం సమీక్ష జరుపుతోంది. 
ఈ లోపు వరదలు వచ్చాయి. రామలింగేశ్వర్‌ రక్షణగోడకు సంబంధించి వరద నీరు కృష్ణా నదిలోకి వెళ్లేందుకు వీలుగా రక్షణ గోడలకు రంధ్రాలు ఏర్పాటు చేశారు. వీటికి ఒకవైపు మూసుకొనే వాల్వులు ఉంటాయి. పైపులు ఏర్పాటు చేసిన అధికారులు వాల్వులు బిగించలేదు. ఈ విషయమై మాజీ కార్పొరేటర్ పది రోజుల కిందటే నగరపాలక సంస్థ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, జలవనరుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాట్సప్‌ ద్వారా సందేశాలు పంపారు. కానీ వారు ఏమాత్రం స్పందించలేదు. అధికారులు స్పందిస్తే వరద ముంపు తప్పేది. ఈ వరదలు కేవలం ప్రభుత్వ వైఫల్యమే అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి.

Image may contain: 1 person, outdoor
Posted

చంద్రబాబుగారి ఇంటిని ముంచేయడానికి వైసీపీ చేసిన మరో కుట్ర చూడండి. నాగార్జున సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 590 అడుగులు. ఇప్పుడు జలాశయ నీటిమట్టం 586 అడుగులే ఉంది. అయినా ప్రకాశం బ్యారేజీ దగ్గర అంత వరద ఎందుకు అంటే సాగర్ లోకి వస్తున్న వరద కంటే ఎక్కువ నీటిని విడుదల చేసారు.

కృష్ణానదికి 2009లో ఇంతకు మించిన వరద వచ్చింది. అయినా ప్రకాశం బ్యారేజి దగ్గర వరద 11 లక్షల క్యూసెక్స్ దాటనివ్వలేదు. మరిప్పుడు ఎందుకు ఇలా? ఫ్లడ్ మేనేజిమెంట్ తెలియకా? లేక చంద్రబాబుగారి ఇంటిని ముంచే కుట్రా? ఈ పగ సాధింపులో ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?

No photo description available.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...