AndhraneedSCS Posted October 4, 2019 Report Posted October 4, 2019 ప్లాట్‌ఫాం టిక్కెట్ రూ.30... కొత్త స్కెచ్‌తో షాకిచ్చిన ప్యాసింజర్స్ 04-10-2019 18:03:53 విజయవాడ : దసరాకు ముందు ప్రధానమైన ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. దసరా రద్దీని నేపధ్యంలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ. 30 కు పెంచారు. కాగా పెరిగిన ధరలు దసరా పండుగ సందర్భంగా పది రోజులపాటు అమల్లో ఉంటాయని ప్రకటించింది. రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ల ధరను భారీగా పెంచడంతో ప్రయాణీకులు ఈ భారం నుంచి తప్పించుకోవడానికి కొత్త స్కెచ్ వేశారు. టికెట్ బాదుడు నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు కొత్త రూట్‌లో వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే శాఖ అవాక్కైంది. రూ. 30 ప్లాట్ ఫాం ధర కంటే తక్కువ దూరం ప్రయాణానికి టికెట్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో షార్ట్ జర్నీ టికెట్లు భారీగా అమ్ముడుపోతున్నాయి. మరోవైపు ప్లాట్‌ఫాం టికెట్ కౌంటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ టికెట్లకన్నా... గుంటూరు ప్యాసింజర్ రైలు టికెట్లు పెద్దమొత్తంలో అమ్ముడుపోతున్నాయి. రెండు గంటలు రైల్వే స్టేషన్‌లో ఉంటే ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర రూ. 30. అయితే తక్కువ దూరానికి 10 రూపాయలే ఉంటుంది. దీంతో రూ. 30 పెట్టి ప్లాట్‌ఫాం టికెట్ కొనే కంటే... రూ. 10 తో ఏకంగా టికెట్ కొంటే సరిపోతుందని అనుకోడమే. గుంటూరు, విజయవాడ స్టేషన్లలో చాలామంది ఇలానే చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో తమ బంధువులకు స్వాగతం పలికేందుకు, లేదా వీడ్కోలు పలికేందుకు వస్తున్న వారు... ఫ్లాట్‌ఫామ్ టికెట్‌కు బదులు పది రూపాయలు పెట్టి. గుంటూరు పాసింజర్ టికెట్లు కొంటున్నారు. దీంతో రూ. 20 ఆదా కావడమే కాకుండా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేందుకు అనుమతి లభిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే అధికారులు తాజాగా ప్రయాణికులనుద్దేశించి ఓ ప్రకటన చేశారు. ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంచడం వల్ల రైల్వే శాఖకు వచ్చే ఆదాయం అతి స్వల్పమని, ప్రయాణికుల భద్రత కోసమే పెంచామని చెబుతున్నారు. ‘దయచేసి ఫ్లాట్‌ఫామ్ టికెట్లు మాత్రమే కొనండి, తక్కువ ధర అని రైలు టికెట్లు కొనకండి’ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం... ప్యాసింజర్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు తమ పని అయిపోగానే ఆ టికెట్ ను స్టేషన్‌కు వచ్చే వేరేవారికి ఇచ్చేస్తున్నారు. ఆ టికెట్ 24 గంటల పాటూ చెల్లుబాటు కావడంతో ఈ పనిచేస్తున్నారు. మొత్తానికి ‘శతకోగటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు’ అని ఊరికే అనలేదేమో Quote
JAPAN Posted October 4, 2019 Report Posted October 4, 2019 hdyerabad lo andaru chesedhi idhega mmts ticket better than platform ticket Quote
Joker_007 Posted October 4, 2019 Report Posted October 4, 2019 🤣 🤣 🤣 ... Emaina cheppu mana vaalla thelivi mundu thellodu ayina thella bovalsinde...... Quote
Sachin200 Posted October 4, 2019 Report Posted October 4, 2019 Mana vallu vunantha smart evaru undaru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.