Jump to content

Recommended Posts

Posted
ఆర్థిక పరిస్థితులు చూసి ముందుకెళతాం: బొత్స

సీఆర్‌డీఏపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి

29brk-botsa1a.jpg

అమరావతి: రాజధాని పరిధిలో రూ.35వేల కోట్లతో చేస్తున్న పనులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఎలాంటి ఒప్పందాలూ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితుల ఆధారంగా నిర్మాణాలపై ముందుకెళతామని ఆయన అన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు సీఆర్‌డీఏపై సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో మంత్రి బొత్స, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. భూసమీకరణకు సంబంధించి మొత్తం 64 వేల మంది రైతులు భూములు ఇచ్చారన్నారు. 43 వేల మంది రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరిగిందని, మిగతా స్థలాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉందని తెలిపారు. రైతులకు కౌలు బకాయిలు ఇస్తున్నామన్నారు. శుక్రవారం నుంచి కౌలు చెల్లింపులు జరపనున్నామని వివరించారు. 

రాజధాని 5 కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదని మరోసారి వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇంకా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని బొత్స అన్నారు. సమీక్షలో రాజధాని అంశంపై వాస్తవాలు పరిశీలించామని తెలిపారు. ముంపు సమస్య చర్చకు రాలేదన్నారు. రాజధాని విషయంలో ఎవరికీ అనుమానల్లేవని పేర్కొన్నారు. రాజధాని గురించి ఎవరో ఏదో చెబితే తనకేంటి సంబంధం అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితులు చూసి ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని బొత్స వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదన్నారు. సుజనాచౌదరి సహా, చంద్రబాబు వియ్యంకుడికి భూములున్నాయన్న తన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని మంత్రి బొత్స అన్నారు. దీనికి సంబంధించిన జీవోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.

Posted
Just now, snoww said:

indirectly saying , the issue wont be resolved any time soon 

4 capitals confirmed aa aythe

Posted
Just now, boeing747 said:

4 capitals confirmed aa aythe

5 years back babori sesina scenes repeat. 

new leak about capital at new place every day 

Posted

Vijay Shankar gadini retired hurt chesi.. Kedar jadav gadini batting ki pampinatu undhi paristhithi AP dhi.. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...