RollNo21 Posted September 18, 2019 Report Posted September 18, 2019 బిగ్ బాస్ షో -- రాబోవు తరాల సహజీవనం ******* ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది? ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో "వ్యభిచార ముఠా గుట్టు రట్టు" అని వార్త వస్తుంది. కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరుపెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు గంటల చొప్పున టీవీల్లో ప్రసారం చేస్తే దాన్ని బిగ్ బాస్ షో అంటున్నారు. రాబోవు తరాలని సహజీవనం అనే విష సంస్కృతి వైపు ఈడ్చుకెళ్లి, ఈ దేశ కుటుంబ వ్యవస్థల్ని బజారున పడేసే ఇట్లాంటి పనికి మాలిన "షో" ల నుండి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం *BIG BOSS. BIG BOSS* *ఎవడీ BIG BOSS ?* *ఎక్కడ నుండి వచ్చాడు ఈ BIG BOSS ?* *ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?* *ఎవరి కోసం వచ్చాడు ఈ BIG BOSS ?* *మన ఇంటికే ఎందుకు వచ్చాడు ఈ BIG BOSS ?* *వీడి విష సంస్కృతి ఏమిటి ?* ప్రపంచంలోనే అద్భుతమైన , పటిష్టమైన కుటుంబ వ్వవస్ద కలిగిన వారు భారతీయులు . విదేశీయులు సైతం మన కుటుంబ వ్వవస్ద ని ఆచరిస్తున్నారు / ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు . *ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన మన భారతీయ కుటుంబ వ్వవస్దని సర్వనానం చేయడానికి వచ్చాడు ఈ *BIG BOSS* . బారత దేశంలో అన్ని మతాలవారు , అన్ని కులాల వారు సనాతనమైన , సమ్మతమైన , ఉత్తమమైన , పటిష్ట మైన మన కుటంబమైన వ్వవస్దని ఆచరిస్తున్నారు . మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ Big Boss ని సుమారుగా రెండు గంటలు కలిసి చూసి , ఆనందిస్తున్నారు . మరి *మీరు ఏ నాడైన ఆలోచించినారా?* మీ రెండు తరాలు సర్వనాశనం అయిపోతున్నాయి . ఈ BIG BOSS లో పైళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే HOUSE లో కలిసి మెలసి , సహజీవనం చేస్తున్నారు . ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు . మరి పెళ్ళయైన స్త్రీ / పురుషులు , పరాయి వాళ్ళతో ఎలా సహజీవనం చేస్తారు . ? *ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ?* ప్రతి రోజు ఎవరో ఒకరు ఘర్షణ పడటం , తర్వాత గట్టిగా కౌగలించు కోవడం , ఇదేనా మన సంస్కృతి ? ఎంత అసహ్యకరమైన వెకిలి చేష్టలు , వెర్రి పోకడలు . *ఇవన్నియు మనము మన కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నాం* . మరి భవిష్యత్తులో మీ భార్య లేక మీ భర్త పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా / ఒప్పుకుంటారా ? మీ కొడుకు , కోడలు , బిడ్డ , అల్లుడు మొదలగు వారు పరాయి వాళ్ళతో కొన్ని రోజులు , కొన్ని నెలలు , కొన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తామంటారు , *అనుమతిస్తారా ?* యుక్త వయసులో వుండే మీ బిడ్డల మాటేంటి ? మీతో కలిసి చూస్తున్న మీ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇతరులతో సహజీవనానికి *ఒప్పుకుంటారా?* ఎలా చూస్తారండి ఈ దరిద్రపు Big Boss ని . కాస్త ఆలోచించడి . అందరూ చదువుకున్న వారే ,కాని కాస్త ఇంగిత జ్ఞానం కోల్పోయినారు . మీరు చేస్తున్న తప్పుని తెలుసుకొండి . *మేలుకోండి* మీ కుటుంబాలని కాపాడుకోండి . గత కొన్ని సంవత్సరాలుగా మన T. V. తెలుగు సీరియల్స్ మన కుటుంబ వ్వవస్దని చీల్చి చెండాడి నాయి / చెండాడు తున్నాయి . కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ , అనురాగాలు , అభిమానం , కరుణ మొదలగు నవి పూర్తిగా తగ్గిపోయినాయి . విదేశి విష సంస్కృతి ని వెదజల్లే ఈ BIG BOSS ని చూస్తారా ? BIG BOSS .హింసించడం లేదు ,మన కుటుంబాలను నిట్ట నిలువునా , అతి కిరాతకంగా గొడ్డలితో నరుకుతున్నాడు . *చూస్తారా ? చూస్తారా ?* Quote
Scada Posted September 18, 2019 Report Posted September 18, 2019 Matter in 4 lines is as follows. 9 minutes ago, RollNo21 said: పైళ్ళైయిన వారు / పెళ్ళికానివారు కొన్ని రోజులో ఒకే HOUSE లో కలిసి మెలసి , సహజీవనం చేస్తున్నారు 9 minutes ago, RollNo21 said: వెకిలి పనులు, అసహ్యకరంగా దుస్తులు , భంగిమలతో మనకు దర్సనమిస్తున్నారు 9 minutes ago, RollNo21 said: *ఇదేనా మన భారతీయ సంస్కృతి , సాంప్రదాయం ?* 10 minutes ago, RollNo21 said: మీ భార్య లేక మీ భర్త పరాయి వాళ్ళతో సహజీవనం చేస్తే భరిస్తారా Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.