Jump to content

jagame maaya.............


Recommended Posts

Posted

తన తనననతన తననన
తననననన తాన తన్న తననా
'ఒహో కన్నే పిల్లవని కన్నులున్నవని
యేన్నేన్ని వగలు పోతున్నవే చినారి
లల లల లల లలలలల
లలలల లలలల లాలల
చిన్న నవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి
యేన్నేన్ని కలలు రపించావే పొన్నారీ

!! కన్నె పిల్లవని కన్నులున్నవని !!

యేవంటౌ..మ్మ్
సంగీతం
న న నా'మ్మ్' నువ్వైతే
రి స రి సాహిత్యం
మ్మ్ హ్మ్ హ్మ్మ్ నేనౌతా
సంగీతం నువ్వైతే
సాహిత్యం నేనౌతా

!!కన్నె పిల్లవని కన్నులున్నవని !!

న న న న న
say it once again
న న న న న
'మ్మ్మ్' స్వరము నీవై
తరనన తరరనన
స్వరమున పదము నేనై 'ఒకే'
తానే తానే తాన
'ఒహొ అలగా గానం గీతం కాగ
తరన తాన
కవిని నేనై
తాన ననన తాన
నాలో కవిత నీవై
నాననాననా లలలా నననా తరనా
'beautiful' కవ్య మైనదీ
తలపు పలుకు మనసు...

!!కన్నె పిల్లవని కన్నులున్నవని
యేన్నేన్ని వగలు పోతున్నవే చినారి
చిన్న నవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి
యేన్నేన్ని కలలు రపించావే పొన్నారీ
సంగీతం...." ఆ..హా..హా..
నువ్వైతే...ఆ..హా..హా..
సాహిత్యం...ఆ..హా..హా...
నేనౌతా..ఆహహా....!!

ఇప్పుడు చూద్దం
తనన తనన తన్నా
'మ్మ్హ్మ్' తనన తనన అన్న
తాన తన్న తానం తరనాతన్నా
తాన అన్న తాళం ఓకటే కాదా
తననతాన తాననన తాన
'అహ అయ్యబాబోయ్'తననతాన తాననన తాన
'మ్మ్' పదము చేర్చి పాట కూర్చ లేదా
షభాష్!
దనిని దసస అన్నా
నీద అన్న స్వరమే రాగం కాదా
నీవు నేనన్నీ అన్నా మనమే కాదా
నీవు నేనన్నీ అన్నా మనమే కాదా

కన్నే పిల్లవని కన్నులున్నవని
కవిత చేప్పి మెపించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెపించేది యెప్పుడనీ
కన్నే పిల్లవని కన్నులున్నవని
కవిత చేప్పి మెపించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెపించేది యెప్పుడనీ
మ్మ్ అహ హా ల ల లా మ్మ్హ్మ్మ్మ్ అహహా
ల ల లా ల ల లా ల ల లా ల ల లా

Posted

సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్
సాపాటు||

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా ||మన||
డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని ఢిల్లికి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే బావి పౌరులం బ్రదర్
సాపాటు||

బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషయం కట్టెయ్ బ్రదర్
సాపాటు||

సంతాన మూలికలం సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా
చదవెయ్య సీటులేదు చదివొస్తే పనీలేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టేదిక్కేలేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్
సాపాటు||

Posted

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే
అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
మల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానా
వేచే ఎదలో వెలుగై రానా
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
అల్లిబిల్లి కలలా

చరణం1:
సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
ఏలబిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా

అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా

చరణం2:
జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై
గుండె నిండిపోయే చానా వెండిమబ్బు తానై
సంగతేదో తెలిపే పలపే సంగతేదో పలికే
దూరమింక చెరిపే వలపే దోరనవ్వు చిలికే
మేనికుళుకే తేనెచినుకై పూలజల్లు కురిసే

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రానా
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా

Posted

సన్నజాజి పాడక...
మంచ కాడ పాడక..

సన్నజాజి పాడక మంచ కాడ పడకా చల్ల గాలి పాడక
మాట వినకుంది ఎందుకే
సన్నజాజి పాడక మంచ కాడ పడకా చల్ల గాలి పాడక
మాట వినకుంది ఎందుకే
అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయేనే

సన్నజాజి పాడక మంచె కాడ పాడక చల్ల గాలి పాడక
మాట వినకుంది ఎందుకే
మనసులో ప్రేమే ఉంది మరువని మాటే ఉంది
మాయనీ ఊసే పొంగి పాటై రావే

