Jump to content

Lavanya mogudu kood dhorikadanta


Recommended Posts

Posted

Iddharu kalasi jail lo kapuram emo. lafoot edhavalu.

అవినీతిలో ఆలుమగలు


 

అవినీతిలో ఆలుమగలు

రెండు నెలల వ్యవధిలో అనిశా వలలో దంపతులు
జులైలో రూ.93 లక్షల నగదుతో చిక్కిన తహసీల్దార్‌ లావణ్య
నకిలీ ఉద్యోగమిచ్చి దొరికిన ఆమె భర్త వెంకటేశ్వర్‌ నాయక్‌
బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి అక్రమాలు

31main16a_2.jpg

ఈనాడు, హైదరాబాద్‌: ఆ దంపతులిద్దరూ ప్రభుత్వ అధికారులు. రెండు నెలలు తిరక్కుండానే ఇద్దరూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు దొరికిపోయారు.  రూ.93 లక్షల నగదును ఇంట్లో ఉంచుకుని కేశంపేట తహసీల్దార్‌ లావణ్య జులైలో ఏసీబీ అధికారులకు చిక్కగా, ఇప్పుడు ఆమె భర్త, పురపాలకశాఖ ప్రాంతీయ కార్యాలయ సూపరింటెండెంట్‌ నునావత్‌ వెంకటేశ్వర్‌ నాయక్‌ పట్టుబడ్డారు. అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ అచ్చేశ్వర రావు బృందం శుక్రవారం రాత్రి ఆయనను అరెస్ట్‌ చేసింది. మధ్యవర్తి కందుకూరి ప్రకాష్‌ను అరెస్ట్‌ చేసి శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని పురపాలకశాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకటేశ్వరనాయక్‌ హన్మకొండకు చెందిన రణధీర్‌ నుంచి గతేడాది జులైలో రూ.2.50 లక్షలు తీసుకుని నకిలీ నియామక పత్రాన్ని ఇచ్చాడు. ఇదే సమయంలో ఆ కార్యాలయంలో పనిచేస్తున్న  ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని ప్రసూతి సెలవుపై వెళ్లడంతో ఆమెకు వచ్చే నెల జీతాన్ని వెంకటేశ్వర్‌ నాయక్‌ రణధీర్‌ ఖాతాలో వేయించాడు. ఈ ఏడాది జనవరిలో మహిళా ఉద్యోగి తిరిగిరావడంతో రణధీర్‌కు జీతం ఇవ్వలేకపోయాడు. ఏప్రిల్‌ తొలివారంలో రణధీర్‌ పురపాలక శాఖ ప్రాంతీయ అధికారిని కలిసి విషయాన్ని వివరించగా... ఇది నకిలీ నియామకపు పత్రమని తేల్చేశారు. అయినా మరో రూ.40వేలు ఇస్తే ఈపీఎఫ్‌, ఈఎఎస్‌ఐ సౌకర్యాలు కల్పిస్తానంటూ రణధీర్‌కు ఆశచూపించాడు. డబ్బులు లేవని, తనకు రావలసిన నాలుగునెలల జీతం ఇవ్వాలంటూ రణధీర్‌ వెంకటేశ్వర నాయక్‌ను ప్రశ్నిస్తే పోలీసులకు పట్టిస్తానంటూ బెదిరించాడు. దీంతో రణధీర్‌ భయపడి హన్మకొండకు వెళ్లిపోయాడు. వెంకటేశ్వర్‌ నాయక్‌ భార్య లావణ్యను అనిశా అధికారులు అరెస్ట్‌ చేశారన్న విషయం తెలుసుకున్న రణధీర్‌ ధైర్యం తెచ్చుకుని రెండు వారాల క్రితం అనిశా డీఎస్పీని అచ్చేశ్వరరావును కలసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ ఇవ్వడంతో వారం క్రితం కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఆజాద్‌ బృందం వెంకటేశ్వర్‌ నాయక్‌ కదలికలపై నిఘా ఉంచి శుక్రవారం అతడితో పాటు ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

భార్యా, భర్తలు..లక్షల్లో వసూళ్లు..
వెంకటేశ్వర్‌ నాయక్‌, లావణ్యలు కొన్నేళ్లుగా బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు అనిశా అధికారులు గుర్తించారు. రణధీర్‌ అనిశా అధికారులను కలవడంతో ఆయన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. వెంకటేశ్వర్‌ నాయక్‌పై అవినీతి నిరోధక చట్టంలో పది సెక్షన్లు,  ఐపీసీ 420 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేసినట్లు అనిశా డీఎస్పీ అచ్చేశ్వరరావు తెలిపారు

Posted

ilanti couples mastu mandi unnaru india lo , easy way money earning and buildups okarange lo

Posted

He still took bribe even after his wife was caught and jailed. Because he knows this is temporary and they will get back their jobs any way after some time.

Sad state of corruption in our country. 

Posted
4 minutes ago, boeing747 said:

Valla kids ni school lo embarrassing ga untademo

change the school

Posted

Lucky compatabile couple. Jail lo unna byata unna happy marital life untadhi. Evening intikocchaka nuvventha dhobbav ante nuvventha dhobbav anukuntu anyonyanga untaaru.

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...