AndhraneedSCS Posted August 23, 2019 Report Posted August 23, 2019 ‘సూపర్ రిచ్’ నుంచి ఎఫ్‌పీఐలకు మినహాయింపు! ముంబయి: ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. విదేశీ ఫోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులను సంతృప్తి పరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యంత ధనవంతులపై విధించే సర్‌ఛార్జి నుంచి వారికి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు ఆర్థిక మందగమనం నేపథ్యంలో మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యంగా ఎఫ్‌పీఐ విషయంలో తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవలి బడ్జెట్ ప్రసంగంలో రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారికి వర్తించే సర్ఛార్జిని 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్ల పైన పన్ను ఆదాయం ఉన్న వారికి సర్ఛార్జిని 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి సీతారామన్ ప్రకటించారు. ఈ పరిధిలోకి ఎఫ్‌పీఐలు కూడా రావడంతో.. బడ్జెట్ అనంతరం విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఫలితంగా జూన్ నుంచి ఇప్పటి వరకు 10 శాతం అంటే సుమారు 3 బిలియన్ డాలర్ల మేర షేర్లను అమ్ముకున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లకు ఊరట కల్పించేందుకు గత కొన్ని రోజులుగా దీనిపై పలు దఫాలుగా సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది Quote
AndhraneedSCS Posted August 23, 2019 Author Report Posted August 23, 2019 1 hour ago, Hydrockers said: So one country different rules Eppudaina anthega .. different rules lekapothe treasury ki dabbu ela vastadi? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.