pittagoda Posted August 30, 2019 Report Posted August 30, 2019 2 minutes ago, GullyBoy said: https://youtu.be/Bea-02KCEM0 Pretty good review man. Lol. Quote
shamsher_007 Posted August 30, 2019 Report Posted August 30, 2019 వాజీ అనే నగరం నుంచి మాఫియా సామ్రాజ్యాన్ని నడిపే రాయ్ (జాకీష్రాఫ్)ను అతడి ప్రత్యర్థి అయిన దేవరాజ్ (చుంకీ పాండే) చంపేస్తాడు. రాయ్ స్థానంలో కూర్చోవాలని చూస్తున్న అతడికి రాయ్ కొడుకు (అరుణ్ విజయ్) అడ్డు పడతాడు. ఐతే తండ్రి కుర్చీ ఎక్కడానికి రాయ్ కొడుక్కి కూడా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అతను నిజంగా రాయ్ కొడుకేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది. మరోవైపు మాఫియా సిండికేట్ కు చెందిన లక్షల కోట్ల రూపాయల డబ్బులున్న ఓ స్థావరానికి సంబంధించి తాళం ఉన్న బ్లాక్ బాక్స్ మిస్సవుతుంది. దాన్ని తెచ్చి అందరికీ సెటిల్ చేస్తేనే రాయ్ కుర్చీని అందుకోవడం సాధ్య పడే పరిస్థితుల్లో ఆ బ్లాక్ బాక్స్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు మొదలుపెడతారు. ఓ బ్యాంకు దొంగతనం కేసును ఛేదించడం కోసం నియమితుడైన అండర్ కవర్ కాప్ అశోక్ చక్రవర్తి (ప్రభాస్) దృష్టి కూడా.. ఈ కేసు విచారణలో భాగంగా బ్లాక్ బాక్స్ మీదికి మళ్లుతుంది. ఇంతకీ అశోక్ నేపథ్యమేంటి.. అతను బ్లాక్ బాక్స్ ను కనుక్కున్నాడా.. రాయ్ కుర్చీని అతడి కొడుకు అందుకున్నాడా.. ఇంతకీ అతను రాయ్ అసలైన కొడుకేనా.. అతను కాకుంటే రాయ్ కొడుకు ఎవరు.. అన్న ప్రశ్నలకు తెరమీదే సమాధానం తెలుసుకోవాలి. కథనం - విశ్లేషణ: ‘సాహో’ మొదట్లో రూ.50 కోట్లతో తీయాలనుకున్న సినిమా అట. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి ముందే ‘బాహుబలి’ రెండు భాగాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదల కావడం.. ప్రభాస్ రేంజ్ పెరిగిపోవడం.. దీంతో ‘సాహో’ స్కేల్ పెంచుకునే అవకాశం వచ్చి బడ్జెట్ పెంచుకుంటూ పోవడం.. చివరికది రూ.350 కోట్ల చేరడం.. అలా అలా జరిగిపోయాయి. కానీ బడ్జెట్ పెరగడం వల్ల ఏం ఒరిగింది? ఆ ఖర్చు సినిమాకు ఏమేరకు ఉపయోగపడింది? రామోజీ ఫిలిం సిటీలో తీయాల్సిన యాక్షన్ సన్నివేశం కోసం అబుదాబి వరకు వెళ్లినట్లున్నారు. ఒక సిటీని చూపించాల్సి వచ్చినపుడు రియల్ లొకేషన్లలో షూట్ చేయాల్సిన కర్మ మనకేంటి అని.. ఒక నగరాన్నే సెట్ రూపంలో తీర్చి దిద్దుకున్నట్లున్నారు. ఒక సంగీత దర్శకుడికి కోటో రెండు కోట్లో ఇచ్చి పాటలు నేపథ్య సంగీతం చేయించుకోవడానికి బదులు ఒకరితో బ్యాగ్రౌండ్ స్కోర్.. ఐదారుగురితో పాటలు చేయించుకుని పది కోట్ల దాకా వదిలించుకున్నట్లున్నారు. రెండు మూడు సీన్లకు పరిమితం అయ్యే ఒక జూనియర్ ఆర్టిస్టు చేయాల్సిన పాత్ర కోసం ఎవ్లీన్ శర్మను తీసుకున్నట్లున్నారు. ఇలా అదనపు హంగుల కోసం పదులు.. వందల కోట్లు ఖర్చు పెట్టుకుని ఉండొచ్చు. కానీ విజువల్ మాయాజాలంతో ప్రేక్షకుడిని ఎంతని మెప్పించగలరు? ఎన్ని తళుకులున్నప్పటికీ ఏ సినిమాకైనా కావాల్సింది.. సరైన కథ దాన్ని బిగితో చెప్పే కథనం. ఆ రెండు విషయాల్లో మాత్రం ‘సాహో’ ఘోరంగా విఫలమైంది. ఆరంభం నుంచి హీరోకు ఒక ముసుగేసి చూపించి.. ఇంటర్వెల్ దగ్గరో.. క్లైమాక్సులోనో తూచ్.. మీరు చూసిందంతా అబద్ధం.. హీరో అసలు రూపం ఇది అని బయటపెడితే.. అబ్బబ్బా ఏం ట్విస్టు ఏం ట్విస్టు అనుకుని.. మధ్యలో చూసిన ట్రాష్ అంతా మరిచిపోయి సినిమాను పొగిడేసే రోజులు ఎప్పుడో పోయాయి. ఇలాంటి ట్విస్టులకు థ్రిల్ అవడం మాని.. ముందు నుంచే ఎప్పుడు ఏం ట్విస్టు వస్తుందో ముందే గెస్ చేసి.. చెప్పానా ముందే ఇలా జరుగుతుందని అనే రేంజికి ప్రేక్షకులు వెళ్లిపోయారు. కేవలం ట్విస్టుల్ని నమ్ముకుని.. లేదంటే ట్విస్టుల కోసమే సినిమాలు తీసే రోజులకు కాలం చెల్లింది. కానీ ‘రన్ రాజా రన్’లో ట్విస్టులతో పాటు మిగతా కథాకథనాల్ని కూడా బలంగా తీర్చిదిద్దుకుని.. చక్కటి ఔట్ పుట్ ఇచ్చిన యువ దర్శకుడు సుజీత్.. ఈసారి నేల విడిచి సాము చేశాడు. కథ ఎలా ఉన్నా..