kakatiya Posted October 3, 2019 Report Posted October 3, 2019 టిక్‌టాక్ స్టార్‌కు ఎమ్మెల్యే టికెట్..! ఛండీగఢ్: వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ద్వారా ప్రాచుర్యం పొందే వ్యక్తులు సినిమాలకే కాదు.. రాజకీయాలకు సైతం ఎంపికవుతున్నారు. ఎందుకంటే తాజాగా హరియాణా శాసనసభ ఎన్నికల్లో ఓ టిక్‌టాక్ స్టార్‌కు భాజపా ఎమ్మెల్యే టికెట్ కేటాయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రెండోసారి విడుదల చేసిన జాబితాలో ఆదంపూర్ నియోజకవర్గ స్థానాన్ని ప్రముఖ టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫొగాట్‌కు కేటాయించింది. వివరాల్లోకి వెళ్తే.. సోనాలీ ఫొగాట్‌కు టిక్‌టాక్‌లో లక్షకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం ఆమె తన వీడియోలను పోస్ట్ చేస్తూ పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆమెకు చెందిన పలు వీడియోలు వైరల్‌గా కూడా మారాయి. ఆమెకు ఆన్లైన్ అభిమానులు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు బలం ఉన్న ఈ నియోజకవర్గంలో ఆమెకు గట్టి పోటీనే ఎదుర్కొవలసి ఉంటుందని సమాచారం. ఈ స్థానం నుంచి 1969 నుంచి వరుసగా 8సార్లు మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ గెలిచారు. ఆ తర్వాత 1987, 1998ల్లో ఆయన భార్య జస్మాదేవి, కుమారుడు కులదీప్ బిష్ణోయ్ ఒక్కోసారి గెలిచారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో బిష్ణోయ్ కుటుంబ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ స్థానాన్ని సోనాలీ ఫొగాట్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. బిష్ణోయ్ దంపతులు 2014 ఎన్నికల్లో హరియాణా జనహిత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయింది. హరియాణా శాసనసభకు అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా అక్టోబర్24న ఫలితాలు వెలువడనున్నాయి. Quote
xano917 Posted October 3, 2019 Report Posted October 3, 2019 Post her masala tik too videos . And be a responsible afdbian 1 Quote
Assam_Bhayya Posted October 3, 2019 Report Posted October 3, 2019 1 hour ago, xano917 said: Post her masala tik too videos . And be a responsible afdbian +116 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.