Bodi_lafangi Posted October 2, 2019 Report Posted October 2, 2019 సైరా లో మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి అద్భుతమైన నటనకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డ్ ఇవ్వాలి. సైరా... విజువల్ వండర్. గ్రాండియర్ మూవీ. పీరియాడిyక్ సెన్సేషన్. ఈ తరాన్ని ఒకప్పటి స్వాతంత్రోద్యమ కాలంలోకి తీసుకెళ్లి... కళ్లకు కట్టినట్లు ఆనాటి పరిస్థితులను తెరకెక్కించిన సాహసోపేత చిత్రం... 'సైరా'! మూవీ చూస్తుంటే మనమూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నామా? అనిపించే గ్రాండ్ లుక్. ఈ సినిమాతో ఆడియన్స్ కనెక్ట్ అయి తీరుతారు. దేశం కోసం అప్పటి తరం చేసిన త్యాగాలు గుర్తొచ్చి గుండె చెమ్మగిల్లుతుంది. ఆ మహా ఉద్యమంలో ఎంతో మంది వీరులు, ధీరులు, శూరులు పాల్గొన్న... మరెంతో మంది అజ్ఞాతంలో ఉండి పోయి చరిత్రకెక్కనివారున్నారు. అలాంటి వారిలో 'సైరా'... ఒక్కరు. సీమ పౌరుషంతో సై... అంటూ తొడలు కొట్టి తెల్లదొరలపై లంఘించి ఉరికి... సమరానికి 'రా....! రమ్మంటు సవాల్ విసిరి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పై తనదైన శైలిలో పోరాటం సల్పిన... సైరా చూస్తుంటే ఆనందం తన్మయత్వంతో ఒళ్ళు పులకరిస్తుంది. ఈ పిరియడ్ మూవీకీ కాథానాయకుడే పెద్ద ఎస్సెట్. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు మాత్రమే చేయగల సత్తా ఉన్న పాత్ర అది. ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించిన మన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు ట్రాక్ లో ది బెస్ట్ అనిపించే మూవీ ఇది. సినీ ఫీల్డులో ఎంతో ఎక్స్ పీరియన్స్ గడించిన శ్రీ చిరంజీవి గారు సైరా పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే...సైరని సజీవంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. భారతదేశం గర్వించే మహత్తర చిత్రాన్ని దసరా కానుకగా అందించారు. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి గుర్రపుస్వారీ అంటే మహా ఇష్టం. ఇప్పటికీ గుర్రం ఎక్కితే ఆయనలోని రాజసం... ధీరత్వం... మెరిసి కనికట్టు చేస్తాయి. సైరా చిత్రంలో శ్రీ చిరంజీవి గారు చేసిన యుద్ధాలు గుర్రం ఎక్కి సంబరంగా నిర్మించిన తీరుతెన్నులు ఇవన్ని ఆడియన్స్ చేత ఆహా... ఓహో! అనిపించి తీరుతాయి. చిత్రంలో శ్రీ చిరంజీవి గారిని చూస్తూ... ఆయన సైరా పాత్రలో జీవించిన విధానానికి ఆశ్చర్యానికి గురవుతూ నోట మాట రాని భావోద్వేగ స్థితిలో ఆడియన్స్... మరీ ప్రత్యేకించి శ్రీ చిరంజీవి గారి అభిమానులు ఉండిపోయారంటే అతిశయోక్తి కాదు. నేనూ... శ్రీ చిరంజీవి గారిని చూస్తూ మైమరచిపోయాను. కండల వీరుడిగా... పంజావిసిరిన సమరసింహంలా... జూలు విదిల్చిన పులిలా ఆయనలా రెచ్చిపోతుంటే... థియేటర్లన్నీ ఈలలు, కేకలతో గోలగోలగా మారిపోయింది. ఎస్... మన తరం మహానటుడు శ్రీ చిరంజీవి గారు. మరెన్నో తరాల నటులకు స్ఫూర్తినిచ్చే నటుడు కూడా ఆయనే. అయన ఫ్యాన్స్ గా తలెత్తుకొని తిరిగే అభిమానులుగా మేమెన్నడూ ఆయన సేవలో తరిస్తాం. ఆయన్నే అభిమానిస్తాం. చివరి రక్తపు బొట్టు ఇంకేవరకు ఆయన్నే మార్గదర్శిగా ఆరాధిస్తాం. ఆయన ఫిలాసఫీనే శిరస్సుకెత్తి ప్రచారకర్తలుగా ఊరూరా చాటి చెపుతాం. మేమంతా శ్రీ చిరంజీవి గారి అభిమానులం. అదే మా కులం. మా మతం. మా ఇజం. జై చిరంజీవ అఖిల భారత చిరంజీవి యువత Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.