పరిమితమైన వనరులతోనే కథనంతో మాయాజాలం చేయగల పనితనం ఉందని ‘రన్ రాజా రన్’తో రుజువు చేసిన అతను.. ఈసారి అవసరానికి మించి వనరులున్నా వాటిని ఉపయోగించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఇంటలిజెంట్ స్క్రీన్ ప్లే అంటే ప్రేక్షకుల బుర్రలకు పదును పెట్టేలా ఉండాలి. కానీ ఇందులో సుజీత్ స్క్రీన్ ప్లే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. నీరసం తెప్పించే నరేషన్.. తెరపై ఏం జరుగుతుందో తెలియని గందరగోళంతో సినిమా మొదలైన కాసేపటికే తీవ్ర అసహనానికి గురి చేస్తుంది ‘సాహో’. ‘సాహో’లో ప్రభాస్ ఎంట్రీ చూస్తేనే సినిమాపై కాస్త అంచనాలు తగ్గించుకుని చూస్తే మంచిదనే సంకేతాలు ఇస్తుంది. ‘బాహుబలి’ లాంటి సినిమా తర్వాత ప్రభాస్ కు సరైన ఇంట్రో కూడా ఇవ్వలేకపోవడం సుజీత్ ఘోర వైఫల్యమే. ఆరంభ సన్నివేశాలతోనే ప్రేక్షకుల ఉత్సాహాన్ని చల్లార్చేసే ‘సాహో’.. తొలి గంటలో అసలెక్కడా మళ్లీ ఉత్సాహం తెచ్చుకునే అవకాశమే లేకుండా చేస్తుంది. ఏం ఆశించాం.. ఏం చూస్తున్నాం అనే సందేహాల్ని అడుగడుగునా రేకెత్తిస్తూ చాలా భారంగా ముందుకు సాగుతుంది ‘సాహో’. ఇంటర్వెల్ దగ్గర ట్విస్టు ఉంటుందన్న సంకేతాలు ముందు నుంచే అందుతుంటాయి.. పైగా మన ప్రేక్షకులకు ఇవేమీ కొత్త కూడా కాదు కాబట్టి మైండ్ బ్లాంక్ అయిపోయే పరిస్థితి ఏమీ ఉండదు. ప్రేక్షకులు ఆశించినట్లుగా తొలి అర్ధభాగంలో భారీ యాక్షన్ ఘట్టాలు - విజువల్ మాయాజాలాలు కూడా ఏమీ లేవు. రొమాంటిక్ ట్రాక్ బోర్ కొట్టించడం - సయ్యా సైకో పాట అంచనాలకు తగ్గట్లు లేకపోవడం వల్ల తొలి అర్ధభాగం పూర్తిగా నీరుగారిపోయింది. ద్వితీయార్ధంలో కూడా ఓ అరగంట పాటు కథలో ఏ కదలికా ఉండదు. అసలేమాత్రం అర్థం కాని రీతిలో సన్నివేశాలు వస్తుంటాయి పోతుంటాయి. ఒకరి మీద ఒకరు ఎటాక్ చేసుకుంటూ తుపాకీల మోత మోగించడంతోనే పుణ్యకాలం గడుస్తుంది. ‘సాహో’ మేకింగ్ దశలో తెగ చర్చనీయాంశమైన అబుదాబి యాక్షన్ ఎపిసోడ్ తెరమీద కనిపించాక కానీ ప్రేక్షకుడిలో కాస్త ఉత్సాహం రాదు. కథకు అది ఏమాత్రం అవసరం అన్నది పక్కన పెడితే అందులోని భారీతనం మాత్రం ఆకట్టుకుంటుంది. కాస్త ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. కానీ దాని ముగింపులో మనం చూస్తున్నది సూపర్ హీరో సినిమా అన్నట్లుగా అర్థరహితమైన - ఇల్లాజికల్ సీక్వెన్స్ దాన్ని కూడా కామెడీగా మార్చి పడేశారు. ఇక ఆపై సుదీర్ఘంగా సాగే పతాక ఘట్టం.. అందులోని మేజర్ ట్విస్టుతో సినిమా ముగింపు దిశగా సాగుతుంది. అప్పటికది థ్రిల్ కలిగించినా.. అప్పటిదాకా ప్రేక్షకుల్ని పట్టిన నీరసాన్ని వదిలించే స్థాయిలో అయితే పతాక సన్నివేశం లేదు. అసలే మరీ నెమ్మదిగా.. బోరింగ్ గా సాగే నరేషన్ అంటే.. దీనికి దాదాపు మూడు గంటల నిడివి అంటే ప్రేక్షకుడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చివరాఖరుగా కలిగే సందేహం ఒకటే.. దీనికి నిజంగా రూ.350 కోట్ల ఖర్చు పెట్టారా అని. సినిమా అంతటా భారీతనం కనిపిస్తుంది కానీ.. ఆ బడ్జెట్ కు తగ్గ ఔట్ పుట్ అయితే కనిపించదు. అయినా అసలు విషయం తక్కువైనపుడు అనవసరపు హంగులు ఎన్ని జోడిస్తే ఏం లాభం? 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.