walter18 Posted October 10, 2019 Author Report Posted October 10, 2019 అవుట్ గోయింగ్ కాల్స్ కు Jio చార్జీలు షురూ! జియో అంటే ఆల్ ఫ్రీ. ఇది అందరి మాట. కానీ ఈ మాట గతంలో కలిసిపోబోతుంది. ఎందుకంటే జియో కూడా నేటి నుంచి అవుట్ గోయింగ్ కాల్స్ కు చార్జీలు షురూ చేయనుంది. అవును మీరు చదివింది నిజమే! అక్టోబర్ 10 తర్వాత మీరు ఎప్పుడు రీచార్జ్ చేస్తే అప్పటి నుంచి మీకు అవుట్ గోయింగ్ కాల్స్ పై చార్జీలు పడతాయి. Quote
walter18 Posted October 10, 2019 Author Report Posted October 10, 2019 జియో నుంచి జియోకి ఉచితమే... అయితే మీ అవుట్ గోయింగ్ కాల్స్ అన్నిటికీ చార్జీలు పడవు. మీరు జియో సిమ్ నుంచి జియో సిమ్ కు కాల్ చేస్తే మీకు కాల్ చార్జీలు ఉచితమే. అదే జియో నుంచి వేరే నెట్ వర్క్ కు కాల్ చేసినప్పుడు మాత్రమే చార్జీలు పడతాయి. అది కూడా ఎంతో ఎక్కువగా కాకుండా కేవలం నిమిషానికి ఆరు పైసలను మాత్రమే చార్జీగా విధించనున్నారు Quote
walter18 Posted October 10, 2019 Author Report Posted October 10, 2019 రూ.10కి 1 జీబీ డేటా.. అయితే ఈ ఐయూసీ చార్జీలకు సంబంధించి కూడా వినియోగదారులకు ఉపశమనం కలిగే వార్త ఒకటి ఉంది. ఈ చార్జీల కోసం ఐయూసీ టాపప్ అని ప్రత్యేకమైన టాపప్ వోచర్లు ఉంటాయి. ఆ వోచర్ల ద్వారా రీచార్జ్ చేసుకున్నప్పుడు మాత్రమే బయట నెట్ వర్క్ లకు కాల్ చేసుకోవచ్చు. రూ.10 టాపప్ తో 124 నిమిషాలు, రూ.20 టాపప్ తో 249 నిమిషాలు, రూ.50 టాపప్ తో 656 నిమిషాలు, రూ.100 టాపప్ తో 1,362 నిమిషాల పాటు బైట నెట్ వర్క్ లతో మాట్లాడవచ్చు. అయితే ఈ ఐయూసీ చార్జీలకు పరిహారంగా ప్రతి రూ.10 టాపప్ కి 1 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. అంటే రూ.20 టాపప్ కు 2 జీబీ, రూ.50 టాపప్ కు 5 జీబీ, రూ.100 టాపప్ కు 10 జీబీ చొప్పున అన్నమాట. Quote
kevinUsa Posted October 10, 2019 Report Posted October 10, 2019 good days coming to indian telecom industry Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.