సన్నజాజి పాడక మంచ కాడ పాడక చల్ల గాలి పాడక
మాట వినకుంది ఎందుకే

కొండమల్లి పూవులన్నీ గుండెల్లో నీ నవ్వులన్నీ
దండే కట్టి దాచుకున్న నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు యెండల్లొన చిన్నబోతే
పండించగ చెరుకున్న నీ దరికి
అండ దండ నీవేనని పండగంత నాదేనని
ఉండి ఉండి ఊగింది నా మనసే
కొండపల్లి బోమ్మా ఇక పండు చెండు దోచెయ్యనా
గుండే పంచే వెళయినది రావే
దిండే పంచే వెళయినది రావే

సన్నజాజి పాడక మంచ కాడ పాడక చల్ల గాలి పాడక
మాట వినకుంది ఎందుకే

Posted

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో

మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది

భాష లేనిది బంధమున్నది
భాష లేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినదీ
మన ఇద్దరినీ జత కూర్చినదీ

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో

వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది

చేసిన బాస శిలవలె నిలిచి
చేసిన బాస శిలవలె నిలిచి
చివరికి మంచై కరుగుతున్నది
చివరికి మంచై కరుగుతున్నది

ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో

Posted

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐనా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికి పాడెకట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

ఇంటద్దె కట్టావ నా తండ్రి నో ఎంట్రీ విధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెట్లీ నీ ఇంట్లో చిమ్మచీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకీ
రోటీ కప్డా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకొవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమస్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది
బ్లాకులో కొనే వెలే సినీప్రేమది
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతినిమిషము సొమ్మిచ్చిపుచ్చుకొరా

డబ్బురా డబ్బుడబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా

Posted
Just now, Charger said:

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐనా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికి పాడెకట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

ఇంటద్దె కట్టావ నా తండ్రి నో ఎంట్రీ విధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెట్లీ నీ ఇంట్లో చిమ్మచీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకీ
రోటీ కప్డా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా


ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకొవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమస్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది
బ్లాకులో కొనే వెలే సినీప్రేమది
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతినిమిషము సొమ్మిచ్చిపుచ్చుకొరా

డబ్బురా డబ్బుడబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా

wahh, emanna lyrics aa 

Posted

హే.. ముత్యవల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
అరె ముట్టుకుంటే ముడుసుకుంటావ్ ఇంత సిగ్గా

మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
ఊరూ నిదరోయిందిలే .. మంచి సోటే మనకు కుదిరిందిలే

మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే

కురిసే సన్నని వానా .. సలి సలిగా ఉన్నది లోనా
కురిసే సన్నని వానా .. సలి సలిగా ఉన్నది లోనా
గుబులౌతుందే గుండెల్లోనా

జరగనా కొంచెం .. నేనడగానా లంచం
చలికి తలలు వంచం .. నీ వళ్ళే పూలమంచం
వెచ్చగ ఉందామూ మనమూ

హే .. పైటలాగా నన్ను నువ్వూ కప్పుకోవే
గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే

మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే

పండే పచ్చని నేలా .. అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేలా .. అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే

పులకరించు నేలా .. అది తొలకరించు వేళా
తెలుసుకో పిల్లా .. ఈ బిడియమేల మళ్ళా
ఉరికే పరువమిదీ .. మనదీ

హే .. కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా
దాపుకొస్తే కొర్కెలన్నీ తీరిపోవా

మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే

నవ్వని పువ్వే నువ్వూ .. నునువెచ్చని తేనెలు ఇవ్వూ
దాగదు మనసే .. ఆగదు వయసే

ఎరగదే పొద్దూ .. అది దాటుతుంది హద్దు
ఈయవా ముద్దూ .. ఇక ఆగనే వద్దు
ఇద్దరమొకటవనీ .. కానీ

హే .. బుగ్గ మీదా మొగ్గలన్నీ దూసుకోనీ
రాతిరంతా జాగారమే చేసుకోనీ

మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
ఊరూ నిదరోయిందిలే .. మంచి సోటే మనకు కుదిరిందిలే
మంచి సోటే మనకు కుదిరిందిలే

Posted

వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళలొ కన్నీరొకటె మిగిలిందంటా యేనాడు రానంటా నీ వెంట
నా గతమంతా నె మరిచానే నె మరిచానే
నన్నింకా ఇంకా బాధించైకె 
భామా భామా ప్రేమా గీమా వలదే 

చరణం 1 
నాటి వెన్నెల మళ్ళి రానేరాదు
మనసులో వ్యధ ఇంక అణగదు
వలపు దేవిని మరువగ తరమా
హ ఆఅ......
ఆమని యెరుగని శూన్యవనమిది 
నీవే నేనని నువ్వు పలుకుగ
కోటి పువ్వులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే
వర్ణించమంటే భాషే లేదే 
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే 
మరిచిపోవే మనసా ఆ........ ఆ.. 

