Jump to content

Chota mota electronics ammukunne shops diwala?


Recommended Posts

Posted
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ డిస్కౌంట్లపై ప్రభుత్వం నజర్
15-10-2019 17:34:48
 
 
637067576896241612.jpg
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు పండుగ సమయాల్లో డిస్కౌంట్లతో హోరెత్తించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇలా గుక్కతిప్పుకోలేని ఆఫర్లను ప్రకటించడం విదేశీ పెట్టుబడుల నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలు భారీ రాయితీలతో హోరెత్తించడం వల్ల చిన్నచిన్న రిటైల్ దుకాణాలపై ఆధారపడే దేశంలోని 130 మిలియన్ల మందిపై ప్రభావం పడుతుందని అంచనా. దీంతో చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
 
ఈ-కామర్స్ సైట్లకు ఈ నిబంధనలు రుచించకపోవడమే కాకుండా అమెరికా నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అంతేకాదు, భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను ఈ నిబంధనలు కొంతమేర దెబ్బతీశాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు మాత్రం తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నాయి. స్థానిక వ్యాపార సంస్థలు మాత్రం ఈ రెండింటి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆరోపిస్తున్నాయి. ఫెస్టివ్ సీజన్‌లో ఒక్కోసారి 50 శాతానికి పైగా ఆఫర్లు ప్రకటిస్తుండడం వల్ల తమ వ్యాపారం దారుణంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
 
దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. అలాగే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) చేసిన ఫిర్యాదుపైనా స్పందించింది. సీఏఐటీలో దేశవ్యాప్తంగా 70 మిలియన్ల మంది చిన్న వ్యాపారులు సభ్యులుగా ఉన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని సీఏఐటీ తమ ఫిర్యాదులో ఆరోపించింది.
 
ఆరోపణలపై చర్చించేందుకు రావాల్సిందిగా ఈ-కామర్స్ సంస్థలకు ప్రభుత్వం సమన్లు జారీ చేయగా, గత వారం ప్రభుత్వం ఆయా సంస్థలతో సమావేశమైంది. తాజాగా, ఈ సమావేశం గురించి ఫ్లిప్‌కార్ట్ మాట్లాడుతూ.. సమావేశం బాగానే జరిగిందని పేర్కొంది. తాము పూర్తిగా భారత్‌లోని నియమ నిబంధనల మేరకే నడుచుకుంటున్నట్టు తెలిపింది. అమెజాన్ కూడి ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది.
 
నమ్మశక్యం కాని ఆఫర్ల కారణంగానే వినియోగదారులు అటువైపు మళ్లుతున్నారని, ఈ కారణంగా ఆఫ్‌లైన్ మార్కెట్ అమ్మకాలు ఈ నెలలో 30 నుంచి 40 శాతం పడిపోయాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. కాగా, నిబంధనలకు పాతరేస్తూ అమ్మకాలు సాగిస్తున్న ఈ-కామర్స్ సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నదీ చెప్పేందుకు వాణిజ్యమంత్రిత్వ శాఖ అధికారులు ఉన్నతాధికారులు నిరాకరించారు
Posted

Returns reject chestunaru ani case lu tisukunte darloki vastaru

Flipkart return policy worst 

Posted

India lo returns teesukoru ga shops lo.. not sure how it will benefit  local shops 

Posted
Just now, AndhraneedSCS said:

India lo returns teesukoru ga shops lo.. not sure how it will benefit  local shops 

Defect products vastai ga

Posted

FK/AZ ni em peekaleru..

Vallu high discounts iche sales yearly once or twice (BBD/GIF)

remaining sales anni bogus..every month same prices..hadavidi thappa emi ledu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...