Sreeven Posted October 6, 2019 Report Posted October 6, 2019 కోళికోడ్ (కేరళ): అది కేరళలోని కోళికోడ్. ఓ ఉమ్మడి కుటుంబం. ఆనందమయ జీవితం. అలాంటి కుటుంబంలో 2002లో అనుకోకుండా విషాదం నెలకొంది. ఆ ఇంటి పెద్దావిడ అన్నమ్మ థామస్ (57) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. సరిగ్గా ఆరేళ్లకు 2008లో ఆమె భర్త టామ్ థామస్ (66) సైతం ఏదో తింటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో చనిపోయారని అందరూ భావించారు. 2011లో ఆ వృద్ధ దంపతుల కుమారుడు.. రాయ్ థామస్ (40) చనిపోయాడు. అతడి పోస్టుమార్టం నివేదికలో సైనేడ్ ఉన్నట్లు తేలింది. అతడి మృతిపట్ల అనుమానం వ్యక్తంచేసిన అన్నమ్మ థామస్ సోదరుడు మాథ్యూస్ (68) సరిగ్గా మూడేళ్ల తిరగకముందే 2014లో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతడూ చనిపోయాడు. 2016లో టామ్ థామస్ బంధువైన సిలీ కుమార్తె ఆల్ఫిన్ (2) మరణించింది. కొద్ది నెలల వ్యవధిలోనే సిలీ (27) కూడా చనిపోయింది. మొత్తం 14 ఏళ్లు.. 6 మరణాలు. అందరూ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. క్రైమ్ థ్రిల్లర్ తలపిస్తున్న ఈ ఘటనలో అనుకోని మలుపు తిరిగింది. 2011లో చనిపోయిన రాయ్ థామస్ భార్య జాలీ, చివర్లో చనిపోయిన సిలీ భర్త వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ కుటుంబ ఆస్తి వారి పరమైంది. ఇంతకీ ఆ కుటుంబ సభ్యులందరిదీ సహజ మరణమేనా?అన్న అనుమానం ఆ కుటుంబాన్ని దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరిలోనూ కలగక మానదు. ఇదే అనుమానం అమెరికాలో ఉంటున్న టామ్ చిన్నకుమారుడు మోజోకు కూడా కలిగింది. ఆస్తి బదలాయింపు సహా వరుస మరణాలపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఇంటి కోడలే ఈ హత్యలన్నీ చేసిందని తేలింది. ఆస్తికోసం.. ఆ ఇంటి ఆస్తి వ్యవహారాలన్నీ అన్నమ్మ చేతిలో ఉండడంతో తొలుత జాలీ ఆమెను హతమార్చింది. దీంతో ఆ ముసలావిడ భర్త టామ్ ఆస్తిలో కొంత వాటాను జాలీ దంపతులకు రాసిచ్చాడు. అంతటితో సంతృప్తి పడని జాలీ మరింత కావాలని ఆశపడింది. ఈ నేపథ్యంలో భర్తతో తగాదాల వల్ల అతడిని హతమార్చింది. భర్త పోస్టుమార్టం నివేదికలో సైనేడ్ ఉందని అనుమానించిన మాథ్యూస్‌ను కూడా చంపింది. షాజును వివాహం చేసుకునేందుకు అడ్డుగా ఉన్నారని భావించి ఆల్పైన్, సిలీని చంపింది. ఇలా ఆస్తి కోసం ఒకరి తర్వాత ఒకరు చొప్పున మొత్తం 14 ఏళ్లలో ఆరుగురిని హతమార్చింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.