చరణం 2 
చేరుకోమని చెలి పిలువగ
ఆశతో మది ఒక కలగని
నూరు జన్మల వరమై నిలిచే
ఓ చెలీ ............. 
ఒంటరి భ్రమ కల చెదిరిన
ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వ నాడులు కృంగవ చెలియా 
ఒక నిముషమైన నిను తలువకనే
బ్రతికేది లేదు అని తెలుపుటెలా
మది మరిచిపోని మధురూహలనే
మరిచిపోవె మనసా;

Posted

ఎంత వరకు? ఎందు కొరకు? ఇంత పరుగు? అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాక ఆ నిజం తెలుసుకోవా?
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా?

చరణం1:

కనపడేవెన్నెన్ని కెరటాలు?
కలగలిపి సముద్రమంటారు
అడగరేం ఒక్కొక్క అల పేరు?
మనకిలా ఎదురైన ప్రతి వారు
మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరు?
సరిగా చూస్తున్నదా? నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి? వెలుతురు నీ చూపుల్లో లేదా?
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా? కాదా?

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పే దాక ఆ నిజం తెలుసుకోవా?
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా?

చరణం2:

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మతిలి మదికి భాష్యం
పుటకా చావు రెండే రెండూ నీకవి సొంతం కావు, పోనీ
జీవిత కాలం నీదే నేస్తం, రంగులు ఏం వేస్తావో కానియ్యి

Posted

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా (2)

నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా

షోలే ఉందా ?
ఇదిగో ఇందా ..
చాల్లే ఇది జ్వాల కాదా..
తెలుగులో తీశారే బాలా !

ఖైదీ ఉందా?
ఇదిగో ఇందా..
ఖైదీ కన్నయ్య కాదే ..
వీడికి అన్నయ్య వాడే !

జగదేకవీరుడి కధా..ఇది పాత పిక్చర్ కదా
అతిలోక సుందరి తల .. అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

ఒకటా రెండా .. పదులా వందా
బాకీ ఎగవేయకుండా .. బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా .. మతి పోయిందా
చాలే నీ కాకి గోలా .. వేళా పాళంటూ లేదా

ఏవైంది భాగ్యం కధా? కదిలిందా లేదా కధా?
వ్రతమేదో చేస్తుందంటా .. అందాక ఆగాలటా
సౌఖ్యంగా బ్రతకాలీ .. సౌఖ్యాలే పొందాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

Posted

పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు కానట్టే
ఇక్కడనే వుంటే ఉన్నా లేనట్టే
now or never! now or never! Now or Never!
||పద పద||
.
||చ||
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేదీ చోటు ||2||
ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ
ఎదటలేని మరునాటిని నేడే కలలపంట చూస్తూ
||పద పద||
.
||చ||
నీతో నువు కలహిస్తూ నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు ||2||
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీకధ కక్కడ శ్రీకారం చుట్టు
||పద పద||

 

 from vedham

Posted

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక
||ప|| |అతడు|
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక 
|| చిలకా ఏ తోడు ||
.
|ఖొరస్| గోరింకా యేదే చిలకా లేదింకా || 2 ||
||చ|| |అతడు|
బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే || బతుకంతా బలి చేసే ||
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
|| చిలకా ఏ తోడు ||
.
|ఖొరస్| కొండంతా అండే నీకు లేదింకా || 2 ||
||చ|| |అతడు|
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో||అనురాగం కొనగలిగే||
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమవాసలో
తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంకా 
|| చిలకా ఏ తోడు ||

 

from shubalagnam

Posted

సీకటమ్మ సీకటి ముంచటైన సీకటి 
వెచ్చనైన ఊసులన్ని రెచ్చ గొట్టు చీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి 
ముద్దుగా ఇద్దరికే వొద్దికైన చీకటి
పొద్దు పొడుపేలేని సీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిదరోనీ
రాయే రాయే రామ సిలక సద్దుకుపోయే సీకటెనక..ఆ 

నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసి
కన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసి
కలలే వలగా విసిరే చీకట్లలో

నమ్మకు||

వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్ని

నమ్మకు||

ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారికి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
పక్కవారికి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
లేహాయి నాదోయి నీవైపు నడువకు

నమ్మకు||

సీతకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏ కాకిలా
సీతకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏ కాకిలా
మురిసే పువులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌభ్యం పండే దినమే పండుగకాదా
పదుగురి సౌభ్యం పండే దినమే పండుగకాదా
ఆ నాడు ఆకంత గీతాలు పలుకును కాదా
గసమ గసమ దమద నిదని
మమమ మగస మమమమదమ దదదనిదద నినినిని
సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ

నమ్మకు||

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...